రజనీకాంత్ పారితోషకం పెరగడం వెనుక ఓ కథ!

దాదాపు దశాబ్ద కాలం తర్వాత ‘జైలర్’ సినిమాతో సూపర్‌‌హిట్‌ అందుకున్నారు సౌతిండియా సూపర్‌‌స్టార్ రజనీకాంత్. రజనీ స్టైల్‌కు తోడు.. నెల్సన్ దిలీప్ కుమార్ టేకింగ్, మూవీ మేకింగ్, డార్క్ కామెడీ, అనిరుధ్ మ్యూజిక్‌ అన్నీ కలిసి కలెక్షన్ల రికార్డులను కొల్లగొడుతోంది. ఇప్పటికే రూ.400 కోట్ల మార్క్‌ను దాటేసింది. ఈ సినిమా విడుదల సమయంలో రజనీకాంత్ రెమ్యూనరేషన్ గురించిన ప్రచారం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. జైలర్ మూవీ కోసం దాదాపు రూ.110 కోట్లు తీసుకున్నారంటూ తమిళ ఇండస్ట్రీ కోడై […]

Share:

దాదాపు దశాబ్ద కాలం తర్వాత ‘జైలర్’ సినిమాతో సూపర్‌‌హిట్‌ అందుకున్నారు సౌతిండియా సూపర్‌‌స్టార్ రజనీకాంత్. రజనీ స్టైల్‌కు తోడు.. నెల్సన్ దిలీప్ కుమార్ టేకింగ్, మూవీ మేకింగ్, డార్క్ కామెడీ, అనిరుధ్ మ్యూజిక్‌ అన్నీ కలిసి కలెక్షన్ల రికార్డులను కొల్లగొడుతోంది. ఇప్పటికే రూ.400 కోట్ల మార్క్‌ను దాటేసింది. ఈ సినిమా విడుదల సమయంలో రజనీకాంత్ రెమ్యూనరేషన్ గురించిన ప్రచారం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. జైలర్ మూవీ కోసం దాదాపు రూ.110 కోట్లు తీసుకున్నారంటూ తమిళ ఇండస్ట్రీ కోడై కూస్తోంది. ఇప్పుడంటే ఇంత తీసుకుంటున్నారు కానీ.. గతంలో రజనీ పారితోషకం ఎంతో తెలుసా? రూ.30 వేలు మాత్రమే. నమ్మకం రావట్లేదా? నిజ్జంగా నిజం!! 

వసూళ్లు భారీగానే ఉన్నా..

పారితోషకం గురించిన పలు ఆసక్తికర విషయాలను రజనీకాంత్‌కు దివంగత స్క్రీన్ రైటర్ పంచు అరుణాచలం గతంలో వెల్లడించారు. జైలర్ కోసం రజనీ రూ.110 కోట్లు పారితోషకం తీసుకున్నారన్న వార్తల నేపథ్యంలో ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. సదరు వీడియోలో పంచు అరుణాచలం తనతో చెప్పిన విషయాలను రజనీకాంత్ వివరించారు. ‘‘సినిమాకు రూ.30 వేల చొప్పున తీసుకుంటున్నానని పంచు సర్‌‌కి చెప్పాను. షూటింగ్‌ కోసం నన్ను సింగపూర్ లేదా మలేసియా తీసుకెళ్తానని ఆయన చెప్పారు. దీంతో రూ.20 వేల నుంచి రూ.35 వేల వరకు ఇవ్వమని అడిగాను” అని చెప్పారు.

తన మాటలకు పంచు అరుణాచలం షాక్ అయ్యారని రజనీ వివరించారు. ‘‘మీరు నాకంటే అధ్వానంగా ఉన్నారు. సినిమాకు కేవలం రూ.30 వేలు తీసుకుంటున్నారా? మీ సినిమాలు ఎలాంటి బిజినెస్ చేస్తున్నాయో తెలుసా? ఎంతటి వసూళ్లు సాధిస్తున్నాయో తెలుసా? మీ సినిమాలను తీసుకునేందుకు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఎంత పోటీ పడుతున్నారో తెలుసా? మీకు ఎవరూ ఈ విషయం చెప్పడం లేదా?” అని తనపై కోప్పడ్డారని అన్నారు. దీంతో తాను తీయబోయే ‘ప్రియ’ సినిమాకు రూ.1.10 లక్షలు ఇస్తానని పంచు అరుణాచలం తనకు చెప్పాలని నాటి విషయాలను సూపర్‌‌స్టార్ రజనీ కాంత్ గుర్తు చేసుకున్నారు.

అప్పటి నుంచి కోట్లకు పెరిగిన పారితోషకం

పంచు అరుణాచలం చేసిన వ్యాఖ్యలు రజనీపై చాలా ప్రభావం చూపాయి. ఇక అప్పటి నుంచి ఆయన పారితోషకం పెరిగిపోయింది. రూ.లక్ష నుంచి రూ.కోటి.. రూ.100 కోట్లకు చేరుకుంది. మొన్నటిదాకా సినిమాకు రూ.100 కోట్లను రజనీ తీసుకున్నారని, జైలర్ సినిమాకు రూ.110 కోట్లు తీసుకున్నారని వార్తలు వచ్చాయి. నిజానికి జైలర్ సినిమా బడ్జెట్‌ రూ.225 కోట్లు అయితే.. అందులో కేవలం రజనీ పారితోషకంగానే సగం బడ్జెట్‌ను వెచ్చించారు. మలయాళ, కన్నడ స్టార్లు మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, బాలీవుడ్ సీనియర్ నటుడు జాకీష్రాఫ్‌కు కూడా భారీగానే పారితోషకంగా ఇచ్చారు. 

ఊపిరిపోసిన జైలర్

ఒకప్పుడు బాషా, ముత్తు, అరుణాచలం, నరసింహా, చంద్రముఖి తదితర సూపర్‌‌హిట్లు కొట్టిన రజనీకాంత్‌కు చాలా కాలంగా మంచి హిట్ సినిమా లేదు. చివరి సారిగా 2010లో రోబోతో హిట్ కొట్టారు. అది కూడా రజనీ స్థాయి కాదు. కానీ బాగా ఆడిన సినిమా అదే. అప్పటి నుంచి సాలిడ్ హిట్ కోసం రజనీ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. కబాలీ, కాలా, కొచ్చాడయాన్, లింగా, పేటా, అన్నాత్తే తదితర ఎన్నో సినిమాలు ఫ్లాప్‌ను మూటగట్టుకున్నాయి. అన్నాత్తే తర్వాత దాదాపు రెండేళ్లు గ్యాప్ తీసుకున్నారు రజనీ. ఇటీవల విడుదలైన జైలర్‌‌తో హిట్‌ను చాలా కాలం తర్వాత రుచి చూశారు. తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి భోళా శంకర్‌‌ సినిమాను మించిన వసూళ్లను జైలర్ వసూలు చేస్తోంది. రజనీ స్టామినో ఏంటో జైలర్‌‌తో మరోసారి రుజువైంది.