ఎట్టకేలకు క్షమాపణలు చెప్పిన ‘ఆదిపురుష్’ రైటర్

వివాదాలకు కేంద్రబిందువుగా ఆదిపురుష్ : భారీ అంచనాల నడుమ రీసెంట్ గా విడుదలైన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ‘ఆదిపురుష్’ చిత్రం మొదటి ఆట నుండే డివైడ్ టాక్ ని తెచ్చుకొని బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిన సంగతి అందరికీ తెలిసిందే. విడుదలకు ముందు నుండే భారీ అంచనాలు ఉన్న కారణం గా ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ కనీవినీ ఎరుగని రేంజ్ లో జరిగాయి. ఆ కారణం చేత ఓపెనింగ్స్ పరంగా […]

Share:

వివాదాలకు కేంద్రబిందువుగా ఆదిపురుష్ :

భారీ అంచనాల నడుమ రీసెంట్ గా విడుదలైన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ‘ఆదిపురుష్’ చిత్రం మొదటి ఆట నుండే డివైడ్ టాక్ ని తెచ్చుకొని బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిన సంగతి అందరికీ తెలిసిందే. విడుదలకు ముందు నుండే భారీ అంచనాలు ఉన్న కారణం గా ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ కనీవినీ ఎరుగని రేంజ్ లో జరిగాయి. ఆ కారణం చేత ఓపెనింగ్స్ పరంగా చరిత్ర సృష్టించిన ఈ సినిమా, మామూలు వర్కింగ్ డేస్ లో మాత్రం రోజు రోజుకి కలెక్షన్స్ డ్రాప్ అవుతూ నిర్మాతలకు 60 కోట్ల రూపాయలకు పైగా నష్టాలను తెచ్చిపెట్టింది. కమర్షియల్ గా ఎలా ఆడింది అనే విషయాన్నీ పక్కన పెడితే, ఈ చిత్రం లోని చాలా సన్నివేశాలు శ్రీరాముని భక్తులను మరియు హిందూ సంఘాలను చాలా బాధపెట్టేలా చేసాయి. ముఖ్యంగా ఈ చిత్రం లోని డైలాగ్స్ పట్ల భక్తులు చాలా తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తపరిచారు.

క్షమాపణలు చెప్పిన రైటర్ మనోజ్ ముంతాషీర్ :

అయితే తొలుత తాము ఎలాంటి తప్పు చేయలేదంటూ ఈ చిత్ర రచయితా ముంతాషీర్ తనని తాను సమర్ధించుకున్నాడు. అయితే రోజు రోజుకి అతని పై నిరసన జ్వాలలు రగులుతూ పోతుండడం తో, ఇక వత్తిడిని తట్టుకోలేక ఎట్టకేలకు క్షమాపణలు తెలిపాడు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేస్తూ ‘ ఆదిపురుష్ చిత్రం హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని ఒప్పుకుంటున్నాను. దయచేసి ఈ విషయం పట్ల తనని క్షమించాల్సిందిగా చేతులు జోడించి ప్రతీ ఒక్కరినీ వేడుకుంటున్నాను, ఆ హనుమంతుడు మన అందరిని ఐక్యంగా ఉండేలా చేసి, మన దేశానికీ , సనాతన ధర్మానికి సేవ చేసే విధంగా చూడాలని ఈ సందర్భంగా ప్రార్థిస్తున్నాను’ అంటూ ముంతాషీర్ ఒక ట్వీట్ వేసాడు. ఈ క్షమాపణలు ఏవో ముందే చెప్పి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదేమో, ఇప్పుడు ఆయన క్షమాపణలు చెప్పినప్పటికీ కూడా నెటిజెన్స్ ఆయనని వదిలిపెట్టడం లేదు, తిడుతూనే ఉన్నారు, ఇతను కనిపిస్తే జనాలు బధిత పూజ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు.

సినిమా రన్నింగ్ లో ఉన్న సమయం లోనే డైలాగ్స్ లో కొన్ని కీలక మార్పులు చేసారు. హనుమంతుడు పాత్రకి ‘కాలేది నీ బాబుదే’ వంటి డైలాగ్స్ పెట్టడం ఏమిటి అని భక్తులు తీవ్రమైన అసహనం ని వ్యక్త పర్చగా, వాళ్ళ మనోభావాలను పరిగణలోకి తీసుకొని డైలాగ్స్ ని మార్చారు. ఇక ఈ సినిమాలో రావణాసురిడి పాత్రని ప్రముఖ బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ పోషించిన సంగతి అందరికీ తెలిసిందే. సంపూర్ణ బ్రాహ్మణుడైన రావణాసురుడు మాంసాహారిగా చిత్రీకరించడం డైరెక్టర్ ఓం రౌత్ పైత్యానికి పరాకాష్ట లాంటిది అంటూ హిందూ సంఘాలు అప్పట్లో అలహాబాద్ కోర్టు లో కేసు వెయ్యగా, దానిని విచారించి డైరెక్టర్ , రైటర్ మరియు నిర్మాతని ఈ నెల 27 వ తారీఖున హాజరు కావాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతే కాదు అలాంటి సన్నివేశాలను చిత్రీకరించినందుకు గాను మేకర్స్ పై కోర్టు చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. గతం లో ప్రభాస్ ‘రాధే శ్యామ్’ చిత్రం విడుదల సమయం లో ప్రొమోషన్స్ లో పాల్గొన్నాడు. ఈ ప్రొమోషన్స్ లో ‘ఆదిపురుష్’ మూవీ షూటింగ్ నాలుగు రోజులు చేసిన తర్వాత డైరెక్టర్ ఓం రౌత్ ని పిలిచి ఈ సినిమా నేను చెయ్యొచ్చా అని అడిగాను, వేరే ఎవరిమీదనైనా ఎలా అయినా తియ్యొచ్చు, కానీ శ్రీ రాముడి గురించి సినిమా తీస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా తియ్యాలి లేదంటే అందరం సమస్యల్లో చిక్కుంటాము అని అన్నాను, దానికి ఓం రౌత్ నేను అన్నీ జాగ్రత్తలు తీసుకుంటాను అని చెప్పాడు అంటూ ప్రభాస్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియా లో ఇప్పుడు తెగ వైరల్ గా మారింది.