Prabhas: ప్రభాస్ తన ఇన్‌స్టా ఖాతాను డీయాక్టివేట్ చేశాడా?

ప్రభాస్ ఆయన డీయాక్టివేట్ చేశారా? అనే దానిపై క్లారిటీ లేదు. ఆయన అకౌంట్‌ను సర్చ్ చేస్తుంటే.. ‘ఈ పేజీ అందుబాటులో లేదు’ అని సందేశం వస్తోంది.  Prabhas:  పాన్ ఇండియా స్టార్‌‌ ‘డార్లింగ్’ ప్రభాస్ (Prabhas).. సినిమాల్లో కాకుండా బయట కనిపించేది చాలా అరుదు. బూతద్ధం వేసి వెతికినా సరే సోషల్‌ మీడియాలో కనిపించడు. ఆయనకు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ అకౌంట్లు ఉన్నా.. వాటినీ ఎక్కువగా ఉపయోగించడు. కేవలం సినిమా ప్రమోషన్ల కోసమే అప్పుడప్పుడు వాడుతుంటాడు. తాజాగా ప్రభాస్ […]

Share:

ప్రభాస్ ఆయన డీయాక్టివేట్ చేశారా? అనే దానిపై క్లారిటీ లేదు. ఆయన అకౌంట్‌ను సర్చ్ చేస్తుంటే.. ‘ఈ పేజీ అందుబాటులో లేదు’ అని సందేశం వస్తోంది. 

Prabhas:  పాన్ ఇండియా స్టార్‌‌ ‘డార్లింగ్’ ప్రభాస్ (Prabhas).. సినిమాల్లో కాకుండా బయట కనిపించేది చాలా అరుదు. బూతద్ధం వేసి వెతికినా సరే సోషల్‌ మీడియాలో కనిపించడు. ఆయనకు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ అకౌంట్లు ఉన్నా.. వాటినీ ఎక్కువగా ఉపయోగించడు. కేవలం సినిమా ప్రమోషన్ల కోసమే అప్పుడప్పుడు వాడుతుంటాడు. తాజాగా ప్రభాస్ ఇన్‌స్టా (Instagram) అకౌంట్‌ను ఎవరో హ్యాక్ చేశారు. ఇన్‌స్టాలో ప్రభాస్ పేరును సెర్చ్ చేస్తుంటే.. ఆయన పేరుతో ఉన్న అకౌంట్‌ వద్ద ‘ఈ పేజీ అందుబాటులో లేదు’ అని కనిపిస్తోంది. అయితే ఫ్యాన్స్ అకౌంట్స్ మాత్రం కనిపిస్తున్నాయి. ప్రభాస్ అధికారిక అకౌంట్ మాత్రం కనపించడం లేదు. ప్రభాస్ ఖాతా హ్యాక్ కావడంతో ఇన్‌స్టాగ్రామ్‌ ఆయన పేజీని డిజేబుల్ చేసి ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ ఇన్‌స్టా అకౌంట్‌ను పునరుద్ధరించే పనిలో ఆయన టీమ్ ఉందని సమాచారం. మరోవైపు ప్రభాస్ తన ఇన్‌స్టా ఖాతాను డీయాక్టివేట్ (deactivate) చేశారనే ప్రచారమూ జరుగుతోంది. డీయాక్టివేట్ చేయడం వల్లే కనిపించడం లేదని చర్చ సాగుతోంది.

జులైలో ఫేస్‌బుక్ ఖాతా

ప్రభాస్ అకౌంట్ హ్యాక్ కావడం ఇదే తొలిసారి కాదు. గత జులైలో ప్రభాస్ ఫేస్‌బుక్ (Facebook) అకౌంట్‌ కూడా హ్యాకింగ్‌కు గురైంది. ‘మనుషులు దురదృష్టవంతులు’ అంటూ ప్రభాస్ ఖాతాలో హ్యాకర్లు ఓ వీడియోను షేర్ చేశారు. దీంతో ఆయన అభిమానులు ఆందోళన చెందారు. దీంతో విషయం తెలుసుకున్న ప్రభాస్.. తన ఫేస్‌బుక్ ఖాతా హ్యాక్ అయినట్లు ఓ ప్రకటనలో వెల్లడించారు. నాలుగు నెలలు కూడా గడవక ముందే ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ ఖాతా హ్యాక్‌ కావడం గమనార్హం. ప్రస్తుతానికి ఫేస్‌బుక్ ఖాతా బాగానే ఉంది. 

టాలీవుడ్ టు హాలీవుడ్

టాలీవుడ్‌లో ఓ చిన్న హీరోగా మొదలై.. పాన్ ఇండియా స్టార్‌‌గా ఎదిగాడు ‘డార్లింగ్’ ప్రభాస్. బాహుబలి సినిమాతో దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను సంపాదించుకున్నాడు. ఒక్కో సినిమాకు రూ. వందల కోట్ల ఖర్చు, కలెక్షన్లతో పవన్ హౌస్‌లా మారాడు. ప్రస్తుతం సలార్, కల్కి సినిమాలతో బిజీగా ఉన్నాడు. సలార్ మరో పాన్ ఇండియా సినిమా కాగా.. కల్కి మాత్రం పాన్ వరల్డ్‌ మూవీగా మారిపోయింది. ఈ సినిమాల కోసం అభిమానులే కాదు.. దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 22న సలార్ విడుదల కానుంది. కేజీఎఫ్ సిరీస్ చిత్రాల తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో సలార్‌‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 ఏడీ చిత్రంలో ప్రభాస్ నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. పాన్‌ వరల్డ్‌ స్థాయిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇవే కాకుండా మారుతి దర్శకత్వంలో ‘రాజా డీలక్స్’ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ చిత్రాల్లోనూ ప్రభాస్ నటించనున్నాడు.

సల్మాన్, ధనుష్‌తో ఢీ

నిజానికి సలార్ (Salaar) పార్ట్ 1 జూన్–ఆగస్టులో విడుదల కావాల్సింది. కానీ ఆదిపురుష్ తర్వాతే థియేటర్లలోకి ఈ సినిమా వస్తుందని చాలా మంది భావించారు. కానీ షూటింగ్ ఆలస్యం కావడం, ఎడిటింగ్, గ్రాఫిక్స్ పనుల్లో డిలే జరగడంతో సినిమా విడుదల పలుమార్లు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 22న పలు భాషల్లో రిలీజ్ చేస్తామని నిర్మాణ సంస్థ ప్రకటించింది. అయితే ఇదే సమయంలోనే బాలీవుడ్ బాద్ షా నటించిన డుంకీ సినిమా రిలీజ్ అవుతోంది. సెన్సిటివ్, హ్యూమరస్ సినిమాల దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటివరకు ఫ్లాప్ అనేది తెలియని హిరానీ కొన్నేళ్లుగా రూపొందిస్తున్నారు. వీళ్లిద్దరి కలయికలో వస్తున్న తొలి సినిమా ఇది. మరోవైపు ధనుష్, అరుణ్ మాథేశ్వరన్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కెప్టెన్ మిల్లర్. ఈ సినిమా కూడా డిసెంబర్‌‌లోనే సలార్‌‌తో పోటీ పడబోతోంది. గతంలో బాహుబలి 2 రిలీజ్ అయిన సమయంలోనే తన పవర్‌‌ పాండీ సినిమాను రిలీజ్ చేశాడు ధనుష్. ఇప్పుడు మరోసారి వీరి మధ్య పోటీ నెలకొంది.