సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ మళయాళ నటుడు ఇన్నోసెంట్ మృతి..!

ప్రముఖ మళయాళ సినీ నటుడు ఇన్నోసెంట్ దాదాపు 40 సంవత్సరాలకు పైగా సినీ ఇండస్ట్రీలోనే కొనసాగుతున్నారు.  ఆయన సినీ కెరియర్లో సుమారుగా 500 చిత్రాలలో నటించి ప్రత్యేకమైన శైలి.. డైలాగ్ డెలివరీతో పాపులారిటీ దక్కించుకున్నారు ప్రస్తుతం గత ఏడాది నుంచి సినీ ఇండస్ట్రీలో వరుస మరణాలు చోటు చేసుకుంటున్నాయి.  టాలీవుడ్ , బాలీవుడ్ అని తేడా లేకుండా చాలామంది సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు స్వర్గస్తులవడం నిజంగా సినీ ఇండస్ట్రీని తేరుకోలేకుండా చేస్తోంది. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ […]

Share:

ప్రముఖ మళయాళ సినీ నటుడు ఇన్నోసెంట్ దాదాపు 40 సంవత్సరాలకు పైగా సినీ ఇండస్ట్రీలోనే కొనసాగుతున్నారు.  ఆయన సినీ కెరియర్లో సుమారుగా 500 చిత్రాలలో నటించి ప్రత్యేకమైన శైలి.. డైలాగ్ డెలివరీతో పాపులారిటీ దక్కించుకున్నారు

ప్రస్తుతం గత ఏడాది నుంచి సినీ ఇండస్ట్రీలో వరుస మరణాలు చోటు చేసుకుంటున్నాయి.  టాలీవుడ్ , బాలీవుడ్ అని తేడా లేకుండా చాలామంది సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు స్వర్గస్తులవడం నిజంగా సినీ ఇండస్ట్రీని తేరుకోలేకుండా చేస్తోంది. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ విషయానికి వస్తే.. కృష్ణ, చలపతిరావు , కృష్ణంరాజు, కే విశ్వనాథ్, వాణీ జయరాం ఇలా ఎంతోమంది నటీనటులు,  సంగీత దర్శకులు,  గాయనీ గాయకులు కన్నుమూశారు. మరొకవైపు ఇతర భాషల ఇండస్ట్రీలలో కూడా ఒకరి తర్వాత ఒకరు మరణిస్తూ ఉండడం ఇండస్ట్రీకి తీరని దుఃఖాన్ని మిగులుస్తోంది.  ఇదిలా ఉండగా తాజాగా ప్రముఖ మళయాళ నటుడు, కమెడియన్,  మాజీ ఎంపీ ఇన్నోసెంట్ కూడా తుది శ్వాస విడిచినట్లు వార్తలు అందుతున్నాయి.

40 సంవత్సరాలకు పైగా..  500 చిత్రాలలో.. 

ప్రముఖ మళయాళ సినీ నటుడు ఇన్నోసెంట్ దాదాపు 40 సంవత్సరాలకు పైగా సినీ ఇండస్ట్రీలోనే కొనసాగుతున్నారు.  ఆయన సినీ కెరియర్లో సుమారుగా 500 చిత్రాలలో నటించి ప్రత్యేకమైన శైలి.. డైలాగ్ డెలివరీతో పాపులారిటీ దక్కించుకున్నాడు.. హాస్యనటుడిగా పేరు తెచ్చుకున్న ఈయన ఆదివారం తుది శ్వాస విడిచినట్లు సమాచారం.  ప్రస్తుతం ఆయన వయసు 75 యేళ్లు. ఇన్నోసెంట్ 2014 నుండి 2019 వరకు మాజీ లోకసభ సభ్యుడిగా పనిచేశారు.. కేరళలోని చాలక్కుడి నియోజకవర్గం నుండి వామపక్షాల మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన ఆయన ఆ తర్వాత మళయాళం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా చాలా సంవత్సరాలు పనిచేసే సినీ ఇండస్ట్రీలో ఉండే కార్మికులకు అండగా నిలిచారు.

మా అధ్యక్షుడిగా సేవలు..

అంతేకాదు ఆయన మా అధ్యక్షుడిగా పనిచేసినన్నాళ్ళూ సినీ పరిశ్రమ ఒక వెలుగు వెలిగిందని ఆయన తోటి నటీనటులు,  ఆయన నుండి లబ్ధి పొందిన సినీ కార్మికులు చెబుతూ ఉంటారు. ఇంత గొప్ప నటుడు మరణించడం సినిమా ఇండస్ట్రీ అంత త్వరగా జీర్ణించుకోలేకపోతుందనే చెప్పాలి. ఇకపోతే ఆయన మరణానికి గల కారణం ఏమిటి అంటే 2012 నాటికే ప్రాణాంతక వ్యాధి క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. ఇటీవల శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయనను మార్చ్ 3 వ తేదీన చెన్నైలోని కొచ్చిలో ఉన్న ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి అక్కడ చికిత్స అందించారు. అయితే అవయవాల వైఫల్యం.. కరోనా వ్యాధి కారణంగా ఊపిరితిత్తుల వ్యాధి అన్ని ఆయనను చుట్టుముట్టాయి. ఫలితంగా మార్చి 26 ఆదివారము రాత్రి  10:30 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య ఆలిస్, కుమారుడు సోనేట్ ఉన్నారు. 

ఇన్నోసెంట్ మరణించారని తెలిసి మళయాళ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆయన మరణానికి ప్రముఖులు సినీ సెలబ్రిటీలు సంతాపం తెలియజేశారు.  ఇక సోమవారం ఉదయం 8 గంటల నుంచి 14 గంటల వరకు కొచ్చిలోని కడవంత్రాలో ఉన్న రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో అభిమానులు ప్రజల సందర్శనార్థం మృతదేహాన్ని ఉంచారు. అనంతరం ఆయన భౌతిక కాయాన్ని ఇరింజలకుడ లోని ఆయన స్వగ్రామానికి తీసుకొచ్చి మధ్యాహ్నం ఒంటి గంట నుండి మూడున్నర గంటల వరకు అక్కడే టౌన్ హాల్లో గ్రామస్తుల సందర్శనార్థం ఉంచారు.

అనంతరం ఆయన నివాసంలో ఉంచి మంగళవారం ఉదయం 10 గంటలకు ఇరింజలకుడ లోనీ సెయింట్ థామస్ కేథడ్రల్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. ఏది ఏమైనా ఒక రాజకీయనేతగా,  నటుడిగా,  సినిమా ఇండస్ట్రీలో కమెడియన్‌గా ప్రేక్షకులను అలరించిన ఇన్నోసెంట్ 75 సంవత్సరాలకే తనువు చాలించడం నిజంగా బాధాకరమని చెప్పాలి.