ఆదిపురుష్ మూవీని బ్యాన్ చేయమంటున్న గజేంద్ర చౌహన్

మహాభారతంలో నటించిన గజేంద్ర చౌహన్ ఆది పురుష్ సినిమాని బ్యాన్ చేయమని అంటున్నాడు. ఆదిపురుష్ సినిమాకు ఓమ్ రౌత్ దర్శకత్వం వహించాడు. ఇందులో రాముడిగా ప్రభాస్ నటించగా సీతగా కృతి సనన్ నటించింది. రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించాడు.  ఆదిపురుష్ సినిమా రామాయణాన్ని వక్రీకరించేలా ఉందని, ఈ సినిమా మీద ముందు నుంచి ట్రోలింగ్ జరుగుతుంది. ఆదిపురుష్ సినిమాలో ఇప్పటికే చాలా డైలాగులు మార్చినప్పట్టికీ జరగాల్సిన నష్టం ఇప్పటికే జరిగిపోయిందని గజేంద్ర చౌహన్ పేర్కొన్నారు.  ఆదిపురుష్ […]

Share:

మహాభారతంలో నటించిన గజేంద్ర చౌహన్ ఆది పురుష్ సినిమాని బ్యాన్ చేయమని అంటున్నాడు. ఆదిపురుష్ సినిమాకు ఓమ్ రౌత్ దర్శకత్వం వహించాడు. ఇందులో రాముడిగా ప్రభాస్ నటించగా సీతగా కృతి సనన్ నటించింది. రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించాడు. 

ఆదిపురుష్ సినిమా రామాయణాన్ని వక్రీకరించేలా ఉందని, ఈ సినిమా మీద ముందు నుంచి ట్రోలింగ్ జరుగుతుంది. ఆదిపురుష్ సినిమాలో ఇప్పటికే చాలా డైలాగులు మార్చినప్పట్టికీ జరగాల్సిన నష్టం ఇప్పటికే జరిగిపోయిందని గజేంద్ర చౌహన్ పేర్కొన్నారు. 

ఆదిపురుష్ గురించి మాట్లాడిన గజేంద్ర చౌహన్:

సినిమాని అంతా ఇంప్రూవ్ చేయాలని ట్రై చేసినా, జరగాల్సిన నష్టం జరిగిపోయింది అన్నాడు. 

దీనివల్ల సినిమాకు లాభం ఏం జరగదు అన్నాడు. జనాలకు ఇప్పటికే దీని మీద ఇంట్రెస్ట్ పోయింది. 

అది మొదటి రోజు కలెక్షన్స్, ఇప్పటి కలెక్షన్స్ చూస్తే అర్థమయిపోతుందని అన్నాడు. సెన్సార్ బోర్డు వాళ్ళు వీటన్నింటికీ ఎలా ఒప్పుకున్నారో నాకు అర్థం కావట్లేదు అని అన్నారు. ఈ సినిమాని గవర్నమెంట్ బ్యాన్ చేస్తే బాగుంటుంది అన్నాడు.

డైలాగ్ రైటర్ మనోజ్ ముంతషిర్ ఈ సినిమా విషయంలో చాలా మిస్టేక్స్ చేశాడని అన్నాడు. 

ఒక లిరిక్స్ రాసే వ్యక్తితో డైలాగ్స్ రాయిస్తే ఇలాగే ఉంటుంది అని అన్నాడు. తన ఇష్టం వచ్చిన డైలాగ్స్ రాసాడని అన్నాడు.

బాక్స్ ఆఫీస్ దగ్గర ఆదిపురుష్ పెర్ఫార్మెన్స్:

ఇంకా గజేంద్ర చౌహన్ మాటలు పక్కన పెడితే ఆదిపురుష్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సాధిస్తుంది. ఈ సినిమా మూడు రోజుల్లో దాదాపుగా 340 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ప్రభాస్ పాన్ ఇండియన్ స్టార్ అని మరోసారి ఈ సినిమా నిరూపించింది. ప్రభాస్ ఇంతకుముందు సినిమా రాధే శ్యామ్ ఫ్లాప్ అయినప్పటికీ, ఈ సినిమా ఈ రేంజ్ లో కలెక్షన్స్ సాధించడం ప్రభాస్ క్రేజ్ ఏంటో తెలియజేస్తుంది. ప్రభాస్ తదుపరి సినిమా సలార్ సెప్టెంబర్ 20న రిలీజ్ అవుతుంది. ప్రభాస్ సినిమా సినిమాకి తన రేంజ్ పెంచుకుంటున్నాడు. 

ఓం రౌత్ తెరకెక్కించిన ఆదిపురుష్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్లు సాధించినా కూడా కొంతమంది ఈ సినిమాని ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా సైఫ్ అలీ ఖాన్ వేసిన రావణాసురుడు గెటప్ ని ట్రోల్ చేస్తున్నారు.  ప్రభాస్ ని కూడా కొన్ని సన్నివేశాల్లో ట్రోల్ చేస్తున్నారు.  గజేంద్ర చౌహన్ విషయానికొస్తే తను మహాభారతంలో యాక్ట్ చేశాడు. 

ఇంకా ఈ సినిమాలో సీత పాత్రలో కృతి సనన్ అద్భుతంగా నటించింది. తను తనకిచ్చిన పాత్రలో ఒదిగిపోయింది. త్రీడీ లో వచ్చిన ఈ ఆదిపురుష్ రామాయణం ఆధారంగా తీయబడింది. ఈ సినిమాని మొదటి నుంచి చాలామంది ట్రోల్ చేస్తున్నారు. సినిమా టీజర్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఈ సినిమాపై ట్రోల్స్ వస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ కలెక్షన్స్ అద్భుతంగా సాధిస్తుంది. గజేంద్ర చౌహన్ వ్యాఖ్యలపై ఆది పురుష్ టీం ఏ విధంగా స్పందిస్తుందో త్వరలోనే తెలుస్తుంది. ఈ సినిమా లాంగ్ రన్ ఎలా ఉంటుందో సోమవారానికి తెలుస్తుంది. 

ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఏదో విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ బాగా లేవని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ, ఈ ఆదిపురుష్ మంచి విజయం సాధించాలని మనందరం కోరుకుందాం.