రాంచరణ్ ‘గేమ్ ఛేంజర్’ సాంగ్ లీక్..

ఈ రోజుల్లో సినిమాను తీయడం కంటే తీసి న సినిమాను కాపాడుకోవడం మరీ దారుణంగా మారిపోయింది. ఆ మధ్య కనీసం విడుదలైన ఒక్కరోజు తర్వాత పైరసీ వచ్చేది. కానీ ఇప్పుడు మాత్రం ఒక్క షో కూడా గ్యాప్ ఇవ్వడం లేదు. ఆ సంగతి పక్కన పెడితే.. ప్రస్తుతం సెట్స్ పైన ఉన్న రామ్ చరణ్, శంకర్ మూవీలో ఓ మూడు నిమిషాల పాట లీక్ అవ్వడంతో మేకర్స్ షాక్‌కు గురయ్యారు.  ఆర్ ఆర్ ఆర్ తర్వాత రామ్ […]

Share:

ఈ రోజుల్లో సినిమాను తీయడం కంటే తీసి న సినిమాను కాపాడుకోవడం మరీ దారుణంగా మారిపోయింది. ఆ మధ్య కనీసం విడుదలైన ఒక్కరోజు తర్వాత పైరసీ వచ్చేది. కానీ ఇప్పుడు మాత్రం ఒక్క షో కూడా గ్యాప్ ఇవ్వడం లేదు. ఆ సంగతి పక్కన పెడితే.. ప్రస్తుతం సెట్స్ పైన ఉన్న రామ్ చరణ్, శంకర్ మూవీలో ఓ మూడు నిమిషాల పాట లీక్ అవ్వడంతో మేకర్స్ షాక్‌కు గురయ్యారు. 

ఆర్ ఆర్ ఆర్ తర్వాత రామ్ చరణ్  తమిళ దర్శకుడు శంకర్‌తో గేమ్ ఛేంజర్ అనే ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే… ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటోంది. దిల్ రాజు నిర్మిస్తున్నారు.. కియారా అద్వానీ హీరోయిన్‌గా చేస్తున్నారు. అయితే ఈ సినిమా గత కొన్ని రోజులుగా షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. రీసెంట్‌గా లేటెస్ట్‌గా షెడ్యూల్ స్టార్ట్ అయింది. 

అది అలా ఉంటే ఈ సినిమా నుంచి ఓ మూడు నిమిషాల ఆడియో సాంగ్ లీకైంది.  అంతేకాదు ఆ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సాంక్ కోసమే టీమ్ దాదాపుగా రూ. 15 కోట్ల వ్యయంతో ఎంతో గ్రాండ్‌గా తెరకెక్కించారట. అలాంటీ భారీ మాస్ సాంగ్ సోషల్ మీడియాలో లీక్ అవ్వడంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే పలు రకాలుగా లీక్స్ ఫోటోల రూపంలో బయటకు రాగా.. ఇది మాత్రం అన్నింటి కంటే పెద్ద లీక్ అని.. ఈ లీక్స్ కి అడ్డుకట్ట వేసేలా మరిన్ని చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఫ్యాన్స్. 

ఈ సాంగ్ ఎవరి వలన బయటకు వచ్చింది. ఎవరు ఈ సాంగ్‌ను సోషల్ మీడియాలో ఎవరు పోస్ట్ చేశారు. దీని వెనక ఉన్న కుట్రదారులు ఎవరున్నారే విషయమై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను మేకర్స్ ఫిర్యాదు చేశారు. ఎన్నో వేల మంది కష్టపడి తెర రూపమిచ్చిన ఈ పాట ఇలా కావడంపై మేకర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

ఇక మరోవైపు మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు.. ఈ సినిమా షూటింగ్.. ఎప్పుడు మొదలవుతుందో.. ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియని పరిస్థితి. దీంతో ఈ మూవీ రిలీజ్ ఎప్పుడు అనేది మాత్రం ఇప్పటివరకు అందని ద్రాక్ష లానే మిగిలిపోయింది. ఈ సినిమా రిలీజ్ పై లేటెస్ట్‌గ్‌ ఓ వార్త వైరల్ అవుతోంది. దాదాపు ఈ చిత్రం థియేటర్స్‌లోకి రావడానికి మరో ఏడాది పట్టేలా ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి. తెలుస్తోన్న సమాచారం మేరకు ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్ట్‌లో రిలీజ్ కానుందట. చూడాలి మరి ఈ వార్తల్లో నిజం ఎంతో..

ఈ సినిమాలో కొన్ని సీక్వెన్స్‌లు ‘హిట్ 2’ డైరెక్టర్ శైలేష్ కొలను డైరెక్ట్ చేయనున్నారట. శంకర్‌ ప్రస్తుతం కమల్ హాసన్ ఇండియన్ 2 బిజీలో ఉన్నారు.  ఈ నేపథ్యంలో గేమ్ ఛేంజర్‌లోని కొన్ని సీన్స్‌ను శైలేష్ కొలను దర్శకత్వం వహించనున్నారని టాక్ నడుస్తోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ లేని కొన్ని సీన్లను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా ఇప్పటికే పలు కారణాల వల్ల ఆలస్యం అవ్వడంతో టీమ్ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఈ చిత్రం లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా, మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు. 

ఈమూవీని దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై పాన్ ఇండియా రేంజ్‌లో ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు.  ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు పాత్రల్లో నటిస్తున్నారు అనే వార్త ఎప్పటినుండో ప్రచారం అవుతోంది. అయితే అది పక్కాగా నిజమే అని తెలుస్తోంది. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే రెండవ పాత్రకి అంజలి జోడిగా కనిపించనుందట. టీమ్ ఇటీవల ఓ పాటను చిత్రీకరించిందట. ఈ పాటకు దాదాపుగా  రూ.  5 కోట్లపైగా ఖర్చు చేశారట. అయితే ఈ పాట కోసం రామ్ చరణ్ చేసిన 80 సెకన్ల డాన్స్ సినిమాకు హైలెట్‌గా ఉండనుందని తెలుస్తోంది.  

భారీ అంచనాల నడుమ వస్తోన్న ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో దర్శకుడు. నటుడు ఎస్ జే సూర్య నటించనున్నారు. దీనికి సంబంధించి టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాకు ఓవర్సీస్‌లో భారీ డిమాండ్ పలుకుతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాకి అన్ని భాషల్లో కలిపి ఓవర్సీస్‌ రైట్స్ కోసం  రూ. 45 కోట్లకి పైగానే చెల్లించేందుకు ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రెడీగా ఉందని తెలుస్తోంది. 

రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలియందికాదు. ఈ సినిమా గత ఏడాది మార్చిలో విడుదలై కలెక్షన్స్ పరంగానే కాకుండా రివార్డ్‌లు అవార్డ్‌ల పరంగా అదరహో అనిపిస్తోంది. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అందుకున్న ఈ సినిమా ఆస్కార్ అవార్డ్‌ కూడా అందుకున్న సంగతి తెలిసిందే. ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఇక ఈ మూవీ నుండి కీరవాణి కంపోజ్ చేసిన నాటు నాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్స్ బరిలో నిలవడమే కాదు విజేతగా నిలిచి ఆస్కార్ అవార్డ్ అందుకుంది. తాజాగా ప్రకటించిన జాతీయ అవార్డుల్లో ఎక్కువ అవార్డులను గెలుచుకుంది.