గదర్‌‌ 2 సినిమా చూడటానికి వెళ్లి గుండెపోటుతో వ్యక్తి మృతి

ప్రస్తుత కాలంలో హార్ట్ అటాక్‌లు ఎక్కువ అయ్యాయి. చిన్నాపెద్ద తేడా లేకుండా అందరూ గుండెపోటుల బారిన పడుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌కు చెందని ఓ వ్యక్తి గదర్‌‌2 సినిమా చూద్దామని థియేటర్‌‌కు వెళ్లగా అక్కడే కుప్పకూలి చనిపోయాడు.  బాలీవుడ్‌ సినిమా ‘గదర్‌‌ 2’ సినిమా చూడటానికి వెళ్లి ఓ యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌‌ ఖేరీలో చోటుచేసుకుంది. అక్షత్‌ తివారీ (32) అనే యువకుడు గత శనివారం రాత్రి 7.50 గంటలకు సన్నీ […]

Share:

ప్రస్తుత కాలంలో హార్ట్ అటాక్‌లు ఎక్కువ అయ్యాయి. చిన్నాపెద్ద తేడా లేకుండా అందరూ గుండెపోటుల బారిన పడుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌కు చెందని ఓ వ్యక్తి గదర్‌‌2 సినిమా చూద్దామని థియేటర్‌‌కు వెళ్లగా అక్కడే కుప్పకూలి చనిపోయాడు. 

బాలీవుడ్‌ సినిమా ‘గదర్‌‌ 2’ సినిమా చూడటానికి వెళ్లి ఓ యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌‌ ఖేరీలో చోటుచేసుకుంది. అక్షత్‌ తివారీ (32) అనే యువకుడు గత శనివారం రాత్రి 7.50 గంటలకు సన్నీ డియోల్‌ నటించిన గదర్‌‌ 2 సినిమా సిటీలోని ఫన్‌ సినిమా హాల్‌కు వెళ్లాడు. టికెట్‌ తీసుకొని, మెట్లు ఎక్కుతుండగా ఎవరితోనో ఫోన్‌ మాట్లాడుతుండగా, ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన చుట్టు పక్కల వారు అతనికి సాయం చేసేందుకు వచ్చారు. అప్పుడే తివారీ ఫోన్‌ అన్‌లాక్‌ కావడంతో అక్కడే ఉన్న గార్డులు, బౌన్సర్లు అతని కుటుంబాన్ని సమాచారం అందించారు. ఈ ఘటన అంతా అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఆ తర్వాత వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా, అక్కడికి చేరుకునేలోపే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారని అదనపు సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఏఎస్పీ) నైపాల్‌ సింగ్‌ తెలిపారు. 

మహేవగంజ్‌లో మెడికల్‌ స్టోర్‌‌ నడుపుతున్న అక్షత్‌ తివారీ తన ఫోన్‌లో మాట్లాడుతూ మెట్లు ఎక్కుతుండగా హఠాత్తుగా గుండెపోటు సంభవించింది. ఆయన ముందు ఇద్దరు యువకులు నడుచుకుంటూ వస్తున్నారు. వారి వెనకే నడుచుకుంటూ వస్తున్న అక్షత్ తివారీ కుప్పకూలి నేలపై పడిపోయాడు. హాస్పిటల్‌కు తరలించినా.. లాభం లేకుండా పోయింది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్నామని, దర్యాప్తు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. 

ఈ మధ్య కాలంలో సడెన్‌ హార్ట్ అటాక్‌లు ఎక్కువ అయిపోయాయి. ఇలాంటి ఘటనలపై డాక్టర్లు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యువతలో గుండె సమస్యలకు సాధారణ కారణాలు గుండె జబ్బుల్లో కుటుంబ చరిత్ర, మధుమేహం, రక్తపోటుతో పాటు జీవనశైలి సమస్యలు, ఊబకాయం, ఒత్తిడి, ఎక్సర్‌‌సైజ్‌ లేకపోవడమూ ఒక కారణమని నిపుణులు పేర్కొంటున్నారు.

మూవీ ఎలా ఉందంటే

రెండు దశాబ్దాల క్రితం 2001లో రిలీజై సంచలన విజయం సాధించిన ‘గదర్‌‌ ఏక్‌ ప్రేమ్‌ కహానీ’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన గదర్‌‌2 చిత్రం ఆగస్టు 11న విడుదలై సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. ఇప్పటికే రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. సన్నీ డియోల్‌, అమీషా పటేల్‌ లీడ్‌ రోల్స్‌ ప్లే చేసిన ‘గదర్ 1’ మూవీ హిందీలో మోస్ట్ వాచ్‌డ్‌ మూవీస్‌ లిస్టులో రెండో స్థానంలో నిలిచింది. దాదాపు 22 ఏళ్ల తర్వాత విడుదలైన ఈ చిత్రం సీక్వెల్‌ను చూడటానికి జనాలు పోటీపడ్డారు. ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ మైండ్ బ్లోయింగ్‌ అనిపించాయి. షారూక్‌ ఖాన్‌ పఠాన్‌ సినిమా కంటే కూడా అధికంగా అడ్వాన్స్ బుకింగ్స్ అయ్యాయి.  

1971 నాటి భారత్‌, పాక్‌ యుద్ధ సమయంలో పరిస్థితుల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. మన దేశంలోని పంజాబ్‌లో నివసించే తారాసింగ్‌ (సన్నీ డియోల్‌), సకీనా (అమీషా పటేల్‌)ల కుమారుడు చరణ్‌ జీత్‌ సింగ్‌ (ఉత్కర్ష్‌ శర్మ)ను పాకిస్థాన్‌ ఆర్మీ తమ ఆధీనంలోకి తీసుకుంటుంది. బంధించి చిత్ర హింసలు పెడుతుంది. దీంతో తన కుమారుడిని రక్షించుకునేందుకు పాక్‌ బయలుదేరుతాడు తారాసిం. ఈ క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. తన కుమారుడిని రక్షించుకున్నాడా.. లేదా.? అన్నదే కథ.

గదర్‌‌2లో తారాసింగ్‌, సకీనా జంట మరోసారి మ్యాజిక్ చేసిందని ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తారాసింగ్‌ పాత్రలో సన్నీడియోల్‌ జీవించాడని, పవర్‌‌ఫుల్‌ యాక్టింగ్‌తో అదరగొట్టాడని చెబుతున్నారు. సినిమాలో డైలాగ్స్ సూపర్‌‌గా పేలాయని అంటున్నారు. సన్నీ అభిమానుల గోలతో థియేటర్లు దద్దరిల్లుతున్నాయని కామెంట్‌ చేస్తున్నారు.  ఈ మోస్ట్‌ అవైటెడ్ చిత్రాన్ని అనిల్‌ శర్మ తెరకెక్కించారు. కమల్‌ ముఖుత్‌తో కలిసి అనిల్‌ శర్మ నిర్మించాడు. స్వీకెల్‌ ప్రకటించినప్పటి నుంచే ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టే సినిమా రిజల్ట్‌ కూడా ఉంది.