2023 ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్.. ఉత్తమ నటిగా ఆలియా

ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్‌లో హ్యుందాయ్ 68వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2023’ వేడుక అంగరంగవైభవంగా జరిగింది. గురువారం రాత్రి అట్టహాసంగా జరిగిన ఈ వేడుకకు బాలీవుడ్‌ హీరోలు హీరోయిన్‌లు హాజరైయ్యారు. అటు బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్‌లు రెడ్ కార్పెట్​పై డిఫరెంట్ డ్రస్సులో వచ్చి అందరిని కనువిందు చేశారు. ఈ సంవత్సరం ‘గంగూబాయి కాఠియావాడి’, ‘బధాయీ దో’ చిత్రాలకు అవార్డుల వర్షం కురిసింది. గంగూబాయి కాఠియావాడి సినిమా ఉత్తమ సినిమా, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు సహా 9 […]

Share:

ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్‌లో హ్యుందాయ్ 68వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2023’ వేడుక అంగరంగవైభవంగా జరిగింది. గురువారం రాత్రి అట్టహాసంగా జరిగిన ఈ వేడుకకు బాలీవుడ్‌ హీరోలు హీరోయిన్‌లు హాజరైయ్యారు. అటు బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్‌లు రెడ్ కార్పెట్​పై డిఫరెంట్ డ్రస్సులో వచ్చి అందరిని కనువిందు చేశారు. ఈ సంవత్సరం ‘గంగూబాయి కాఠియావాడి’, ‘బధాయీ దో’ చిత్రాలకు అవార్డుల వర్షం కురిసింది. గంగూబాయి కాఠియావాడి సినిమా ఉత్తమ సినిమా, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు సహా 9 విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఉత్తమ నటుడు సహా మొత్తం 6 కేటగిరీల్లో ‘బధాయీ దో’ కు అవార్డులు అందాయి. ఉత్తమ చిత్రంగా గంగూబాయి కాఠియావాడి  సినిమా ఎంపిక కాగా.. ఉత్తమ డైరెక్టర్‌గా సంజయ్ లీలా భన్సాలీ, ఆలియా భట్ ఉత్తమ హీరోయిన్‌గా అవార్డ్స్ గెలుచుకున్నారు. బధాయీ దో మూవీలో నటించిన రాజ్‌కుమార్ రావ్ ఉత్తమ హీరోగా అవార్డు అందుకున్నారు. కాగా అత్యధిక నామినేషన్లు దక్కించుకున్న జాబితాలో ఉన్న ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ కు ఒక్క అవార్డు రాకపోవడం గమనార్హం.

ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2023 విజేతలు వీరే..

ఉత్తమ చిత్రం: గంగూబాయి కాఠియావాడి

ఉత్తమ చిత్రం (క్రిటిక్స్): బధాయీ దో

ప్రధాన పాత్రలో ఉత్తమ నటుడు (పురుషుడు): రాజ్‌కుమార్ రావ్ (బధాయీ దో)

ప్రధాన పాత్రలో ఉత్తమ నటి (మహిళ): చిత్రానికి అలియా భట్(గంగూబాయి కాఠియావాడి)

ఉత్తమ నటుడు (క్రిటిక్స్’): సంజయ్ మిశ్రా(వధ్)

ఉత్తమ నటి (క్రిటిక్స్’): బధాయీ దో చిత్రానికి భూమి పెడ్నేకర్ మరియు టబు (భూల్ భూలయా 2)

ఉత్తమ దర్శకుడు: సంజయ్ లీలా బన్సాలీ (గంగూబాయి కాఠియావాడి).

ఉత్తమ సహాయ నటుడు (పురుషుడు): (జగ్ జగ్ జీయో ) అనిల్ కపూర్

ఉత్తమ సహాయ నటి (మహిళ): బధాయీ దో చిత్రానికి షీబీ చద్దా

ఉత్తమ సంగీత ఆల్బమ్: (బ్రహ్మాస్త్రానికి) ప్రీతమ్, శివ

ఉత్తమ డైలాగ్: ప్రకాష్ కపాడియా, ఉత్కర్షిణి వశిష్ఠ

ఉత్తమ స్క్రీన్‌ప్లే: అక్షత్ గిల్డియాల్, సుమన్, హర్షవర్ధన్ కులకర్ణి (బధాయీ దో)

ఉత్తమ కథ: అక్షత్ గిల్డియాల్ మరియు బధాయీ దో చిత్రానికి సుమన్ 

బెస్ట్ డెబ్యూ (పురుషుడు): అంకుష్ గెడం

బెస్ట్ డెబ్యూ (మహిళ): ఆండ్రియా కెవిచుసా

బెస్ట్ డెబ్యూ డైరెక్టర్: జస్పాల్ సింగ్ సంధు మరియు రాజీవ్ బర్న్‌వాల్ (వద్).

జీవితకాల సాఫల్య పురస్కారం: ప్రేమ్ చోప్రా

ఉత్తమ సంగీత ఆల్బమ్: ప్రీతమ్ మరియు  శివ  (బ్రహ్మాస్త్రం)

ఉత్తమ నేపథ్య గాయకుడు (పురుషుడు): కేసరియా

ఉత్తమ గాయని (మహిళ): రంగీసారికి కవితా సేథ్

సంగీత ప్రతిభకు: గంగూబాయి నుండి ధోలిడా కోసం జాన్వీ శ్రీమాన్కర్

ఉత్తమ ఎడిటింగ్: నినాద్ ఖనోల్కర్

ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్: గంగూబాయి కాఠియావాడికి శీతల్ శర్మ

ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: సుబ్రతా చక్రవర్తి, అమిత్ రే

ఉత్తమ నేపథ్య సంగీతం: సంచిత్ బల్హారా మరియు అంకిత్ బల్హారా

ఉత్తమ కొరియోగ్రఫీ: ధోలిడా కోసం కృతి మహేష్

ఉత్తమ సినిమాటోగ్రఫీ: సుదీప్ ఛటర్జీ

ఉత్తమ యాక్షన్: విక్రమ్ వేద చిత్రానికి పర్వేజ్ షేక్

ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు: జస్పాల్ సింగ్ సంధు, రాజీవ్ బర్నవాల్ (వధ్) 

ఉత్తమ తొలి చిత్ర నటుడు: అంకుష్ గీదమ్

కాగా ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, మనీష్ పాల్ మరియు ఆయుష్మాన్ ఖురానా హోస్ట్‌గా వ్యవహరించారు. కాగా  ఈ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు మెట్ట మెుదటి సారిగా 1954లో ప్రవేశ పెట్టబడ్డాయి.