Salaar: ‘సలార్’లో స్పెషల్ సాంగ్ చేయనున్న గ‌ద్ద‌ర్ 2 హీరోయిన్..

Salaar: డార్లింగ్ ప్రభాస్(Prabhas) చేస్తున్న లేటెస్ట్ మూవీ సలార్(Salaar). ఈ సినిమాను కేజీఎఫ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Director Prashanth Neel) తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రభాస్ సినిమాలో ఓ యంగ్ హీరోయిన్ స్పెషల్ సాంగ్(Special song) చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలు మీ కోసం..  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas), డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth Neel) కాంబోలో రాబోతున్న సినిమా సలార్(Salaar). ఎన్నో అంచనాల మధ్య భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా […]

Share:

Salaar: డార్లింగ్ ప్రభాస్(Prabhas) చేస్తున్న లేటెస్ట్ మూవీ సలార్(Salaar). ఈ సినిమాను కేజీఎఫ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Director Prashanth Neel) తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రభాస్ సినిమాలో ఓ యంగ్ హీరోయిన్ స్పెషల్ సాంగ్(Special song) చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలు మీ కోసం..

 యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas), డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth Neel) కాంబోలో రాబోతున్న సినిమా సలార్(Salaar). ఎన్నో అంచనాల మధ్య భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా కోసం వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో శ్రుతి హాసన్(Shruti Haasan) కథానాయికగా నటిస్తుండగా.. పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran), జగపతి బాబు(Jagapathi Babu) కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టైటిల్ గ్లింప్స్ మరింత హైప్ క్రియేట్ చేయగా.. ఈ సినిమా అప్డేట్స్, ప్రమోషన్స్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్(Release) చేయబోతున్నారు. ఈ క్రమంలోనే సలార్ సినిమా గురించి రోజుకో వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. త్వరలోనే ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ కాబోతున్నాయని.. ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, హైదరాబాద్ ప్రాంతాల్లో సలార్ ఈవెంట్స్ జరగనున్నాయని తెలుస్తోంది. అలాగే సలార్ ప్రచార కార్యక్రమాల్లో ప్రభాస్ పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. ఇప్పుడు తాజాగా సలార్ స్పెషల్ సాంగ్(Special song) గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తుంది.

ఇక ముందు నుంచి వినిపిస్తున్నట్లుగానే సలార్ సినిమాలో స్పెషల్ సాంగ్ ఉండబోతుందట. ఇందులో టాలెంటెడ్ బ్యూటీ సిమ్రాత్ కౌర్(Simrat Kaur) కనిపించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా సిమ్రాత్ తన ఇన్ స్టా స్టారోలో షూట్ స్పాట్ నుంచి సలార్ టీజర్ బ్యాగ్రౌండ్ స్కోర్ తో పెట్టింది. దీంతో ఆమె సలార్ సినిమాలో స్పెషల్ సాంగ్(Special song) చేయనున్నట్లు కన్ఫార్మ్ అయ్యిందని చెప్పడంలో సందేహం లేదు. ప్రస్తుతం ఈ సాంగ్ షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీరావు ఫిల్మ్ సిటీ(Ramoji Rao Film City)లో జరుగుతుంది. సిమ్రాత్ కౌర్.. ఇటీవలే.. గదర్ 2 చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. ఇక అంతకుముందు తెలుగులో డర్టీ హరి, బంగార్రాజు చిత్రాలలో నటించింది సిమ్రాత్.

సలార్ చిత్రానికి వస్తే.. ఈ సినిమాను రెండు భాగాలుగా తీసుకువస్తున్నారు డైరెక్టర్ ప్రశాంత్. ఇందులో ప్రభాస్ ఫుల్ మాస్ యాక్షన్ హీరోగా రగ్గడ్ లుక్ లో కనిపించనున్నారు. గతంలో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన కేజీఎఫ్(KGF) చిత్రాలకు సీక్వెల్ సలార్ ఉండబోతుందని టాక్ వినిపిస్తుంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. త్వరలోనే ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి.

డిసెంబర్ 22న ‘సలార్'(Salaar) సినిమా విడుదల కానున్న విషయం తెలిసిందే. ప్రభాస్(Prabhas) కంటే ముందు ఆ విడుదల తేదీపై బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) కర్చీఫ్ వేశారు. ఆయన హీరోగా రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘డంకీ’ డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఎప్పుడో అనౌన్స్ చేశారు. దాంతో రెండు సినిమాల మధ్య పోటీ తప్పడం లేదు. హిందీ మార్కెట్ పరంగా షారుఖ్ సినిమాతో పోటీ అంటే వసూళ్ల మీద ప్రభావం చూపించే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు అంచనా. ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్స్ రేట్లు తగ్గించమని అడుగుతున్నారట. 

ప్రభాస్ ‘సలార్’ డిసెంబర్ 22కు రావడంతో… క్రిస్మస్(Christmas) పండక్కి రావాలని ముందుగా అనుకున్న వెంకటేష్ ‘సైంధవ్’ సంక్రాంతికి జనవరి 13కి వెళ్ళింది. నితిన్ ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ డిసెంబర్ 8కి వస్తున్నట్లు వెల్లడించింది. నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ‘హాయ్ నాన్న’ డిసెంబర్ 7కి వచ్చింది.