ప్రాజెక్ట్ “కాంత”లో దుల్కర్ సల్మాన్

దుల్కర్ సల్మాన్ అంటే మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర ఐన మలయాళం హీరో, ఆక్టర్ మమ్ముట్టి గారి అబ్బాయి. ఇప్పుడు పలు భాషల్లో బిజీగా సినిమాలు చేస్తున్నాడు. “సీతరామం” తో కూడా హిట్ అందుకున్న దుల్కర్ వెంటనే “కురూప్” అనే సినిమాని కూడా తెలుగులో విడుదల చేసాడు. దుల్కర్ సల్మాన్ తన 37వ పుట్టినరోజు సందర్భంగా తన రాబోయే ప్రాజెక్ట్ “కాంతా”ను ప్రకటించాడు, సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో తెలుగు స్టార్ రానా దగ్గుబాటితో, దుల్కర్ సల్మాన్ […]

Share:

దుల్కర్ సల్మాన్ అంటే మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర ఐన మలయాళం హీరో, ఆక్టర్ మమ్ముట్టి గారి అబ్బాయి. ఇప్పుడు పలు భాషల్లో బిజీగా సినిమాలు చేస్తున్నాడు. “సీతరామం” తో కూడా హిట్ అందుకున్న దుల్కర్ వెంటనే “కురూప్” అనే సినిమాని కూడా తెలుగులో విడుదల చేసాడు. దుల్కర్ సల్మాన్ తన 37వ పుట్టినరోజు సందర్భంగా తన రాబోయే ప్రాజెక్ట్ “కాంతా”ను ప్రకటించాడు, సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో తెలుగు స్టార్ రానా దగ్గుబాటితో, దుల్కర్ సల్మాన్ జతకడుతున్నాడని కొత్త అప్డేట్. 

బహుభాషా ప్రాజెక్ట్ “కాంత”లో రానా దగ్గుబాటి: 

ప్రముఖ మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ ప్రేత్యేకమైన కథలు ఎంచుకుని తన విశిష్ట నటనతో మంచి విజయాలు అందుకుంటున్న హీరో. బ్యాక్-టు-బ్యాక్ బ్లాక్‌బస్టర్‌లతో ప్రముఖ పాన్-ఇండియన్ స్టార్‌లలో ఒకరిగా స్థిరపడ్డాడు. భారతీయ చలనచిత్రంలో అత్యంత డిమాండ్ ఉన్న ప్రతిభావంతుల్లో ఒకడిగా, ప్రాజెక్టులతో తన కెరీర్‌లో పూర్తిగా బిజీగా ఉన్నాడు. తన 37వ పుట్టినరోజు సందర్భంలో, రానా దగ్గుబాటితో మొదటిసారి స్క్రీన్ పై నటించబోతున్నట్టు ఒక ప్రధాన ప్రకటనను విడుదల చేసాడు దుల్కర్. ఈ పోస్ట్ తో తన అభిమానులను మరియు సోషల్ మీడియా ఫాలోవర్లను ఆశ్చర్యపరిచాడు. సీతా రామం నటుడి 37 వ పుట్టినరోజు సందర్భంగా అధికారికంగా ఈ సినిమాను ప్రారంభించాడు, ఈ చిత్రానికి ప్రతిభావంతులైన నటీనటులతో, నిర్మాతలతో జతకట్టనున్నారు. 

సెల్వరాజ్ దర్శకత్వం పై అంచనాలు: 

ఇటీవలి నివేదికల ప్రకారం, అత్యంత ఎదురుచూసిన ప్రాజెక్ట్ లో ఒకటైన సినిమాగా వస్తున్నా ఈ సినిమాకి ప్రఖ్యాత చిత్రనిర్మాత సెల్వమణి సెల్వరాజ్ ఈ సినిమాకి దర్శకత్వం చేస్తున్నాడని తెలుస్తోంది, ఆయన 2016లో విడుదలైన చిత్రం “నీలా” కి దర్శకత్వం వహించాడు. నెట్‌ఫ్లిక్స్ కోసం సిద్ధమవుతున్న రాబోయే డాక్యుమెంటరీ సిరీస్ “ది హంట్ ఫర్ వీరప్పన్‌”తో సహా పలు ప్రశంసలు పొందిన ప్రాజెక్ట్‌లకు దర్శకత్వం చేశాడు. విడుదల. సెల్వరాజ్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన “లైఫ్ ఆఫ్ పై” చిత్రంలో దర్శకుడు ఆంగ్ లీకి సహాయకుడిగా కూడా పనిచేశారు. “కాంత” సినిమా కథాంశం గురించి పెద్దగా ఏమీ వెల్లడించనప్పటికీ, ఆసక్తికరమైన ఫస్ట్-లుక్ పోస్టర్ ప్రాజెక్ట్ రహస్యమైన మిషన్‌లో ఉన్న కథానాయకుడి చుట్టూ తిరుగుతుందని సూచిస్తుంది. ఈ ప్రాజెక్ట్‌లో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించనున్నాడు, ఇందులో ప్రముఖ సినీ పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖ తారలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను దుల్కర్ హోమ్ బ్యానర్ “వేఫేరర్ ఫిల్మ్స్”, రానా దగ్గుబాటి ప్రొడక్షన్ హౌస్ స్పిరిట్ మీడియాతో కలిసి సంయుక్తంగా బ్యాంక్రోల్ కాబోతోంది. ఫీమేల్ లీడ్ మరియు మిగిలిన స్టార్ కాస్ట్ కి సంబంధించిన మరిన్ని అప్‌డేట్‌లు త్వరలో వెలువడే అవకాశం ఉంది. 

దుల్కర్ రాబోయే సినిమాలు: 

హ్యాండ్సమ్ అండ్ డైనమిక్ హీరో దుల్కర్ సినిమాల్లో ఇప్పుడు రాబోయే యాక్షన్ థ్రిల్లర్ “కింగ్ ఆఫ్ కోతా”  2023 ఓనంకి థియేటర్లలోకి రానుంది. రాజ్ ఇంకా డికె దర్శకత్వం వహించిన దుల్కర్ తోలి వెబ్ సిరీస్ “గన్స్ అండ్ గులాబ్స్” త్వరలో దాని నెట్‌ఫ్లిక్స్ లో ప్రీమియర్‌గా రాబోతోంది. దుల్కర్ సల్మాన్ తెలుగు దర్శకుడు “వెంకీ అట్లూరి”తో లక్కీ భాస్కర్ అనే టైటిల్ తో మరో సినిమా చేస్తున్నాడు. నివేదికల ప్రకారం, సుధా కొంగర దర్శకత్వంలో మరో చిత్రంలో ప్రముఖ తమిళ స్టార్ సూర్యతో స్క్రీన్‌ను పంచుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు.