గేమ్ చేంజ‌ర్.. 350 కోట్ల‌కు కొనుగోలు చేసిన జీ

మొదటిలో కైరా అద్వానీ- రామ్ చరణ్ జతగా నటించిన వినయ విధేయ రామ ప్రేక్షకుల ఆదరభిమానాలు అందుకున్న తర్వాత, మళ్లీ ఈ జంట గేమ్ చేంజర్ సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాకి శంకర్ డైరెక్టర్, నిర్మాత దిల్ రాజు.  సొంతం చేసుకున్న జీ స్టూడియోస్:  నిర్మాత దిల్ రాజుకు, దర్శకుడు శంకర్, రామ్ చరణ్‌ల సినిమా గేమ్ చేంజర్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. ఎందుకంటే, ఇది […]

Share:

మొదటిలో కైరా అద్వానీ- రామ్ చరణ్ జతగా నటించిన వినయ విధేయ రామ ప్రేక్షకుల ఆదరభిమానాలు అందుకున్న తర్వాత, మళ్లీ ఈ జంట గేమ్ చేంజర్ సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాకి శంకర్ డైరెక్టర్, నిర్మాత దిల్ రాజు. 

సొంతం చేసుకున్న జీ స్టూడియోస్: 

నిర్మాత దిల్ రాజుకు, దర్శకుడు శంకర్, రామ్ చరణ్‌ల సినిమా గేమ్ చేంజర్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. ఎందుకంటే, ఇది నిర్మాతగా దిల్ రాజు తీస్తున్న 50వ సినిమా. అంతేకాకుండా, అతని అత్యంత ఖరీదైన నిర్మాణంతో మొదటి పాన్-ఇండియన్ చిత్రం అవడం విశేషం. ఇది మావెరిక్ ఫిల్మ్ మేకర్ శంకర్ తీస్తున్న తొలి తెలుగు చిత్రం కూడా. ఇంకా, తన కెరీర్‌లో మొదటిసారి, నిర్మాత దిల్ రాజు కూడా తన సినిమాను పూర్తిగా కార్పొరేట్ స్టూడియో జి స్టూడియోస్కి అమ్మడం జరిగింది. 325 కోట్ల – 350 కోట్ల రేంజ్‌లో ఈ డీల్ జరిగినట్లు సమాచారం. 

ఈ డీల్‌లో థియేట్రికల్, శాటిలైట్ అదేవిధంగా డిజిటల్ రైట్స్ ఉన్నాయి. అయితే ఇందులో సంగీతం, ఓవర్సీస్ అదే విధంగా రీమేక్ రైట్ అనేవి లేవు. అయితే ప్రస్తుతానికి, రెండవ షెడ్యూల్ పూర్తయ్యేలోగా దిల్ రాజు ఈ ఒప్పంద ప్రకారం మొత్తం బడ్జెట్‌ను రికవరీ చేస్తున్నాడు. ఓవర్సీస్ మరియు ఇతర రైట్స్ లో దిల్ రాజుకి షేర్ అయితే ఉంటుంది. అంతేకాకుండా, అతను సినిమాను డిస్ట్రిబ్యూటర్‌గా కొనుగోలు చేసే అవకాశం ఉంది. 

అయితే ఒక తెలుగు-తమిళ్ రెండు భాషల సినిమాగా వస్తున్న పాన్ ఇండియా మూవీ ‘గేమ్ చేజర్’ ఇంత మొత్తంలో అమ్ముడుపోవడం అనేది ఒక రకంగా రికార్డు అని చెప్పాలి. 

అయితే ప్రస్తుతం, రామ్ చరణ్ – కియారా అద్వానీ నటించిన గేమ్ ఛేంజర్ ప్రేక్షకులలో ఒక ప్రత్యేకమైన హైప్ తెచ్చుకున్న ఒక చిత్రం. ఈ సినిమా విడుదలపై రామ్ చరణ్ అభిమానులు ఇంకా ఎగ్జైటింగ్‌గా ఉన్నప్పటికీ, చిత్ర బృందం నుండి ఎటువంటి అప్‌డేట్‌లు లేవు. దర్శకుడు శంకర్ మరియు నటుడు రామ్ చరణ్ ఇద్దరూ తమ తమ వృత్తిపరమైన కమిట్‌మెంట్‌లతో బిజీగా ఉండటమే దీనికి కారణమని చెప్పవచ్చు. ఇప్పుడు, నివేదికల ప్రకారం, గేమ్ ఛేంజర్‌లో కొంత భాగాన్ని శైలేష్ కొలను చిత్రీకరించనున్నారు అని అంటున్నారు.

శంకర్ డైరెక్షన్లో రాబోతున్న చిత్రాలు: 

శంకర్ తీసిన రెండు భారీ చిత్రాలు ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. గేమ్ ఛేంజర్ కాకుండా, ప్రముఖ దర్శకుడు కమల్ హాసన్‌తో ఇండియన్ 2లో కూడా కలిసి పని చేశారు. వారి 1996లో హిట్ అయిన ఇండియన్‌కి సీక్వెల్, ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చే ఏడాది విడుదల కానుంది. శంకర్ ఏకకాలంలో రెండు భారీ బడ్జెట్ సినిమాలకు సంబంధించిన షూటింగ్‌ను నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ రెండు సినిమాలను వర్క్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అవుతాడని ఆశిద్దాం. 

రామ్ చరణ్ గురించి మరింత: 

చరణ్ తన మొదటి చిత్రం చిరుత (2007)తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సూపర్ డూపర్ హిట్ అయిన RRR (2022), ఇది ₹1,200 కోట్లు (US$150 మిలియన్లు) సంపాదించింది, తర్వాత అదే అత్యధిక వసూళ్లు సాధించింది. RRRలో తన నటనతో ఆకర్షించి, యాక్షన్ మూవీలో ఉత్తమ నటుడిగా క్రిటిక్స్ ఛాయిస్ నామినేషన్లో అవార్డ్స్‌ అందుకున్నాడు.