500 కోట్లు కలెక్ట్ చేసిన గదర్ 2

మూవీ ఇండస్ర్టీ అనేది లక్ మీద బేస్ అయి ఉంటుందని చాలా మంది చెబుతారు. ఎప్పుడు ఎవర్ని లక్ వరించి చిన్న మూవీ కూడా పెద్ద హిట్ అవుతుందో చెప్పలేం. అదే కొన్ని సందర్భాలలో పెద్ద మూవీలు కూడా అనుకోని విధంగా ప్లాప్ అవుతూ ఉంటాయి. అలాంటి కోవలోకే వస్తుంది బాలీవుడ్ మూవీ గదర్ 2. సన్నీ డియోల్, అమీషా పటేల్ వంటి స్టార్లు నటించిన ఈ మూవీ భారీ కలెక్షన్లు సాధిస్తూ ఔరా అనిపిస్తుంది. ఈ […]

Share:

మూవీ ఇండస్ర్టీ అనేది లక్ మీద బేస్ అయి ఉంటుందని చాలా మంది చెబుతారు. ఎప్పుడు ఎవర్ని లక్ వరించి చిన్న మూవీ కూడా పెద్ద హిట్ అవుతుందో చెప్పలేం. అదే కొన్ని సందర్భాలలో పెద్ద మూవీలు కూడా అనుకోని విధంగా ప్లాప్ అవుతూ ఉంటాయి. అలాంటి కోవలోకే వస్తుంది బాలీవుడ్ మూవీ గదర్ 2. సన్నీ డియోల్, అమీషా పటేల్ వంటి స్టార్లు నటించిన ఈ మూవీ భారీ కలెక్షన్లు సాధిస్తూ ఔరా అనిపిస్తుంది. ఈ మూవీ ఎటువంటి అంచనాలు లేకుండా సైలెంట్ గా విడుదలయి ఎన్నో రికార్డులను కొల్లగొడుతోంది. ఇదేం ఇండస్ట్రీకి కొత్త కాదు. ఇప్పటికే పరిశ్రమ ఇటువంటి ఎన్నో అద్భుతాలను చూసింది. ఈ మూవీ తీసిన నిర్మాతలకు కాసుల పంట కురుస్తోంది. మూవీని కొనుగోలు చేసిన బయ్యర్లకు కూడా లాభాలు వస్తున్నాయి. ఇలా అనుకోకుండా ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి రికార్డులు కొల్లగొడుతున్న బాలీవుడ్ మూవీ గదర్-2 గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.

500 కోట్లంటే మామూలా

రూ. 500 కోట్ల కలెక్షన్లు వినేందుకు చాలా సింపుల్ గానే ఉన్నా కానీ ఇది చిన్న విషయం కాదు. 500 కోట్ల క్లబ్ లో చేరాలంటే ఆ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ కావాలి. రిలీజ్ అయిన దగ్గరి నుంచి ఈ ఫీట్ సాధించేందుకు స్టడీగా కలెక్షన్లు మెయింటేన్ చేయాలి. అలా కాకుండా కొన్ని సినిమాలు మొదటి వారం భారీ కలెక్షన్లు రాబట్టి తర్వాతి వారాల్లో చతికిలపడతాయి. ఇలా అయిన సినిమాలకు 500 కోట్ల కలెక్షన్లు సాధించడం సాధ్యపడదు. ఏ మూవీలైతే కంటిన్యూగా స్టడీ కలెక్షన్లు మెయింటేన్ చేస్తాయో ఆ మూవీలకే ఈ ఫీట్ సాధించడం వీలవుతుంది. ప్రస్తుతం సన్నీ డియోల్ మూవీ గదర్-2 అటువంటి ఫీట్ నే సాధించి చూపెట్టింది. ఎంతో మంది పెద్ద హీరోలున్నా కానీ వారిలో చాలా మందికి సాధ్యం కాని ఫీట్ ను సన్నీ చాలా అలవోకగా సాధించాడు మొదటి వారం ముగిసే సరికి బ్రేక్ ఈవెన్ కావాలని అందరు ప్రొడ్యూసర్స్ అనుకుంటూ ఉంటారు. అలా కాకుండా రెండో వారానికి మూవీ వెళ్లే సరికి కలెక్షన్లు తగ్గుతాయని అందరికీ ఒక నమ్మకం ఉంటుంది. కానీ ఈ నమ్మకం కొన్ని సినిమాల విషయంలో తారు మారు అవుతూ ఉంటుంది. బాలీవుడ్ మూవీ గదర్-2 విషయంలో కూడా ఇదే జరిగింది. ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత రెండో వారంలో ఏకంగా రూ. 90 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఇక ఇప్పుడు వరల్డ్ వైడ్ గా 500 కోట్ల కంటే ఎక్కువ గ్రాస్ సాధించి విమర్శకుల నోళ్లు మూయించింది. 

ఆ హీరోలకు సాధ్యం కాని ఫీట్

బాలీవుడ్ అంటే ఖాన్ హీరోలదే హవా అని చాలా మంది అనుకుంటారు. రిజల్ట్స్ కూడా అలానే ఉంటాయి. కానీ సన్నీ డియోల్ గదర్-2 మూవీ మాత్రం ఈ అంచనాలు తప్పని మరో సారి ప్రూవ్ చేసింది. ఇప్పటికే కొన్ని సార్లు ఇది తప్పుడు స్టేట్ మెంట్ అని కొన్ని సినిమాలు ప్రూవ్ చేయగా గదర్-2 విషయంలో మరోసారి అలాగే జరిగింది. సెకండ్ వీక్ లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన బాలీవుడ్ మూవీగా ఇది నిలిచింది. ఇన్నాళ్లూ ఆ లిస్టులో టాలీవుడ్ మూవీ బాహుబలి ఉండగా… ప్రస్తుతం ఆ ప్లేస్ ను సన్నీ డియోల్ నటించిన గదర్-2 మూవీ కైవసం చేసుకుంది. తాజాగా ఆ రికార్డును గదర్-2 తన పేర రాసుకుంది. బాలీవుడ్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ నటించిన దంగల్, బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ మూవీలను కూడా గదర్-2 బీట్ చేయడం గమనార్హం. 

12 రోజుకు కూడా తగ్గని హవా

ఏదైనా మూవీ రిలీజ్ అయిన తర్వాత మొదటి వారం కలెక్షన్లు ప్రవాహం లా వస్తాయి. మరీ సినిమా టాక్ బాగుంటే రెండో వారం కూడా వస్తాయి. కానీ గదర్-2 విషయంలో మాత్రం మూవీ రిలీజ్ అయి 12 రోజులు గడుస్తున్నా కానీ కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి. ఇక ఈ మూవీ రిలీజ్ అయిన 11వ రోజున రూ. 13 కోట్లకు పైగా వసూలు చేసింది. 12 వ రోజు కూడా భారీగానే కలెక్షన్లు ఉండే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఒక మీడియం రేంజ్ హీరో మూవీకి ఇంతలా కలెక్షన్స్ రావడం చూసి స్టార్స్ ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.