2024.. భారీ చిత్రాలతో సందడి చేయనున్న థియేటర్లు

వచ్చే ఏడాది సినిమాల పండుగ రానుంది. పెద్ద పెద్ద చిత్రాలు థియేటర్ల వద్ద సందడి చేయడానికి శరవేగంగా రెడీ అవుతున్నాయి. గుంటూరు కారం మొదలు కల్కీ సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. 2024లో సిల్వర్‌‌ స్క్రీన్‌కు పండుగే. దాదాపు ప్రతి నెల ఓ కొత్త సినిమా రిలీజ్ కాబోతోంది. విడుదలయ్యే సినిమాల లిస్ట్ చూస్తే అభిమానులకు పండుగే అనేలా ఉన్నాయి. రాబోయే కొత్త సంవత్సరం ప్రేక్షకులకు మరింత ఆనందాన్ని పంచడానికి తెలుగు వెండితెర రెడీ అవ్వబోతోంది. యాక్షన్‌ […]

Share:

వచ్చే ఏడాది సినిమాల పండుగ రానుంది. పెద్ద పెద్ద చిత్రాలు థియేటర్ల వద్ద సందడి చేయడానికి శరవేగంగా రెడీ అవుతున్నాయి. గుంటూరు కారం మొదలు కల్కీ సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి.

2024లో సిల్వర్‌‌ స్క్రీన్‌కు పండుగే. దాదాపు ప్రతి నెల ఓ కొత్త సినిమా రిలీజ్ కాబోతోంది. విడుదలయ్యే సినిమాల లిస్ట్ చూస్తే అభిమానులకు పండుగే అనేలా ఉన్నాయి. రాబోయే కొత్త సంవత్సరం ప్రేక్షకులకు మరింత ఆనందాన్ని పంచడానికి తెలుగు వెండితెర రెడీ అవ్వబోతోంది. యాక్షన్‌ ప్యాక్డ్‌ థ్రిల్లర్ల నుంచి హృదయాన్ని కదిలించే డ్రామా వరకు అన్ని రకాల సినిమాలు వచ్చే ఏడాదిలో రిలీజ్ కానున్నాయి. ఇప్పుడు ఆ సినిమాల వివరాలేంటో చూద్దాం… 

గుంటూరు కారం..

వచ్చే ఏడాది మంచి ఘాటుగా ఉన్న మూవీతో స్టార్ట్‌ కాబోతోంది. మహేశ్‌ బాబు నటించిన గుంటూరు కారం సంక్రాంతి కానుకగా 2024 జనవరి  12న విడుదల కానుంది. ఈ చిత్రానికి త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించాడు. మీనాక్షి చౌదరి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. జగపతిబాబు తదితరులు ప్రధాన పాత్ర పొషిస్తున్నారు. తమన్‌ మ్యూజిక్‌ అందిస్తున్నాడు. అయితే, ఈ సినిమా మొదలైనప్పటి నుంచి వివాదాలు పలకరిస్తూనే ఉన్నాయి. మొదటగా ఇందులో పూజా హెగ్డేను హీరోయిన్‌గా అనుకున్నారు. తర్వాత ఆమె స్థానంలో శ్రీలీల వచ్చింది. తర్వాత సినిమా నుంచి మ్యూజిక్‌ డైరెక్టర్‌‌ తమన్‌ ఔట్‌ అయ్యాడని వార్తలు వినిపించాయి. దీనిని తమన్‌ స్మూత్‌గా ఖండించాడు. మళ్లీ ఫైట్‌ మాస్టర్లు రామ్‌ లక్ష్మణ్‌ బయటకు వచ్చేశారని పుకార్లు వచ్చాయి. త్రివిక్రమ్‌ అస్థాన కెమెరా మ్యాన్‌ పీఎస్ వినోద్‌ క్రియేటివ్ డిఫెరెన్స్ వల్ల బయటకు వచ్చాడని తెలిసింది. ఆయన స్థానంలో రవి కె చంద్రన్‌ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా గురించి ఇన్నీ పుకార్లు బయటకు వస్తున్నా.. చిత్ర బృందం మాత్రం స్పందించడం లేదు. అయితే, మహేశ్‌ బాబు ఇటీవల ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు బట్టి చూస్తే, గుంటూరు కారం మూవీ ఆగిపోలేదని, షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటుందని తెలుస్తోంది. అన్ని కుదిరితే అనౌన్స్ చేసిన డేట్‌కే సినిమా రిలీజ్‌ అయ్యే అవకాశం ఉంది. 

పుష్ప: ది రూల్‌..

ఐకాన్‌ స్టార్‌‌ అల్లు అర్జున్‌ నటించిన పుష్ప: ది రైజ్‌ మూజీ బాక్సాఫీస్‌ ను షేక్‌ చేసింది. తెలుగులో బ్లాక్‌ బ్లాస్టర్‌‌ కావడంతో పాటు ఎలాంటి అంచనాలు లేకుండా నార్త్ ఇండియాలో విడుదలై ఈ మూవీ అక్కడ కూడా సూపర్‌‌ హిట్‌ గా నిలిచింది. ఎంతలా అంటే ఆ సినిమాలో పాటలు రీల్స్ రూపంలో సంవత్సరం పాటు సోషల్‌ మీడియాను హోరెత్తించాయి. దీంతో పుష్ప: ది రూల్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎప్పుడెప్పుడూ రిలీజ్‌ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. కాగా, ఇటీవల ప్రకటించిన నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డుల్లో పుష్ప సినిమాలో యాక్టింగ్‌కు గాను అల్లు అర్జున్‌కు బెస్ట్‌ యాక్టర్‌‌గా అవార్డు వచ్చింది. మ్యూజిక్‌ డైరెక్టర్‌‌ దేవీశ్రీ ప్రసాద్‌కు బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌‌గా ఎంపికయ్యాడు. దీంతో పుష్ప2పై మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి. 2024 మార్చి 22న ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉది. అయితే, రిలీజ్‌ డేట్‌పై అఫీషియల్‌ కన్ఫర్మేషన్‌ రావాల్సి ఉంది. 

దేవర..

యంగ్‌ టైగర్‌‌ జూనియర్‌‌ ఎన్టీఆర్‌‌ నటిస్తున్న దేవర మూవీ 2024 ఏప్రిల్ 5న విడుదల కానుంది. జనతా గ్యారేజ్‌తో మూవీతో ఎన్టీఆర్‌‌కు హిట్‌ ఇచ్చిన కొరటాల శివ ఈ దేవర మూవీని డైరెక్ట్‌ చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్‌ చేసిన ఎన్టీఆర్‌‌ లుక్‌, డైలాగ్స్‌ బాగా వైరల్‌ అయ్యాయి. బాలీవుడ్‌ నటి, శ్రీదేవీ కూతురు జాన్వీ కపూర్‌‌ ఈ మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. అలాగే, విలన్‌గా నటిస్తున్న సైఫ్‌ అలీఖాన్‌కు కూడా తెలుగులో ఇదే ఫస్ట్ మూవీ. కాగా, ఆచార్య ఫ్లాప్‌తో చెడ్డ పేరు మూటగట్టుకున్న కొరటాల శివకు దేవర సినిమాను ఎలాగైనా హిట్‌ చేయాలన్న కసితో ఉన్నాడు. ఏప్రిల్‌ 5న ఈ మూవీ రిజల్ట్‌ తెలనుంది. 

కంగువ..

సూర్య హీరోగా, శివ డైరెక్టర్‌‌గా తమిళ సినిమా కంగువ 2024 ఏప్రిల్‌ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. హైబడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ కచ్చితంగా హిట్‌ అవుతుందని చిత్ర బృందం ధీమాగా  ఉంది. సూర్యను ఎప్పుడూ చూడని కొత్త రోల్‌లో ఈ సినిమాలో చూడబోతున్నారు. ఇప్పటికే రిలీజ్‌ అయిన టీజర్‌‌ ఈ చిత్రంపై అంచనాలను భారీగా పెంచేసింది. ఇందులో సూర్య గెటప్‌  చాలా కొత్తగా ఉంది. అయితే రిలీజ్‌ డేట్‌పై అఫీషియల్ కన్ఫర్మేషన్‌ రావాల్సి ఉంది. 

ఓజీ: ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్‌‌

పవర్‌‌స్టార్‌‌ పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్‌‌) సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సాహో డైరెక్టర్‌‌ సుజీత్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను స్టార్టింగ్‌ నుంచే అభిమానుల్లో హైప్‌ క్రియేట్‌ అయింది. పవన్‌ కళ్యాణ్‌ ఇందులో గ్యాంగ్‌స్టర్‌‌ గా కనిపిస్తున్నట్లు తాజాగా రిలీజ్‌ చేసిన పోస్టర్‌‌ ద్వారా తెలుసింది. ఫుల్‌ యాక్షన్‌ అండ్‌ సస్పెన్స్ తో వస్తున్న ఈ మూవీ ప్రేక్షకులకు ఐఫీస్ట్‌ అని చిత్ర నిర్మాతలు చెబుతున్నారు. సెప్టెంబర్‌‌ 2న 72 సెకన్ల టీజర్‌‌ విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. 2024 ఏప్రిల్‌ 26న ఈ చిత్రం విడుదల కానున్నట్లు తెలుస్తోంది.  ప్రియాంకా అరుల్‌ మోహన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. మాస్టర్ ఫేమ్‌ అర్జున్‌ దాస్‌, శ్రెయా రెడ్డి ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్నారు. 

కల్కి 2898 AD

రెబల్‌ స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 ఏడీ భవిష్యత్‌ థీమ్‌తో సైన్స్ ఫిక్షన్‌ మూవీ అని చిత్ర బృందం ఇదివరకే ప్రకటించింది. మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌, కమలా హాసన్‌, దీపికా పదుకొణె, దిశా పటానీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్‌ అయిన ఈ చిత్ర టీజర్‌‌ విశేషంగా అకట్టుకుంది. 2024 మే 9న విడుదల కానుంది. అయితే, రిలీజ్‌ డేట్‌ను చిత్ర బృందం అఫీషియల్‌గా కన్ఫర్మేషన్‌ చేయలేదు.