Golden Globes 2024 అవార్డుల్లో సత్తా చాటిన 'ఓపెన్ హైమర్'.. ఏకంగా 5 అవార్డులు

Golden Globes 2024: ప్రపంచ చలన చిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే 81వ ‘గోల్డెన్‌ గ్లోబ్‌’ (Golden Globe) అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం అట్టహాసంగా జరిగింది.

Courtesy: Top Indian News

Share:

ప్రపంచ చలన చిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే 81వ ‘గోల్డెన్‌ గ్లోబ్‌’ (Golden Globe) అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం అట్టహాసంగా జరిగింది. ఆదివారం (జనవరి 7) రాత్రి అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో ఉన్న బెవెర్లీ హిల్టన్ లో ఈ వేడుకలు జ‌రిగాయి. ఇక ఈ అవార్డుల్లో హాలీవుడ్ చిత్రం ‘ఓపెన్‌హైమర్‌’ ఉత్తమ చిత్రంగా నిలిచింది. సిలియన్ మర్ఫీ ప్రధాన పాత్రలో నటించిన  ఈ చిత్రం ఐదు అవార్డులను కైవసం చేసుకుంది. 

ఓపెన్ హైమర్ చిత్రం ఎనిమిది విభాగాల్లో నామినేటై ఏకంగా ఐదింటిలో అవార్డులు గెలుచుకుంది. ఉత్తమ చిత్రం ‘ఓపెన్‌హైమర్‌' (డ్రామా) , ఉత్తమ దర్శకుడు (క్రిస్టఫర్‌ నోలన్‌), ఉత్త‌మ నటుడు( సిలియాన్ మర్ఫీ), ఉత్తమ సహాయ నటుడు (రాబర్ట్ డౌనీ), ఉత్త‌మ‌ ఒరిజినల్ స్కోర్ (లుడ్విగ్ గోరాన్సన్) విభాగాల్లో ఓపెన్‌హైమర్‌కు అవార్డులు అందుకుంది. 2023 జులై 21న రిలీజైన ఈ మూవీ $954 మిలియన్ల వసూలు చేసింది. ఈ అవార్డుల ప్రదానోత్సవంలో హాలీవుడ్ ప్ర‌ముఖులు సందడి చేశారు. మార్గోట్ రాబీ, ర్యాన్ గోస్లింగ్ నటించిన ‘బార్బీ’ కూడా పలు కేటగిరీల్లో అవార్డులను సొంతం చేసుకుంది.

ఉత్తమ చిత్రం-ఓపెన్‌హైమర్‌
ఉత్తమ కామెడీ చిత్రం-పూర్‌ థింగ్స్‌
ఉత్తమ ఆంగ్లేతర చిత్రం-అనాటమీ ఆఫ్ ఎ ఫాల్
ఉత్తమ యానిమేటెడ్‌ చిత్రం-ది బాయ్ అండ్ ది హెరాన్
బాక్సాఫీస్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు-వార్నర్ బ్రదర్స్ (బార్బీ)
ఉత్తమ దర్శకుడు-క్రిస్టఫర్‌ నోలన్‌ (ఓపెన్‌హైమర్‌)
ఉత్తమ స్క్రీన్‌ప్లే-జస్టిన్‌ సాగ్‌ ట్రైట్‌, ఆర్ధర్‌ హరారి (అనాటమీ ఆఫ్‌ ఎ ఫాల్‌)
ఉత్తమ నటుడు-సిలియన్ మర్ఫీ (ఓపెన్‌హైమర్‌)
ఉత్తమ నటి-లిల్లీ గ్లాడ్‌స్టోన్ (కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్)
ఉత్తమ హాస్య నటి-ఎమ్మా స్టోన్ (పూర్‌ థింగ్స్‌)
ఉత్తమ హాస్య నటుడు-పాల్ గియామట్టి (ది హోల్డోవర్స్)
ఉత్తమ సహాయనటి-డావిన్ జాయ్ రాండోల్ఫ్ (ది హోల్డోవర్స్)
ఉత్తమ సహాయనటుడు-రాబర్ట్ డౌనీ జూనియర్ (ఓపెన్‌హైమర్)
ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌-వాట్‌ వాస్‌ ఐ మేడ్‌ (బార్బీ)
ఉత్తమ ఒరిజినల్‌ స్కోర్‌-లుడ్విగ్ గోరాన్సన్ (ఓపెన్‌హైమర్)