భారీగా పతనం అవుతున్న ఆదిపురుష్ కలెక్షన్స్

ప్రభాస్ రాముడిగా,కృతి సనన్ సీత గా,సైఫ్ అలీఖాన్ రావణాసుడిగా ఓం రౌత్ తెరకెక్కించిన ఆది పురుష్ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ ప్రస్తుతం అంతకంటే భారీ వివాదాల మధ్య చిక్కుకుంది. దీని ప్రభావం సినిమా కలెక్షన్స్ పై భారీగా పడింది. రిలీజ్ కి ముందే బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బద్దలు కొడుతూ ఓపెనింగ్స్ తెచ్చుకున్న ఈ మూవీ వస్తున్న నెగటివ్ కామెంట్స్ మరియు క్రిటిసిజంతో బాగా డీలా పడిపోయింది. ఆదిపురుష్ బాక్స్ ఆఫీస్ డే 8 […]

Share:

ప్రభాస్ రాముడిగా,కృతి సనన్ సీత గా,సైఫ్ అలీఖాన్ రావణాసుడిగా ఓం రౌత్ తెరకెక్కించిన ఆది పురుష్ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ ప్రస్తుతం అంతకంటే భారీ వివాదాల మధ్య చిక్కుకుంది. దీని ప్రభావం సినిమా కలెక్షన్స్ పై భారీగా పడింది. రిలీజ్ కి ముందే బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బద్దలు కొడుతూ ఓపెనింగ్స్ తెచ్చుకున్న ఈ మూవీ వస్తున్న నెగటివ్ కామెంట్స్ మరియు క్రిటిసిజంతో బాగా డీలా పడిపోయింది.

ఆదిపురుష్ బాక్స్ ఆఫీస్ డే 8 వసూళ్లు:

జూన్ 16న వరల్డ్ వైడ్ గ్రాండ్గా రిలీజ్ అయిన ఈ చిత్రం నిన్నటితో రెండవ వారంలోకి అడుగు పెట్టింది. విడుదలైన మొదటివారం మొత్తం ఇండియా లో సుమారు 260 కోట్లు కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద సునామీలా దూసుకుపోయిన ఈ చిత్రం రెండవ వారానికి ₹ 3.25 కోట్లకి పడిపోయింది.

ఈ చిత్రంపై చాలామంది అభ్యంతరాన్ని వ్యక్తం చేయడమే కాకుండా ఎంతో పవిత్రమైన రామాయణాన్ని పాడు చేశారు అని తమ కోపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

వెల్లువెత్తుతున్న విమర్శలు….

పవిత్రమైనటువంటి ఇతిహాసమైన రామాయణాన్ని మోడ్రన్ గా చేస్తున్నాం అందరికీ అర్థమయ్యేలా తీస్తున్నామని చెప్పి హాలీవుడ్ చిత్రాలకు డూప్ లాగా తయారు చేయడం పై ప్రస్తుతం టాలీవుడ్ లో ఓం రౌత్ మీద సెటైర్ల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా ఆంజనేయ స్వామి దగ్గర చెప్పించిన “గుడ్డ నీ బాబుది ,చమురు నీ బాబుది ,నిప్పు నీ బాబుది, కాలేది కూడా నీ బాబుకే…”డైలాగ్ పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఆదిపురుష్ చిత్రం విడుదల 8 రోజులు గడిచింది.. అన్ని భాషలలో కలిపి మొత్తం ఇండియాలో ఇప్పటికీ 263.15 కోట్లు వసూళ్లు రాబట్టింది. బాలీవుడ్ లో ప్రస్తుతం ఈ చిత్రానికి 11.20 ఆక్యుఫెన్సీ నమోదయింది. కేవలం రెండు రోజుల క్రితం నాలుగు వందల కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన ఈ చిత్రంకు వసూళ్లు ఇప్పుడు బాగా పడిపోయాయి.

ముంబైలోని గైటీ గెలాక్సీ సినిమా హాల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన మనోజ్ దేశాయ్ ఆది పురుష్ నిర్మాతలను

జైల్లో పెట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. హిందువుల యొక్క మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసే విధంగా ఈ సినిమా ఉందని…ఎంతో పురాతనం మరియు పవిత్రమైనటువంటి ఇతిహాసాన్ని పాడు చేసినందుకు ఈ సినిమా రచయిత మనోజ్ ముంతాజ్ మరియు నిర్మాణంలో భాగస్వామ్యులైన వారందరినీ జైలుకు పంపాలని ఏఎన్‌ఐతో అన్నారు.

విడుదలకు ముందు భారీ పాజిటివ్ హైప్ సొంతం చేసుకున్న ఈ చిత్రం అనూహ్యంగా వివాదాల్లో చిక్కుకోవడంతో ప్రస్తుతం థియేటర్ యజమానులు తీవ్ర నష్టానికి గురి అవుతున్నారు. ప్రేక్షకులు చిత్రాన్ని చూడడానికి తిరస్కరిస్తున్నారని.. థియేటర్లలో ఆక్యుపెన్సి తగ్గిపోతోందని…ఈ కారణంగా షోలు రద్దు చేసే పరిస్థితి ఉత్పన్నమవుతోందని.. అతి త్వరలో ఈ సినిమా థియరిటికల్ షోస్ ఆపివేయాల్సి వస్తుందని.. లాభాలు తెస్తుంది అనుకున్న ఈ చిత్రం ఈ రకంగా నష్టాలు తెచ్చి పెడుతుందని తాము ఎన్నడూ ఊహించలేదని థియేటర్ల యజమానులు వాపోతున్నారు.

ఆది పురుష చిత్రంలోని పలు సన్నివేశాలు మరియు డైలాగులపై సోషల్ మీడియాలో నెటిజెన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. సీతాదేవి జన్మస్థలం భారతదేశం అన్న విధంగా వచ్చిన డైలాగ్ పై నేపాల్ ప్రభుత్వం తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. వెల్లువెత్తుతున్న విమర్శల నేపథ్యంలో వివాదాస్పదంగా మారిన కొన్ని డైలాగ్స్ ను మేకర్స్ సవరించాలి అన్న ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు డైలాగ్ లో ఎన్ని మార్పులు చేసి ఏమి లాభం.. రిలీజ్ అయిన సినిమాకు డైలాగులు మార్చినంత మాత్రాన జరిగిన నష్టాన్ని పూడ్చలేరు కదా…