17 ఏళ్ల వయసులో టైప్ వన్ డయాబెటిస్ తో బాధపడుతున్న పాకిస్తాన్ నటుడు

పాకిస్తానీ నటుడు ఫవాద్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన  వ్యక్తిగత విషయాలను పంచుకోవడంతో హాట్ టాపిక్ గా మారారు. ఫవాద్ ఖాన్ 17 ఏళ్ల వయసులో టైప్ 1 డయాబెటిస్ తో బాధపడుతున్నట్లు తెలిపారు. ఈ ఆరోగ్య పరిస్థితి కారణంగా ఆయన కేవలం ఎనిమిది రోజుల్లోనే 10 కిలోల బరువు తగ్గాలని తెలిపారు.  ఫవాద్ ఖాన్ కి జ్వరం రావడంతో, శరీరం ఆటో ఇమ్యూన్ రెస్పాన్స్ కు గురైంది. […]

Share:

పాకిస్తానీ నటుడు ఫవాద్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన  వ్యక్తిగత విషయాలను పంచుకోవడంతో హాట్ టాపిక్ గా మారారు. ఫవాద్ ఖాన్ 17 ఏళ్ల వయసులో టైప్ 1 డయాబెటిస్ తో బాధపడుతున్నట్లు తెలిపారు. ఈ ఆరోగ్య పరిస్థితి కారణంగా ఆయన కేవలం ఎనిమిది రోజుల్లోనే 10 కిలోల బరువు తగ్గాలని తెలిపారు. 

ఫవాద్ ఖాన్ కి జ్వరం రావడంతో, శరీరం ఆటో ఇమ్యూన్ రెస్పాన్స్ కు గురైంది. దాంతో అప్పటికే డిహైడ్రేషన్ కూడా ఉండడంతో , ఎనిమిది రోజుల వ్యవధిలో 10 కిలోల బరువు తగ్గినట్లు ఆయన తెలిపారు. ఇది జరగకముందు ఆయన 65 కిలోలు ఉండేవాడినని అన్నారు. 17 సంవత్సరాల వయసులో 65 కిలోల ఉన్న నేను 55 కిలోలకు తగ్గానని చెప్పారు. ఆ సమయంలో నేను ఎంతగా నీళ్లు తాగిన కూడా దాహం తీవ్ర స్థాయికి చేరుకుందని అన్నారు‌ ఈ పరిస్థితిని ఫాలో యూరియా అంటారు. ఇది ఒక వ్యక్తిని అనేకసార్లు మూత్ర విస్సర్జనకు వెళ్లేలా చేస్తుందని తెలిపారు. ఆ సమయంలో నేను ఆరు నుంచి ఏడు లీటర్లు తాగాను. కానీ నా నోరు ఇంకా పొడిగా ఉండేదని, ఎందుకంటే అప్పటికే నాలో డిహైడ్రేషన్ ఉందని నేను గుర్తించలేకపోయానని చెప్పారు. ఆ సమయంలో తనకి వైద్యుడు ఇన్సులిన్ ఇచ్చారని, ఆ తరువాత బాడీ స్టేబుల్ అవుతూ వచ్చిందని, అప్పుడే నేను టైప్ 1 డయాబెటిస్ కి గురయ్యానని తెలిసింది అని ఆయన చెప్పుకొచ్చారు. 

టైప్ 1 డయాబెటిస్ అనేది ఎక్కువగా చిన్నపిల్లలలో లేదంటే అరుదుగా పెద్దవారిలో కనిపిస్తుంది.  కాబట్టి దీనిని బాల్య మధుమేహం అని కూడా పిలుస్తారు. ఇది ప్రాథమికంగా ఇన్సులిన్ ఆధారిత మధుమేహం.  

మనం తినే ఆహారం రక్తంలోని చక్కెరగా మారి శరీరకణాల్లోకి ప్రవేశిస్తేనే మన శరీరానికి శక్తి అందుతుంది. కణాల్లోకి బ్లడ్ షుగర్ వెళ్లేలా చేయడంలో ఇన్సులిన్ కీలక పాత్ర పోషిస్తుంది ఇన్సులిన్ లేకుండా రక్తంలో చక్కెర మన శరీర కణాలలోకి ప్రవేశించదు.  దీంతో ఇది రక్త ప్రవాహంలో పేరుకు పోతుంది.  ఇలా రక్తంలో పేరుకుపోయే చక్కెర మన శరీరానికి హాని చేస్తుంది.  మానవ శరీరంలోని క్లోమగ్రంధిలో ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది . అయితే కొన్ని కారణాలవల్ల ఈ గ్రంధిలో ఇన్సులిన్ ను ఉత్పత్తి చేసే కణాలను వ్యక్తుల రోగనిరోధక వ్యవస్థ నాశనం చేస్తుంది.  దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది . దీన్ని టైప్ 1 డయాబెటిస్ అంటారు. సాధారణంగా పిల్లలలో, యువకులలో ఈ పరిస్థితి నిర్ధారణ అవుతుంది.  కాబట్టి దీన్ని జువానైల్ డయాబెటిస్ అని పిలుస్తారు . అయితే కొన్నిసార్లు బీటా కణాలను రోగనిరోధక వ్యవస్థ నిర్వీరం చేయకుండా క్లోమగ్రంధికి ఏదైనా సోకినప్పుడు లేదా గాయం అయినప్పుడు బీటా కణాలు నిర్వీర్యం అవుతాయి . దీన్ని వైద్య పరిభాషలో సెకండరీ డయాబెటిస్ అంటారు.

తిన్న తర్వాత కూడా బాగా ఆకలి వేయడం, విపరీతమైన దాహం, నోరు తడి ఆరిపోవడం, ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు వెళ్లడం, ఆకలి ఎక్కువగా ఉంటూ బాగా తింటున్నా కూడా ఊహించని విధంగా బరువు తగ్గిపోవడం, అలసట,  కంటి చూపు తగ్గిపోవటం, శ్వాస తీసుకోవడానికి ఎక్కువ కష్టపడటం, తరచుగా చర్మా, మూత్రణాల, యోని ఇన్ఫెక్షన్లు ఎదురవటం, నిద్రలోనే మూత్ర విసర్జన చేయడం, కడుపునొప్పి, వాంతులు వంటివి టైప్ 1 డయాబెటిస్ లక్షణాలు. టైప్ 1 డయాబెటీస్ తో బాధపడుతున్న వారు ఇమ్యూనిటీ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. మెరుగైన జీవనశైలికి అలవాటు పడాలి. మీ ఆహారపు అలవాట్లతో పాటు జీవన విధానాన్ని కూడా మార్చుకోవాలి. ఎక్కువగా వ్యాయామం చేయాలి.