సెట్ లో నన్ను ఇగ్నోర్ చేశారు: దుల్కర్ సల్మాన్

సెట్ విషయాల గురించి దుల్కర్: దుల్కర్ సల్మాన్ తన సినీ కెరీర్ స్టార్టింగ్ లో జరిగిన ఒక సంఘటన గురించి తెలియజేశాడు. తను ఎప్పుడు మీడియాతో నిజాయితీగా మాట్లాడుతాడు. అందులో భాగంగానే తన ఈ విషయాన్ని తెలియజేశాడు. ఈ సంవత్సరం దుల్కర్ సల్మాన్ సినిమాల విషయంలో మంచి జోష్ లో ఉన్నాడు. ఈ మధ్యే తను రాజ్ అండ్ డీకే ల గన్స్ అండ్ గులాబ్స్ లో నటించాడు. ఇప్పుడు కింగ్ ఆఫ్ కొత్త తో మనం […]

Share:

సెట్ విషయాల గురించి దుల్కర్:

దుల్కర్ సల్మాన్ తన సినీ కెరీర్ స్టార్టింగ్ లో జరిగిన ఒక సంఘటన గురించి తెలియజేశాడు. తను ఎప్పుడు మీడియాతో నిజాయితీగా మాట్లాడుతాడు. అందులో భాగంగానే తన ఈ విషయాన్ని తెలియజేశాడు. ఈ సంవత్సరం దుల్కర్ సల్మాన్ సినిమాల విషయంలో మంచి జోష్ లో ఉన్నాడు. ఈ మధ్యే తను రాజ్ అండ్ డీకే ల గన్స్ అండ్ గులాబ్స్ లో నటించాడు. ఇప్పుడు కింగ్ ఆఫ్ కొత్త తో మనం ముందుకి వచ్చాడు ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. కానీ 2023 లో దుల్కర్ సల్మాన్ చాలా బిజీగా ఉన్నాడు. తను రీసెంట్ గా వరుసగా రెండు సినిమాల తో మన ముందుకు వచ్చాడు. ఈ సందర్భంగా జరిగిన ఇంటర్వ్యూలలో తన సినిమా కెరీర్ ప్రారంభంలో జరిగిన సంఘటన గురించి దుల్కర్ సల్మాన్ తెలియజేశాడు.

సినీ కెరీర్ విషయాల గురించి చెప్పిన దుల్కర్ సల్మాన్:

దుల్కర్ సల్మాన్ ఏ సినిమా షూటింగ్లో ఇలా జరిగిందని చెప్పకపోయినా. తనకు జరిగిన విషయం గురించి మాత్రం స్పందించాడు. మీరు షూటింగ్లో సరిగా రెస్పెక్ట్ ఇవ్వకుంటే. మీకు అనుకున్న ఔట్పుట్ రాదు. ప్రతి మనిషికి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది మన బాధ్యత.

నాకు ఆ సెట్లో రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు నాకు చాలా బాధగా ఉండేది. అసలు ఎందుకు ఇలా అవుతుంది అని కూడా నాకు చాలా సార్లు అనిపించింది. నేను ఈ సినిమాలో యాడ్ చేస్తున్నా నన్ను ఎందుకు ఇలా చేస్తున్నారు అని కూడా అనిపించేది. కొన్నిసార్లు పెద్ద యాక్టర్ రాగానే వాళ్ల కోసం చైర్స్ వేసేవాళ్ళు. నాకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు ఆ విషయంలో నాకు చాలా బాధగా అనిపించేది. ఈ విషయం నన్ను చాలా రోజులు బాధ పెట్టింది అని తనకు అప్పట్లో జరిగిన విషయం గురించి తెలియజేశాడు.

సీతారామంతో బ్లాక్ బస్టర్ అందుకున్న దుల్కర్ సల్మాన్:

దుల్కర్ సల్మాన్ సినీ కెరీర్ లో చాలా ఎత్తు పల్లాలు చూశాడు. మమ్ముట్టి కొడుకే అయినప్పటికీ తన సినీ కెరీర్ లో నిలదొక్కుకోవడానికి కాస్త టైం పట్టింది. ఓకే కణ్మనీ అనే చిత్రంతో దుల్కర్ సల్మాన్ మంచి విజయాన్ని సాధించాడు. ఈ సినిమా తెలుగులో ఓకే బంగారం గా రిలీజ్ అయింది. ఈ సినిమాలో నిత్యామీనన్ హీరోయిన్. ఈ సినిమాకు మణిరత్నం దర్శకత్వం వహించాడు. ఈ సినిమా విజయంతో దుల్కర్ సల్మాన్ సినీ కెరీర్ లో గోల్డెన్ డేస్ స్టార్ట్ అయ్యాయి. తర్వాత తను నటుడిగా కూడా మంచి మార్కులు వేయించుకున్నాడు. దుల్కర్ సల్మాన్ కి అమ్మాయిలలో మంచి ఫాలోయింగ్ ఉంది. తనకి లేడీ ఫ్యాన్స్ చాలా ఎక్కువగా ఉంటారు. తన సినిమా రిలీజ్ అవుతుంటే థియేటర్లో ఎక్కువగా లేడీ ఫ్యాన్సే ఉంటారు. రీసెంట్ గా తను నటించిన సీతారామం తెలుగులో బ్లాక్ బస్టర్ సినిమా. ఈ సినిమాతో మృణాల్ ఠాకూర్ తెలుగు తెరకు పరిచయమైంది.

ఈ సినిమా విజయంతో దుల్కర్ సల్మాన్ క్రేజ్ మరింత పెరిగింది. కానీ రీసెంట్ గా వచ్చిన కింగ్ ఆఫ్ కొత్త ఆశించినంత విజయాన్ని సాధించలేదు. మున్ముందు దుల్కర్ సల్మాన్ నటించే సినిమాలన్నీ మంచి విజయాలు సాధించాలని కోరుకుందాం.