బిగ్ బాస్ 7 మొదటి కెప్టెన్ పల్లవి ప్రశాంత్ 

తెలుగు బిగ్ బాస్ 7 ప్రతి ఒక్కరిని అలరించడం జరిగింది. సాధారణ వ్యక్తిగా వెళ్లిన రైతుబిడ్డ ప్రశాంత్, మొదటి కెప్టెన్ అవడం గర్వకారణం అంటున్నారు. అయితే బిగ్ బాస్ సీజన్ 7 రిలీజ్ అయిన అనంతరం ప్రతి ఒకరు షాక్ కి గురయ్యారు. ముందు నుంచి చెప్తున్నట్లుగానే బిగ్ బాస్ సీజన్ 7 లో అంతా ఉల్టా పల్టాగా జరుగుతుంది. ఎంతమంది ఎలిమినేట్ అయ్యారో, మరిన్ని తెలుసుకుందాం..  మొదటి కెప్టెన్ అయిన పల్లవి ప్రశాంత్: చాలా కష్టమైన […]

Share:

తెలుగు బిగ్ బాస్ 7 ప్రతి ఒక్కరిని అలరించడం జరిగింది. సాధారణ వ్యక్తిగా వెళ్లిన రైతుబిడ్డ ప్రశాంత్, మొదటి కెప్టెన్ అవడం గర్వకారణం అంటున్నారు. అయితే బిగ్ బాస్ సీజన్ 7 రిలీజ్ అయిన అనంతరం ప్రతి ఒకరు షాక్ కి గురయ్యారు. ముందు నుంచి చెప్తున్నట్లుగానే బిగ్ బాస్ సీజన్ 7 లో అంతా ఉల్టా పల్టాగా జరుగుతుంది. ఎంతమంది ఎలిమినేట్ అయ్యారో, మరిన్ని తెలుసుకుందాం.. 

మొదటి కెప్టెన్ అయిన పల్లవి ప్రశాంత్:

చాలా కష్టమైన రంగు అనే టాస్క్ గెలిచిన తర్వాత పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 7కి మొదటి కెప్టెన్ అయ్యారు. చెంపదెబ్బ ఆరోపణలు, పోటీదారుల మధ్య వివాదాలు, విభేదాలకు ఆజ్యం పోసే గ్రూపు వ్యూహాలతో పోటీ తీవ్రంగా కనిపించింది.

టాస్క్‌లో నలుగురు ఫైనలిస్టులు కెప్టెన్సీ రేసులో పోటీ పడ్డారు. ప్రియాంక జైన్ టాస్క్ సంచాలక్ (రిఫరీ)గా పనిచేసింది. మొదటి బజర్ తర్వాత సందీప్ గేమ్ నుండి ఎలిమినేట్ అయ్యాడు. అయితే, ప్రియాంక నిర్ణయాన్ని అతను వ్యతిరేకించాడు, ఫలితంగా అతనికి మరియు పల్లవి ప్రశాంత్ మధ్య గొడవ జరిగింది. కానీ ఆఖరికి మాత్రం పల్లవి ప్రశాంత బిగ్ బాస్ సీజన్-7 మొదటి కెప్టెన్ గా మారి సామాన్యుడి సత్తా చాటాడు.

కుడి ఎడమైనా పర్లేదు: 

అనుకున్నట్టుగానే, ప్రోమోలో చూపించిన విధంగానే, బిగ్ బాస్ హౌస్ లో అంతా రివర్స్ లో జరుగుతోంది. మొదటి రోజే, బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన మొదటి 5 కంటెస్టెంట్లకు సుమారు 35 లక్షలు ఆఫర్ చేయడం జరిగింది. నిజానికి బిగ్ బాస్ ప్రతి సీజన్ లో, పాల్గొన్న కంటెస్టెంట్ల లో ఎవరైతే చివరి వరకు ఉంటారో, ఆ ఐదు మందికి మాత్రమే 35 లక్షలు ఆఫర్ చేయడం జరుగుతుంది. కానీ బిగ్ బాస్ సీజన్-7 మొదలైన మొదటి రోజే జరగడం, అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. నిజానికి బిగ్ బాస్ సీజన్-7 అన్ని సీజన్ల కన్నా భిన్నంగా ఉంటుంది అని మొదటి నుంచి ప్రోమోలో చూపించిన విధంగానే, ఈ సీజన్ లో అంత తారుమారుగా జరగడం కనిపించింది. కేవలం 15 మంది కంటెస్టెంట్లు మాత్రమే బిగ్ బాస్ మొదటి రోజున సందడి చేశారు. అయితే మొదటి ఎలిమినేషన్ లో, కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అవ్వగా, తర్వాత వారాల్లో, షకీలా, దామిని, రతిక ఎలిమినేట్ అవ్వగా ఇప్పుడు ప్రస్తుతం హౌస్ లో 11 మంది మాత్రమే ఉన్నారు. ఈ వరం ఎలిమినేట్ ఎవరవుతారు అనుకుంటున్నారు? 

ఈ వారం నామినేషన్ లో ఉన్న పోటీదారులు: 

పోటీదారులు ప్రిన్స్ యావర్, ప్రియాంక, శివాజీ, శుభశ్రీ రాయగురు, గౌతం కృష్ణ, టేస్టీ తేజ మరియు అమర్‌దీప్‌లను నామినేట్ చేశారు. ఎలిమినేషన్ జరిగితే, టేస్టీ తేజ, లేదంటే సుభశ్రీ ఈ వారం హౌస్ నుండి బయటకు వెళ్లే అవకాశం ఉంది. పల్లవి ప్రశాంత్ తొలి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టడంతో ఇంటిలోని డైనమిక్స్ మారనుంది. బిగ్ బాస్ తెలుగు ఈ సీజన్‌లో డ్రామా, మరిన్ని ట్విస్టులు జరుగుతున్న క్రమంలో, ఈ ఆదివారం జరగబోయే ఎపిసోడ్లో నాగార్జున సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్లే తెలుస్తుంది. ముఖ్యంగా ఈ ఎపిసోడ్లో సిద్ధార్థ అలాగే రవితేజలు వచ్చి కనువిందు చేసి ఎంటర్టైన్మెంట్ ఇవ్వనున్నట్లు ప్రోమో-1లో కనిపిస్తుంది. అంతేకాకుండా మరి కొంత మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్ లోకి వెళుతున్నట్లు కూడా తెలుస్తోంది. కొంతమంది అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టినట్లు మరో ప్రోమో-2లో కనిపిస్తుంది.