Gautham Vasudev Menon: అందుకోసమే నటుడిగా మారా: గౌతమ్‌ మీనన్‌

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ గౌతమ్‌ మీనన్‌ (Gautham Vasudev Menon) ఈ మధ్య నటుడిగానూ పలు సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేశారు. అయితే ఆయన చియాన్ విక్రమ్ హీరోగా 2017లో మొదలుపెట్టిన ‘ధ్రువ నక్షత్రం’ (Dhruva Natchathiram) మూవీ ఆరేళ్లుగా మూలనపడింది. ప్రస్తుతం ఈ మూవీ రిలీజ్‌కు సిద్ధమవుతుండగా.. ఇన్నాళ్లూ ఎందుకు ఆగిపోయిందో తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు గౌతమ్. క్లాసిక్‌, విభిన్నమైన ప్రేమకథా చిత్రాలు తెరకెక్కించడంలో దర్శకుడు గౌతమ్‌ మేనన్‌ (Gautham Vasudev Menon) దిట్ట. […]

Share:

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ గౌతమ్‌ మీనన్‌ (Gautham Vasudev Menon) ఈ మధ్య నటుడిగానూ పలు సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేశారు. అయితే ఆయన చియాన్ విక్రమ్ హీరోగా 2017లో మొదలుపెట్టిన ‘ధ్రువ నక్షత్రం’ (Dhruva Natchathiram) మూవీ ఆరేళ్లుగా మూలనపడింది. ప్రస్తుతం ఈ మూవీ రిలీజ్‌కు సిద్ధమవుతుండగా.. ఇన్నాళ్లూ ఎందుకు ఆగిపోయిందో తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు గౌతమ్.

క్లాసిక్‌, విభిన్నమైన ప్రేమకథా చిత్రాలు తెరకెక్కించడంలో దర్శకుడు గౌతమ్‌ మేనన్‌ (Gautham Vasudev Menon) దిట్ట. 2016లో విక్రమ్‌ హీరో (Hero Vikram) గా ఆయన అనౌన్స్‌ చేసిన భారీ ప్రాజెక్ట్‌ ‘ధ్రువ నక్షత్రం’ (Dhruva Natchathiram). ఎన్నో అవాంతరాలు దాటుకుని ఆ సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో గౌతమ్‌ మీనన్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూ(Interview)లో పాల్గొన్నారు. ‘సీతారామం’ ‘లియో’, ‘కనులు కనులను దోచాయంటే’ వంటి చిత్రాల్లో నటుడిగా కనిపించడంపై స్పందించారు. ఇష్టంతో తాను నటుడిని కాలేదని అన్నారు.

‘‘నటనపట్ల ఆసక్తితో సినిమాల్లో నటించడం లేదు. ‘ధ్రువ నక్షత్రం(Dhruva Natchathiram)’ కోసమే నేను నటుడిగా మారా. ఆయా చిత్రాల్లో యాక్ట్‌ చేసినందుకు గానూ వచ్చిన పారితోషికాన్ని ఈ సినిమా మేకింగ్‌.. విడుదల కోసం ఉపయోగించా. అలాగే, సినిమాల్లో అవకాశం ఇవ్వమని నేను ఇప్పటివరకూ ఎవరినీ అడగలేదు. అలాగే, కొన్ని సినిమాల్లో అవకాశాలనూ వదులుకున్నా’’ అని ఆయన చెప్పారు.

స్పై, యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో గౌతమ్‌ మేనన్‌ ‘ధ్రువ నక్షత్రం’(Dhruva Natchathiram) చిత్రాన్ని సిద్ధం చేశారు. 2016లోనే ఈ సినిమా పట్టాలెక్కింది. 2017లో విడుదల చేయాలని చిత్రబృందం భావించింది. చిత్రీకరణ పూర్తైనప్పటికీ అనుకోని కారణాలతో ఇది వాయిదా(Postpone) పడింది. దాదాపు ఆరేళ్ల తర్వాత ఇప్పుడు ఈ సినిమా విడుదలకు రంగం సిద్ధమైంది. ధ్రువ నక్షత్రంపై భారీ అంచనాలు ఉన్నాయని చెప్పిన గౌతమ్.. ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని అన్నారు. నవంబర్‌ 24న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ధ్రువ నక్షత్రం (Dhruva Natchathiram) విడుదలైన తర్వాత రాఘవన్‌ 2 ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టబోతున్నట్టు గౌతమ్‌ మేనన్‌ తెలియజేశాడు. ఇటీవలే రాఘవన్ సినిమా గ్రాండ్‌గా రీరిలీజ్‌ అవగా.. మరోసారి సక్సెస్‌ టాక్ తెచ్చుకుంది

ఇక ధ్రువ నక్షత్రం చిత్రంలో రాధిక శరత్‌కుమార్(Radhika Sarathkumar), సిమ్రాన్, పార్థిబన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అంతేకాదు ఐశ్వర్య రాజేష్, రీతూ వర్మ కథానాయికలుగా నటిస్తున్న చిత్రానికి హరీష్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు.  అమెరికా, బల్గేరియా, జార్జియా, టర్కీ వంటి దేశాల్లో చిత్రీకరించారు. ఈ సినిమాలో చియాన్ విక్రమ్(Chiyaan Vikram).. జాన్ అనే భారతీయ గూఢచారి పాత్రను పోషిస్తున్నారు. మారువేషంలో భారతదేశ జాతీయ భద్రతా సంస్థ కోసం పనిచేసే 10 మంది రహస్య ఏజెంట్ల బృందానికి నాయకత్వం వహిస్తారు.

ఈ సినిమా నుంచి మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లు క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ఇప్పటికే విడుదల చేసిన ధ్రువ నక్షత్రం (Dhruva Natchathiram) ట్రైలర్‌(Trailer) ఫ్యాన్స్ కు కావాల్సిన ఎంటర్‌టైన్‌మెంట్ అందించబోతున్నట్టు చెబుతోంది. ఈ చిత్రాన్ని ఒండ్రగ ఎంటర్‌టైన్‌మెంట్‌, కొండదువోం ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎస్కేప్‌ ఆర్టిస్ట్స్‌ మోషన్స్ పిక్చర్స్‌ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 

ఇక గౌతమ్ మీనన్ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ విషయానికొస్తే.. శింబుతో గతంలో రూపొందించిన ‘వెందు తనిందతు కాడు’ మూవీకి సీక్వెల్ చేయనున్నారు. కానీ ఈ ప్రాజెక్ట్ గురించి ఇప్పటి వరకు ఎలాంటి వివరాలు ధృవీకరించలేదు. మరోవైపు శ్రీసింహ(Srisimha) టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న ప్రాజెక్ట్ ఉస్తాద్ (Ustaad ) కీలక పాత్రలో నటిస్తున్నాడు‌. గతంలో ఏమాయ చేసావే సినిమా నాగచైతన్య, సమంత జంటగా తెరకెక్కించారు. అక్కడ్నించి వారి ప్రేమ మొదలైంది. వారిద్దరికి తొలి హిట్ సినిమా కుడా అదే. కానీ ఇప్పుడు ఇద్దరూ విడిపోయారు. అయితే డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ నాగచైతన్యతోనే ఏమాయ చేసావే 2(Em Maya Chesave 2) తీస్తాను అని చెప్పడంతో మరి హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటారు అనే ప్రశ్న తలెత్తుతుంది. ఆ సినిమాలో సమంత, చైతూ జంట చాలా అద్భుతంగా ఉంటుంది. మరి ఇప్పుడు కూడా సమంతని తీసుకుంటారా, ఒకవేళ సమంతని అడిగితే తను ఒప్పుకుంటుందా, లేదా వేరే హీరోయిన్ తో చేస్తారా అని అభిమానుల్లో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి ఈ సినిమాని ఎవరితో చేస్తారు, ఎప్పుడు చేస్తారో తెలియాలంటే మరిన్ని రోజులు ఆగాల్సిందే.