జైల‌ర్‌ .. బాలయ్య బాబు కూడా ఉండాల్సిందే కానీ

టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా ఇప్పుడు ఎక్కడ చూసినా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ మూవీ గురించే చర్చ నడుస్తోంది. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన జైల‌ర్‌తో రజనీ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చారు. చాలా రోజుల తర్వాత తన సత్తా ఏంటో రజనీ బాక్సాఫీస్ కు మరోసారి రుచి చూపించారు. రజనీ పని ఇక అయిపోయింది అని కామెంట్ చేసిన విమర్శకులకు గట్టి సమాధానం ఇచ్చారు. తాను మాట్లాడాల్సిన పని […]

Share:

టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా ఇప్పుడు ఎక్కడ చూసినా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ మూవీ గురించే చర్చ నడుస్తోంది. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన జైల‌ర్‌తో రజనీ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చారు. చాలా రోజుల తర్వాత తన సత్తా ఏంటో రజనీ బాక్సాఫీస్ కు మరోసారి రుచి చూపించారు. రజనీ పని ఇక అయిపోయింది అని కామెంట్ చేసిన విమర్శకులకు గట్టి సమాధానం ఇచ్చారు. తాను మాట్లాడాల్సిన పని లేదని తన మూవీలే మాట్లాడతాయని రజనీ మరోసారి ప్రూవ్ చేశాడు. ఇప్పటికే 150+ కోట్లు వసూలు చేసిన జైల‌ర్‌ 200 కోట్ల క్లబ్ లో చేరేందుకు పరుగులు పెడుతోంది జైల‌ర్‌

జైలర్ లో బాలయ్య అసలు క్రేజీ కదా… 

చాలా రోజుల తర్వాత స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చిన రజనీ జైలర్ మూవీ గురించి ఇప్పుడు ఓ ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ మూవీ డైరెక్టర్ నెల్సన్ తన చివరి మూవీని దళపతి విజయ్ తో తీసి ప్లాప్ ఇచ్చాడు. మూవీ కలెక్షన్లు బాగానే రాబట్టినప్పటికీ అంచనాలను అందుకోవడంలో విఫలం అయింది. దాంతో మనోడు ఈ సారి ఎలాగైనా స్ట్రాంగ్ హిట్ కొట్టాలని డిసైడ్ అయి రజనీని సెలెక్ట్ చేసుకున్నాడు. అనుకున్నట్లుగానే మొదటి రోజు మొదటి ఆట నుంచే జైలర్ మూవీ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఈ మూవీ గురించి క్రేజీ వార్త ఒకటి బయటకు వచ్చింది. ఈ మూవీలో ఓ క్యామియో రోల్ కోసం బాలయ్య బాబును తీసుకోవాలని అనుకున్నట్లు దర్శకుడు కన్ఫామ్ చేశారు. ఆయన తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. 

అన్ని ఇండస్ట్రీల నుంచి ఒక్కొక్కరు.. 

జైలర్ మూవీ హీరో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అయినా కానీ ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేశారు. అందుకోసమే నెల్సన్ దిలీప్ కుమార్ పెద్ద ప్లాన్ వేశాడు. అక్కడి స్టార్లను కూడా ఈ ప్రాజెక్ట్ లో భాగం చేశాడు. అందులో భాగంగానే మలయాళం నుంచి మోహన్ లాల్, కన్నడ నుంచి శివరాజ్ కుమార్, బాలీవుడ్ నుంచి జాకీ ష్రాఫ్ మొదలైన తారాగణాన్ని ఇందులో నటించేలా చేశాడు. ఇక టాలీవుడ్ నుంచి బాలయ్య బాబును కూడా నటింపజేయాలని తాను అనుకున్నట్లు నెల్సన్ ప్రకటించారు. బాలయ్య కోసం ఓ కాప్ రోల్ అనుకున్నాను కానీ అది సరిగ్గా సూట్ అవదని లైట్ తీసుకున్నట్లు నెల్సన్ తెలిపారు. ఇప్పటికే తెలుగు నాట జైలర్ ఫీవర్ కొనసాగుతోంది. నందమూరి బాలయ్య కనుక ఈ మూవీలో ఉంటే వేరే లెవెల్లో ఉండేదని నందమూరి అభిమానులు అంటున్నారు. 

జపాన్ నుంచి వచ్చారు.. 

రజనీ కాంత్ కు ఫ్యాన్స్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కేవలం మన ఇండియాలో మాత్రమే కాకుండా ఆయనకు విదేశాల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. మరీ ముఖ్యంగా జపాన్ లో రజనీకి వీరాభిమానులు ఉన్నారు. ఈ విషయం చాలా మందికి తెలుసు. అందుకోసమే రజనీ సినిమాలు జపాన్ లో కలెక్షన్స్ కొల్లగొడతాయి. ఇక మొన్న మూవీ రిలీజ్ సందర్భంగా ఓ జపాన్ ఫ్యాన్ రజనీ మూవీ ని చూసేందుకు జపాన్ నుంచి తమిళనాడు కు వచ్చారు. దీంతో రజనీ ఫ్యాన్స్ సూపర్ స్టార్ రేంజ్ అంటే ఇదని కామెంట్ చేస్తున్నారు. కానీ సూపర్ స్టార్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా మూవీ రిలీజ్ రోజే హిమాలయాలకు వెళ్లిపోయారు. బాహ్య ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేకుండా ఆయన అక్కడ రిలాక్స్ అవుతున్నారు. ఇక్కడ ఆయన ఫ్యాన్స్ మాత్రం ఒక రేంజ్ లో సంబరాలు చేస్తున్నారు. కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాకుండా హీరోలు, క్రికెట్ సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు కూడా జైలర్ మూవీ అద్భుతం అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అయితే ఏకంగా దర్శకుడిని శాలువాతో సన్మానించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన రజనీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవున్నారు.