బాహుబలి రికార్డ్ బ్రేక్ చేసిన గదర్2

సినీ ఇండస్ట్రీలో లక్ అనేది కంపల్సరీ. ఎప్పుడు ఎవర్ని లక్ వరించి చిన్న మూవీ కూడా పెద్ద హిట్ అవుతుందో చెప్పలేం. అదే కొన్ని సందర్భాలలో పెద్ద మూవీలు కూడా అనుకోని విధంగా ప్లాప్ అవుతూ ఉంటాయి. భారీ అంచనాల మధ్య విడుదలయిన మూవీ కలెక్షన్లు సాధిస్తే ఓకే కానీ… ఎటువంటి అంచనాలు లేకుండా సైలెంట్ గా విడుదలయిన మూవీలు కూడా కొన్ని అనుకోకుండా సక్సెస్ అవుతుంటాయి. అప్పటి వరకు ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులను తుడిచిపెట్టేస్తాయి. […]

Share:

సినీ ఇండస్ట్రీలో లక్ అనేది కంపల్సరీ. ఎప్పుడు ఎవర్ని లక్ వరించి చిన్న మూవీ కూడా పెద్ద హిట్ అవుతుందో చెప్పలేం. అదే కొన్ని సందర్భాలలో పెద్ద మూవీలు కూడా అనుకోని విధంగా ప్లాప్ అవుతూ ఉంటాయి. భారీ అంచనాల మధ్య విడుదలయిన మూవీ కలెక్షన్లు సాధిస్తే ఓకే కానీ… ఎటువంటి అంచనాలు లేకుండా సైలెంట్ గా విడుదలయిన మూవీలు కూడా కొన్ని అనుకోకుండా సక్సెస్ అవుతుంటాయి. అప్పటి వరకు ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులను తుడిచిపెట్టేస్తాయి. ఆ మూవీని తీసిన నిర్మాతలకు కాసుల పంట కురిపిస్తాయి. మూవీని కొనుగోలు చేసిన అందరికీ లాభాలు తెచ్చిపెడతాయి. ఇలా అనుకోకుండా ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి రికార్డులు కొల్లగొడుతున్న బాలీవుడ్ మూవీ గదర్-2. సన్నీ డియోల్ నటించిన ఈ మూవీ రికార్డులను తిరగరాస్తూ మరే ఇతర మూవీకి సాధ్యం కాని కలెక్షన్లతో దూసుకుపోతుంది. 

బాహుబలి రికార్డు బద్దలు

రిలీజ్ అయిన మొదటి వారం చాలా మూవీలు మంచి కలెక్షన్లను రాబడుతుంటాయి. మొదటి వారం ముగిసే సరికి బ్రేక్ ఈవెన్ కావాలని అందరు ప్రొడ్యూసర్స్ అనుకుంటూ ఉంటారు. అలా కాకుండా రెండో వారానికి మూవీ వెళ్లే సరికి కలెక్షన్లు తగ్గుతాయని అందరికీ ఒక నమ్మకం ఉంటుంది. కానీ ఈ నమ్మకం కొన్ని సినిమాల విషయంలో తారు మారు అవుతూ ఉంటుంది. బాలీవుడ్ మూవీ గదర్-2 విషయంలో కూడా ఇదే జరిగింది. ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత రెండో వారంలో ఏకంగా రూ. 90 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. దీంతో బాలీవుడ్ బాహుబలి మూవీ పేరిట ఉన్న రికార్డు కనుమరుగైంది. 

మొదటి బాలీవుడ్ సినిమాగా

బాహుబలి రికార్డును క్రాస్ చేయడంతో గదర్-2 మూవీ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. సెకండ్ వీక్ లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన బాలీవుడ్ మూవీగా ఇది నిలిచింది. ఇన్నాళ్లూ ఆ లిస్టులో టాలీవుడ్ మూవీ బాహుబలి ఉండగా… ప్రస్తుతం ఆ ప్లేస్ ను సన్నీ డియోల్ నటించిన గదర్-2 మూవీ కైవసం చేసుకుంది. ప్రభాస్ నటించిన బాహుబలి-2 మూవీ రెండవ వారంలో 80.75 కోట్లు వసూలు చేసి ఇండియాలో హయ్యెస్ట్ సెకండ్ వీక్ కలెక్షన్స్ నమోదు చేసిన మూవీగా రికార్డును నెలకొల్పింది. కానీ తాజాగా ఆ రికార్డును గదర్-2 తన పేర రాసుకుంది. బాలీవుడ్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ నటించిన దంగల్, బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ మూవీలను కూడా గదర్-2 బీట్ చేయడం గమనార్హం. 

ఒక్కరోజే 41 కోట్లు

సినిమా బాగుందని టాక్ వస్తే ప్రేక్షకులు ఎలా బ్రహ్మరథం పడతారో గదర్ మూవీ మరో సారి నిరూపించింది. రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకుపోతున్న ఈ మూవీ ఆగస్టు 20 ఆదివారం ఒక్క రోజే రూ. 41 కోట్లను కలెక్ట్ చేసింది. ఆగస్ట్ 11న విడుదలైన ఈ మూవీ కేవలం 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 375 కోట్లు వసూలు చేసి 400 కోట్ల క్లబ్ లో చేరేందుకు పరుగులు పెడుతోంది. 2001లో వచ్చిన గదర్ ఏక్ ప్రేమ్ కథా మూవీకి ఈ మూవీ సీక్వెల్. అప్పట్లో గదర్ మూవీ కూడా భారీ హిట్ సాధించింది. దీంతో మేకర్స్ ఈ మూవీకి సీక్వెల్ ప్లాన్ చేశారు. ఇక ఈ మూవీలో సన్నీ డియోల్ తో పాటు అమీషా పటేల్ కూడా లీడ్ రోల్ లో నటించింది. చాలా రోజుల నుంచి తెర మీద కనిపించని అమీషాకు ఈ మూవీ ఇంత పెద్ద హిట్ అవడం ప్లస్ పాయింటే అని చెప్పాలి. ఈ మూవీ తర్వాత అమ్మడికి ఆఫర్స్ క్యూ కడతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మూవీ ఇండస్ట్రీ అనేది కేవలం లక్ మీదే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. అందుకోసమే అమీషాకు ఆఫర్స్ వస్తాయని అంతా చెబుతున్నారు.