దివ్య స్పందన చనిపోయ్యిందంటూ రూమర్స్

సినీనటి రమ్య‌పై రూమర్స్: దివ్య స్పందన ఇంతకుముందు మనకు రమ్య అనే పేరుతో సుపరిచితం. తను చాలా పెద్ద చిత్రాలలో నటించింది. రీసెంట్గా తను చనిపోయిందని రూమర్స్ వచ్చాయి. దివ్య స్పందన కన్నడలో తమిళంలో చాలా సినిమాలు చేసింది. దివ్య స్పందన అలియాస్ రమ్య చనిపోయిందని ఇంటర్నెట్లో ఫేక్ వార్తలు రావడం వల్ల చాలామంది షాక్ కి గురయ్యారు. బుధవారం కొంతమంది ఆమె సోషల్ మీడియా అకౌంట్లో రిప్ అని పోస్టులు పెట్టారు. తర్వాత తను వెకేషన్ […]

Share:

సినీనటి రమ్య‌పై రూమర్స్:

దివ్య స్పందన ఇంతకుముందు మనకు రమ్య అనే పేరుతో సుపరిచితం. తను చాలా పెద్ద చిత్రాలలో నటించింది. రీసెంట్గా తను చనిపోయిందని రూమర్స్ వచ్చాయి. దివ్య స్పందన కన్నడలో తమిళంలో చాలా సినిమాలు చేసింది. దివ్య స్పందన అలియాస్ రమ్య చనిపోయిందని ఇంటర్నెట్లో ఫేక్ వార్తలు రావడం వల్ల చాలామంది షాక్ కి గురయ్యారు. బుధవారం కొంతమంది ఆమె సోషల్ మీడియా అకౌంట్లో రిప్ అని పోస్టులు పెట్టారు. తర్వాత తను వెకేషన్ లో ఉందని క్లారిటీ వచ్చింది.

దివ్యస్పందన గురించి వచ్చిన రూమర్స్ అన్ని అబద్ధాలే

సినీ నటి రమ్య అలియాస్ దివ్యస్పందన చనిపోయిందని సోషల్ మీడియాలో పుకార్లు వచ్చాయి. తర్వాత తను చనిపోలేదని ఒక క్లారిటీ వచ్చింది. జర్నలిస్టు చిత్ర సుబ్రహ్మణ్యం దివ్య స్పందన చనిపోలేదనే విషయాన్ని అందరికీ తెలియజేసింది. తను ట్విట్టర్ లో ఇలా రాసింది నేను తనతో ఇప్పుడే మాట్లాడా తను బాగానే ఉంది రేపో ఎల్లుండో బెంగళూరు కూడా వస్తుంది అని తెలియజేసింది. రీసెంట్ గా ఆగస్టు 25 వ తారీఖున దివ్య స్పందన తన వెకేషన్ స్టిల్స్ ని instagram లో పోస్ట్ చేసింది. ఇంకా  తన వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న స్టిల్స్ ని కూడా పోస్ట్ చేసింది.

అసలు దివ్య స్పందన ఎవరు?

దివ్య స్పందన ఇంతకుముందు అందరికీ రమ్య గా పరిచయం.2003లో తను పునీత్ రాజ్ కుమార్ సరసన అభి అనే సినిమాలో నటించింది. తర్వాత చాలా సినిమాల్లో నటించింది. తను తమిళంలో కూడా చాలా సినిమాల్లో నటించింది.2004లో కుత్తు అనే సినిమాతో తన తమిళ సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టింది. తర్వాత తను తమిళంలో ఆకాష్, గౌరమ్మ, అమృతధారే, అరసు, సంజు వెడ్స్ గీతాలాంటి సినిమాల్లో నటించింది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్షన్లో తను నటించిన వారనం ఐరమ్ సినిమా నటిగా తనని మరో రేంజ్కి తీసుకెళ్లింది. తనకి కర్ణాటక స్టేట్ ఫిలిం అవార్డు ,నేషనల్ అవార్డు కూడా వచ్చాయి.2013లో తను సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి వెళ్ళింది. రమ్య తెలుగులో కూడా అమృత వర్షం అనే సినిమాలో నటించింది. ఈ సినిమాలో తన నటన వేరే లెవెల్ లో ఉంటుంది.

ఈ సినిమా అప్పట్లో తనకు మంచి పేరు తీసుకొచ్చింది. రమ్య సూర్య సరసన నటించిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ కూడా తనకు మంచి పేరు తీసుకొచ్చింది. తన నటనతో చాలా మంది అభిమానులను సంపాదించుకుంది. మున్ముందు కూడా తను తన సినీ కెరియర్ పరంగా, రాజకీయాల పరంగా మంచి రేంజ్ లో ఉండాలని కోరుకుందాం. తన మీద ఇలాంటి రూమర్స్ రావడం దురదృష్టకరం. తన సినీ కెరియర్లో తను చాలా ఎత్తు పల్లాలు చూసింది. అమృత వర్షం సినిమాలో అడిగా అడిగా అనే పాట అప్పట్లో అభిమానులను అలరించింది. ఈ అమృత వర్షం సినిమాలో చాలా హిట్ సాంగ్స్ ఉన్నాయి. ఈ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని సాధించింది. ఈ సినిమా తర్వాత తను నటించిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ కూడా నటనాపరంగా తనకు మంచి మార్కులు వేసింది.

దివ్యస్పందన ఇలాగే ముందు ముందు కూడా మంచి మంచి సినిమాల్లో నటించాలి, తన ఆరోగ్యం బాగుండాలి. ముఖ్యంగా తనలాంటి వాళ్ల మీద ఇలాంటి రూమర్స్ రాకుండా ఉండాలని కోరుకుందాం.