పెళ్ళి కాకుండానే తల్లి కాబోతున్న గోవా బ్యూటీ ఇలియానా ఫొటోస్ వైరల్

టాలీవుడ్‌లోకి హీరోయిన్ ఇలియానా దేవదాసు సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. తన మొదటి సినిమాతోనే మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత మహేష్ బాబు నటించిన పోకిరి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. అంతేకాకుండా ఈ ముద్దుగుమ్మ మొట్టమొదటిసారి కోటి రూపాయలు అందుకున్న యంగ్ హీరోయిన్‌గా  పేరు కూడా సంపాదించింది. ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్‌గా ఒక వెలుగు […]

Share:

టాలీవుడ్‌లోకి హీరోయిన్ ఇలియానా దేవదాసు సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. తన మొదటి సినిమాతోనే మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత మహేష్ బాబు నటించిన పోకిరి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. అంతేకాకుండా ఈ ముద్దుగుమ్మ మొట్టమొదటిసారి కోటి రూపాయలు అందుకున్న యంగ్ హీరోయిన్‌గా  పేరు కూడా సంపాదించింది. ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగింది. అయితే ఆ తర్వాత బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.  దీంతో ఈమె కెరియర్ కూడా పూర్తిగా నాశనం అయ్యిందని చెప్పవచ్చు.

అటు తెలుగు, ఇటు హిందీ పరిశ్రమలలో అవకాశాలు రాక సతమతమవుతున్న సమయంలో టాలీవుడ్‌లో రీయంట్రీ ఇవ్వడానికి పలు ప్రయత్నాలు చేసినా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. దీంతో సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోలను సైతం ప్రదర్శిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. అయితే గతంలో ఒక వ్యక్తితో లవ్‌లో ఉన్నట్లుగా కూడా తెలియజేసింది ఇలియానా.  గతంలో పోర్చుగల్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో రిలేషన్షిప్ మైంటైన్ చేసింది అంటూ గతంలో ఎక్కువగా రూమర్లు వినిపించాయి. కానీ కొన్ని కారణాల చేత అతనితో బ్రేకప్ అయిన తర్వాత.. ఈ మధ్యకాలంలో స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ సోదరుడితో ఈమె డేటింగ్‌లో ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు అప్పుడప్పుడు పలు వెకేషన్స్‌కి వెళుతూ పలు రకాలుగా ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది.

అయితే ఈ రోజున అందరికీ షాక్ ఇచ్చే విధంగా ఒక పోస్ట్‌ని షేర్ చేసింది ఇలియానా. తాను ప్రెగ్నెంట్ అని ఇన్స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. పెళ్లి విషయంపై ఎలాంటి టాపిక్ లేకుండానే డైరెక్ట్‌గా తాను ప్రెగ్నెంట్ అని ఇలియానా ఒక పోస్ట్ షేర్ చేయడంతో పాటు దీనికి తన తల్లి కూడా గ్రాండ్ బేబీ అంటూ కామెంట్లు చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరి ఇలియానా పెళ్లి కాకుండానే తల్లి కావడంపై అభిమానులు పలు రకాలుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ పోస్ట్ విషయంలో అందరూ శుభాకాంక్షలు చెప్పే కంటే, ప్రశ్నలతోనే ఎక్కువగా స్పందిస్తున్నారు.

ఇలియానా ముంబైలో పుట్టి పెరిగింది.. 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ఈమె కుటుంబం గోవా వెళ్లిపోయి అక్కడే సెటిల్ అయిపోయారు.  ఇక ఆ తర్వాత మోడలింగ్ వైపు ఎంట్రీ ఇచ్చిన ఈమె చిన్న వయసులోనే పలు యాడ్స్ లలో నటించింది.. అలా నెమ్మదిగా తెలుగు సినీ ఇండస్ట్రీలో అవకాశాలు రావడంతో  ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ క్రేజ్, ఫాలోయింగ్‌తోనే బాలీవుడ్‌లో నాలుగేళ్ల పాటు సినిమాలు చేసినా పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. వీటికి తోడు బరువు కూడా పెరగడం ఇలియానా కెరియర్‌కు కాస్త మైనస్ అయిందని చెప్పవచ్చు. గతంలో నాజూకైన నడుముతో అందరినీ ఆకట్టుకున్న ఇలియానాని ఇలా చూసిన అభిమానులు “ఈమె ఇలియానానేనా” అంటూ కూడా పలు రకాలుగా ట్రోలింగ్ చేయడం జరిగింది. ఏది ఏమైనా ఇలియానా ప్రెగ్నెన్సీ విషయంతో అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు.