ఎట్టకేలకు తెలుగు అమ్మాయిల హవా మొదలయిందిగా..!

సాధారణంగా గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్లకు అవకాశాలు ఇవ్వడం లేదు అంటూ చాలామంది ధర్నాలు చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి.  ముఖ్యంగా శ్రీ రెడ్డి లాంటి నటీమణి తెలుగు ఇండస్ట్రీ తెలుగు నటీమణులకు అవకాశం ఇవ్వడం లేదు అంటూ అర్ధ నగ్నంగా మా అసోసియేషన్ ముందు బైఠాయించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే చాలామంది హీరోయిన్లు కూడా తెలుగు అమ్మాయిలకు తెలుగులో అవకాశాలు ఇవ్వడం లేదు అంటూ మీడియా ముందు […]

Share:

సాధారణంగా గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్లకు అవకాశాలు ఇవ్వడం లేదు అంటూ చాలామంది ధర్నాలు చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి.  ముఖ్యంగా శ్రీ రెడ్డి లాంటి నటీమణి తెలుగు ఇండస్ట్రీ తెలుగు నటీమణులకు అవకాశం ఇవ్వడం లేదు అంటూ అర్ధ నగ్నంగా మా అసోసియేషన్ ముందు బైఠాయించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే చాలామంది హీరోయిన్లు కూడా తెలుగు అమ్మాయిలకు తెలుగులో అవకాశాలు ఇవ్వడం లేదు అంటూ మీడియా ముందు తమ బాధను వెళ్ళగక్కిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కాలం మారుతుంది తెలుగు అమ్మాయిలు కూడా అన్ని పాత్రలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.  ఈ క్రమంలోనే తెలుగు అమ్మాయిలకు మళ్లీ టాలీవుడ్లో పూర్వ వైభోగం రాబోతోంది అనే వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం సినిమా ప్రాంతీయ హద్దులు దాటి ఎల్లలు పాకుతున్న నేపథ్యంలో తాజాగా సినిమాలోకి రావడం అనేది ప్రతి ఒక్కరికి కలగా మారిపోయింది.  అందుకే ఇప్పుడున్న ట్రెండుకు తగ్గట్టుగా తెలుగు అమ్మాయిలు కూడా సినిమాలలో కథలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా తమ నటనలో మార్పులు చేసుకొని మరీ నటిస్తున్నారు. అయితే ఇప్పుడు ట్రెండ్ లో ఉన్న తెలుగు అమ్మాయిలకి ప్రాధాన్యత పెరుగుతుంది అనడానికి వైష్ణవి చైతన్య,  శ్రీ లీల , కావ్య కళ్యాణ్ రామ్ వంటి వాళ్ళు నిదర్శనమని చెప్పవచ్చు.  ఇప్పుడు వీరంతా కూడా టాలీవుడ్ లో అతిపెద్ద విజయాలను సొంతం చేసుకుని భారీగా ముందుకు దూసుకుపోతున్నారు.

ఇక తెలుగు అమ్మాయి యూట్యూబర్ గా ఇండస్ట్రీకి పరిచయమైన వైష్ణవి చైతన్య గతవారం విడుదలైన బేబీ సినిమాతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రంలో ఆమె ప్రధాన పాత్రలో నటించిన విషయం తెలిసిందే.  హైదరాబాది నటి అయిన వైష్ణవి చైతన్య తన పర్ఫామెన్స్ తో అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా తెలుగు అమ్మాయిలు సినిమాలలో రాణించడం కష్టమని అందరూ అంటూ ఉంటారు కానీ అలాంటిదేమీ లేదని ప్రతి ఒక్కరికి అవకాశాలు వస్తాయని.. అందుకు కృషి,  పట్టుదల అవసరం అని వైష్ణవి చైతన్య బేబీ సినిమా సక్సెస్ మీట్ లో వెల్లడించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లాంటి వాళ్లు కూడా వైష్ణవి చైతన్య నటనకు ఫిదా అయిపోయి.. తెలుగు అమ్మాయిలు ఇకనైనా ఇండస్ట్రీలోకి రావాలి అని.. తెలుగు సినిమాలలో వాళ్ళు నటించాలి అని మనస్పూర్తిగా కోరుకున్నారు. 

తెలుగు అమ్మాయిలు కూడా ఎక్కడైనా సరే కష్టపడి పనిచేస్తే ఖచ్చితంగా ముందుకు వెళ్తారు అని ఇప్పటివరకు చాలామంది హీరోయిన్లు తెలుగులో అవకాశాలు దక్కించుకోకపోయినా ఇతర భాషా ఇండస్ట్రీలలో సత్తా చాటుతున్నారని ఇక తెలుగులో కూడా మళ్లీ పూర్వ వైభోగం వస్తుంది అని ఆశిస్తున్నాను అంటూ వైష్ణవి చైతన్య కూడా వెల్లడించింది. ఇక కావ్య కళ్యాణ్రామ్ కూడా మసూద , బలగం వంటి చిత్రాలతో భారీ పాపులారిటీ దక్కించుకుంది. మరొకవైపు శ్రీ లీల కూడా కన్నడ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి అయినా సరే తెలుగులో ఏకంగా ఏడు సినిమాలలో అవకాశం దక్కించుకుంది కాబట్టి నటించే అవకాశం కావాలి అంటే కష్టపడే తత్వం ఉండాలి అని అప్పుడు తప్పకుండా తెలుగు అమ్మాయిలు కూడా అవకాశాలు దక్కించుకుంటారని ఈ యంగ్ హీరోయిన్లు అభిప్రాయపడుతున్నారు.. ఏది ఏమైనా ఒకప్పుడు తెలుగులో తెలుగు వాళ్లే చేసే వాళ్ళు.. కానీ ఇప్పుడు ప్రాంతీయ భాషల్లో నటిస్తూ దూసుకుపోతున్న నేపథ్యంలో తెలుగు అమ్మాయిలకు మళ్లీ పూర్వ వైభోగం రాబోతోందని చెప్పవచ్చు.