షారుఖ్ అంత పని చేశాడా??

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ గురించి నెట్టింట ప్రస్తుతం ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ వార్తను విన్న వాళ్లంతా వామ్మో షారుఖ్ అంత పని చేశాడా అని ఆశ్చర్యపోతున్నారు. కింగ్ ఖాన్ ఐడియా మామూలుగా లేదంటూ కొంత మంది, అతడి ముందు చూపుకు హ్యాట్సాఫ్ అని మరికొంత మంది ట్వీట్లు చేస్తున్నారు. ఇంతకీ షారుఖ్ ఖాన్ తీసుకున్న ఆ వైరల్ డిసీషన్ ఏంటో తెలుసా కింగ్ ఖాన్ ఐడియా అదుర్స్ ఇటీవల ఎక్కడ చూసినా […]

Share:

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ గురించి నెట్టింట ప్రస్తుతం ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ వార్తను విన్న వాళ్లంతా వామ్మో షారుఖ్ అంత పని చేశాడా అని ఆశ్చర్యపోతున్నారు. కింగ్ ఖాన్ ఐడియా మామూలుగా లేదంటూ కొంత మంది, అతడి ముందు చూపుకు హ్యాట్సాఫ్ అని మరికొంత మంది ట్వీట్లు చేస్తున్నారు. ఇంతకీ షారుఖ్ ఖాన్ తీసుకున్న ఆ వైరల్ డిసీషన్ ఏంటో తెలుసా

కింగ్ ఖాన్ ఐడియా అదుర్స్

ఇటీవల ఎక్కడ చూసినా చంద్రుడి గురించే చర్చ జరుగుతోంది. అందుకు చంద్రయాన్-3 సక్సెస్ కూడా ఒక కారణం. చంద్రయాన్-3 సక్సెస్ కావడంతో అంతా చంద్రుడి గురించే ఆలోచిస్తున్నారు. అక్కడ షారుఖ్ ఖాన్ కు కొంత భూమి ఉందనే వార్త అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక షారుఖ్ ఖాన్ తో పాటు దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కి కూడా చంద్రుడి మీద భూమి ఉందనే వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. సుశాంత్ సింగ్ అర్ధాంతరంగా తనువు చాలించాడు కాబట్టి ఇప్పుడు ఆ భూమి అతడి తండ్రి పేరు మీదకి మారిందని సమాచారం. సుశాంత్ కి అక్కడ సుమారు రూ. 55 లక్షల విలువైన భూమి ఉందట. సుశాంత్ కలిగి ఉన్న ప్లేస్ ను మేర్ ముస్కోవియన్స్ లేదా సీ ఆఫ్ ముస్కోని అని కూడా పిలుస్తారు. దీంతో కింగ్ ఖాన్ తో పాటు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ పేరు కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది. 

అభిమాని బహుమతి

కింగ్ ఖాన్ కు ఈ భూమిని ఒక ఆసీస్ అభిమాని గిఫ్ట్ గా ఇచ్చిందట. ప్రతి రోజు కింగ్ ఖాన్ పుట్టిన రోజున ఈ అభిమాని తనకు చంద్రుడి మీద భూమిని గిఫ్ట్ గా ఇస్తుందని స్వయానా కింగ్ ఖాన్ తెలిపాడు. అంతే కాకుండా తన వద్ద ఈ భూమికి సంబంధించిన లూనార్ రిజిస్ట్రీ పేపర్లు కూడా ఉన్నాయని షారుఖ్ తెలిపాడు. షారుఖ్ కు చంద్రుడి మీద ఉన్న భూమికి సీ ఆఫ్ ట్రాంక్విలిటీ అనే పేరు ఉందని లునార్ రిజిస్ట్రేషన్ ప్రకారం డేటా చెబుతోంది. షారుఖ్ కోసం బర్త్ డే సందర్భంగా భూమిని కొంటున్న అభిమాని పేరు శాండి అని షారుఖ్ తెలిపాడు. 

జవాన్ ఏం చేయనుందో.. 

కింగ్ ఖాన్ ప్రస్తుతం జవాన్ మూవీలో నటిస్తున్నాడు. టాలెంటెడ్ డైరెక్టర్ అట్లీ, సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతారతో కలిసి మొదటిసారి కింగ్ ఖాన్ వర్క్ చేస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఈ మూవీ సాంగ్స్, ట్రైలర్, టీజర్ అన్నీ అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. ఇక అంతే కాకుండా షారుఖ్ ట్రైలర్ చివరలో చెప్పే డైలాగ్ ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయించింది. ఇక ట్రైలర్ లో షారుఖ్ గుండుతో కనిపించి అభిమానులను సర్ ప్రైజ్ చేశాడు. ఇక ఈ మూవీ రిజల్ట్ మీద అభిమానులతో పాటు మేకర్స్ కూడా ఫుల్ క్లారిటీతో ఉన్నారు. ఈ మూవీని డైరెక్ట్ చేసిన అట్లీకి ఇంత వరకు ప్లాప్ అన్నదే లేదు. అందువల్లే ఈ మూవీ కూడా తప్పకుండా హిట్ అవుతుందని అంతా అంటున్నారు. అంతే కాకుండా మూవీ రషెస్ చూసిన ఫ్యాన్స్ కూడా ఈ సినిమా రిజల్ట్ పై నమ్మకంగా ఉన్నారు. ఇక ఈ మూవీ వరల్డ్ వైడ్ గా సెప్టెంబర్ 7 న రిలీజ్ కానుంది. మొన్న పఠాన్ సినిమాతో 1000 కోట్ల క్లబ్ లో చేరిన షారుఖ్ మరి ఈ మూవీతో ఎన్ని రికార్డులను కొల్లగొడతాడో..