రిలీజ్‌కి ముందే ‘డంకీ’ సినిమా ఓటీటీ హక్కులకు ఫుల్ డిమాండ్

షారుఖ్ ఖాన్ డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం షారూఖ్‌తో సినిమా చేయాలని పెద్ద నిర్మాతలు, దర్శకులు ఎదురు చూస్తున్నారు. పఠాన్, జవాన్ సినిమా తర్వాత.. మళ్లీ ఊపులోకి వచ్చాడు బాలీవుడ్ బాద్ షా. షారుక్‌ ఖాన్ నటించిన ‘పఠాన్’, ‘జవాన్’ ఈ ఏడాది విడుదలై బ్లాక్‌ బస్టర్‌ హిట్ అయ్యాయి. ‘పఠాన్’ వెయ్యి కోట్ల బిజినెస్ చేసింది. ఇక జవాన్‌ కూడా వెయ్యి కోట్ల బిజినెస్ చేసే దిశగా దూసుకుపోతోంది. గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న […]

Share:

షారుఖ్ ఖాన్ డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం షారూఖ్‌తో సినిమా చేయాలని పెద్ద నిర్మాతలు, దర్శకులు ఎదురు చూస్తున్నారు. పఠాన్, జవాన్ సినిమా తర్వాత.. మళ్లీ ఊపులోకి వచ్చాడు బాలీవుడ్ బాద్ షా. షారుక్‌ ఖాన్ నటించిన ‘పఠాన్’, ‘జవాన్’ ఈ ఏడాది విడుదలై బ్లాక్‌ బస్టర్‌ హిట్ అయ్యాయి. ‘పఠాన్’ వెయ్యి కోట్ల బిజినెస్ చేసింది. ఇక జవాన్‌ కూడా వెయ్యి కోట్ల బిజినెస్ చేసే దిశగా దూసుకుపోతోంది. గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న షారుక్‌ ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌ కొట్టడంతో అతని అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోతున్నాయి. కాగా ఇప్పుడు అందరి దృష్టి షారుక్ తర్వాతి సినిమా ‘డంకీ’ పైనే ఉంది. కాగా పఠాన్‌, జవాన్‌ సినిమాల్లో యాక్షన్‌ సీక్వెన్స్‌తో అదరగొట్టాడు షారుక్‌. అయితే డంకీ సినిమాలో మాత్రం ఇవేవీ ఉండవని తెలుస్తోంది. అయినా కూడా ఈ సినిమా సూపర్‌ హిట్ అవుతుందని బాలీవుడ్ పండితులు అంచనా వేస్తున్నారు. 

‘జవాన్ ‘తో తిరుగులేని విజయాన్నందుకున్న షారుఖ్ ప్రస్తుతం అదే జోష్‌తో ‘డంకీ’  సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. రాజ్‌కుమార్‌ హిరానీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌ అవుతుంది. 

ఈ సినిమా ఓటీటీ రైట్స్ అమ్ముడయ్యాయనే ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ హంగామా కథనం ప్రకారం, షూటింగ్ పూర్తికాకుండానే డంకీ మూవీ ఓటీటీ హక్కులు అమ్ముడయ్యాయి. అది కూడా దాదాపు 155 కోట్ల రూపాయలని అంటున్నారు. ఓటీటీ సంస్థల మధ్య పోటీ పెరిగింది. కొత్త సినిమాలను ప్రేక్షకులకు అందించాలని జియో సినిమాస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. షారుఖ్ ఖాన్ నటించిన డంకీ సినిమా ఓటీటీ హక్కులను జియో సినిమాస్ తీసుకుందని టాక్. ఓటీటీ ప్రసార హక్కులను రూ.155 కోట్లకు కొనుగోలు చేశారని చెబుతున్నారు.

జవాన్ త‌ర్వాత‌ బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటించనున్న సినిమా డంకీ. ‘మున్నాభాయ్’ సిరీస్ (తెలుగులో శంక‌ర్‌ద‌దా ఎంబీబీఎస్‌, జిందాబాద్), త్రీ ఇడియ‌ట్స్, ‘పీకే’, ‘సంజు లాంటి బ్ల‌క్ బ‌స్ట‌ర్ సినిమాలు తీసిన రాజ్ కుమార్ హిరాణీ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇందులో షారుఖ్ ఖాన్ సరసన తాప్సీ పన్ను నటిస్తుంది. రాజ్‌కుమార్ హిరానీ తొలిసారిగా షారుఖ్‌ఖాన్‌తో కలిసి డంకీ సినిమా చేయడంతో సహజంగానే అంచనాలు భారీగా ఉన్నాయి. డిసెంబర్ 22న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది. ఇక ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో ఒక‌టి అయిన ఈ సినిమా ఇప్ప‌టికే స‌గ‌నికి పైగా షూటింగ్ క‌ప్లీంట్ చేసుకుంది.

దీపావళి కానుకగా షారుఖ్ డంకీ సినిమా టీజర్‌ ను విడుదల చేయ‌డానికి మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నార‌ని టాక్. దీపావళికి విడుద‌ల కానున్న స‌ల్మాన్ ఖాన్ టైగ‌ర్ జిందా హై 3 (టైగర్ త్రీ)తో పాటు డంకీ టీజ‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేయ‌నున్న‌ట్లు సమాచారం. ఒకవేళ అదే నిజమైతే అటు షారుఖ్ ఫ్యాన్స్‌తో పాటు ఇటు స‌ల్మాన్ ఫ్యాన్స్‌కు పండగ అనే చెప్పుకోవాలి. కాగా దీనిపై అధికారిక సమాచారం కొరకు మరింత సమయం వేచి చూడాల్సి ఉంది.

డ్రామా, రొమాన్స్ జాన‌ర్‌లో తెర‌కెక్కుతున్న ఈ సినిమాను జియో స్టూడియోస్, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, రాజ్‌కుమార్ హిరానీ ఫిల్మ్స్ బ్యాన‌ర్‌లో హిరానీ, గౌరీ ఖాన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బోమన్ ఇరానీ, విక్కీ కౌశల్ త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్రలు పోషిస్తున్నారు. డిసెంబర్ 22న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది.