గేమ్ ఛేంజర్ పాటలకు శంకర్ 90 కోట్లు ఖర్చు చేశారా

ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్థాయి దాటి వెళ్లాడు రామ్ చరణ్(Ram Charan). జపాన్ లాంటి దేశాల్లోనూ ఫ్యాన్స్ ఉన్నారు.  రామ్ చ‌ర‌ణ్ గ్లోబ‌ల్ స్టార్‌గా మారిన విష‌యం తెలిసిందే. హీరోగా మార్కెట్ స్థాయి కూడా పెర‌గ‌డంతో రామ్ చ‌ర‌ణ్ త‌న క్రేజ్‌కు త‌గ్గ‌ట్టుగా సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు. RRR’ లాంటి గ్లోబల్ బ్లాక్‌బస్టర్ తర్వాత రామ్ చరణ్, ఎన్టీఆర్ తరువాతి చిత్రాలపై భారీ అంచనాలు వచ్చేశాయి తర్వాత సినిమా శంకర్ దర్శకత్వంలో వస్తుండటంతో మరిన్ని అంచనాలు […]

Share:

ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్థాయి దాటి వెళ్లాడు రామ్ చరణ్(Ram Charan). జపాన్ లాంటి దేశాల్లోనూ ఫ్యాన్స్ ఉన్నారు.  రామ్ చ‌ర‌ణ్ గ్లోబ‌ల్ స్టార్‌గా మారిన విష‌యం తెలిసిందే. హీరోగా మార్కెట్ స్థాయి కూడా పెర‌గ‌డంతో రామ్ చ‌ర‌ణ్ త‌న క్రేజ్‌కు త‌గ్గ‌ట్టుగా సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు. RRR’ లాంటి గ్లోబల్ బ్లాక్‌బస్టర్ తర్వాత రామ్ చరణ్, ఎన్టీఆర్ తరువాతి చిత్రాలపై భారీ అంచనాలు వచ్చేశాయి

తర్వాత సినిమా శంకర్ దర్శకత్వంలో వస్తుండటంతో మరిన్ని అంచనాలు ఉన్నాయి. ఉత్తమ కమర్షియల్ దర్శకులలో ఒకరిగా చూసే.. శంకర్‌తో గేమ్ ఛేంజర్ చిత్రం అనేసరికి.. సూపర్ హిట్ కచ్చితం అని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ సినిమా చాలా కాలంగా నిర్మాణంలో ఉంది. శంకర్.. గేమ్ ఛేంజర్ అనే టైటిల్‌ని ఫిక్స్ చేసారు. 

అయితే ఈ సినిమా చాలా కాలంగా నిర్మాణంలోనే ఉంది. శంకర్ ‘గేమ్ ఛేంజర్’ అనే టైటిల్‌ని అనౌన్స్ చేసిన తర్వాత ఈ సినిమాపై హైప్ ఇంకాస్త పెరిగింది. అయితే తాాజాగా గేమ్ ఛేంజర్ గురించి ఓ కళ్లు చెదిరే వార్త వైరల్ అవుతోంది…  ఈ సినిమాలో కేవలం పాటలకే రూ.90 కోట్లు ఖర్చు చేశారట. చాలా గ్రాండ్‌గా పాటల చిత్రీకరణ చేసినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలోని పాటలకే దాదాపు రూ.90 కోట్లు ఖర్చు చేసినట్లు సోషల్ మీడియాలో వస్తుంది. అసలే పాటల చిత్రీకరణ అంటే శంకర్ ఎంత గ్రాండ్‌గా చేస్తాడో అందరికీ తెలిసిందే. అప్పుడెప్పుడో తీసిన ఒకే ఒక్కడు, భారతీయుడి నుంచి ఆ తర్వాత తీసిన ‘ఐ’ వరకు సినిమా ఎలా ఉన్నా పాటలు మాత్రం చాలా రిచ్‌గా ఉంటాయి. కనుక రామ్ చరణ్ సినిమాకి కూడా శంకర్ ఇలానే ప్లాన్ చేశాడని టాక్.

గేమ్ ఛేంజర్ ఆల్బమ్ చాలా క్వాలిటీగా ఉంటుందని ఇప్పటికే సినిమా మ్యూజిక్ కంపోజర్ థమన్ కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పాడు. అలానే కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కూడా ఓ ఇంటర్వ్యూలో గేమ్ ఛాంజర్ సాంగ్స్ గురించి చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి.

గేమ్ ఛేంజర్ మూవీ విషయాలు… 

చ‌ర‌ణ్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్న ఈ సినిమా 1980 రాజ‌కీయాల‌తో పాటు నేటి స‌మ‌కాలీన రాజ‌కీయాంశాల‌ని కూడా చ‌ర్చించ‌బోతున్నారు. తండ్రీ కొడుకుల క‌థ‌గా భారీ స్థాయిలో తెర‌పైకి వ‌స్తున్న `గేహ్ ఛేంజర్‌` గురించి తాజాగా ఓ ఆస‌క్తిక‌ర‌మైన అప్ డేట్ నెట్టింట వైర‌ల్ అవుతోంది. శంక‌ర్ `జెంటిల్ మెన్‌` నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు తాను రూపొందించిన సినిమాల్లో పాట‌ల‌కు ప్ర‌త్యేక బ‌డ్జెట్‌ని కేటాయిస్తూ వ‌స్తున్నారు. టెక్నిక‌ల్‌గానూ, విజువ‌ల్ ప‌రంగానూ శంక‌ర్ సినిమాల్లోని పాట‌లు గ్రాండియ‌ర్‌గా ఉంటుంటాయి.

చ‌ర‌ణ్‌తో చేస్తున్న `గేమ్ ఛేంజ‌ర్‌` మూవీలోనూ శంక‌ర్ పాట‌ల కోసం ప్ర‌త్యేకంగా బ‌డ్జెట్ కేటాయించార‌ట‌. అయితే సినిమాలోని అన్ని పాట‌ల కోసం శంక‌ర్ ఏకంగా రూ.90 కోట్లు ఖ‌ర్చు చేయించార‌ని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. `ఐ`, 2.ఓ సినిమాల పాట‌ల‌కు శంక‌ర్ క‌ళ్లు చెదిరే బ‌డ్జెట్‌ని ఖ‌ర్చు చేయించారు. అయితే రామ్ చ‌ర‌ణ్ సినిమాకు శంక‌ర్ పాట‌ల కోస‌మే దాదాపు వంద కోట్లు ఖ‌ర్చు చేయించ‌డం ఏంట‌ని అంతా అవాక్క‌వుతున్నారు. ఈ నేప‌థ్యంలో జానీ మాస్ట‌ర్ `గేమ్ ఛేంజ‌ర్‌` గురించి చెప్పిన మాట‌లు వైర‌ల్ అవుతున్నాయి.

క్కో సాంగ్ అదిరిపోయింద‌ని, చ‌ర‌ణ్ సార్ మీదున్న ప్రేమ‌నంతా ఈ సినిమాలోని పాట‌లో చూపించాన‌ని, చాలా అద్భుతంగా వ‌చ్చింద‌ని, చాలా కొత్త‌గా ట్రై చేశామ‌ని చెప్ప‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. అంతే కాకుండా ఈ సినిమాలోని పాట‌ల కోసం ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్స్ ప్ర‌భుదేవా, జానీ మాస్ట‌ర్‌, ప్రేమ్ ర‌క్షిత్‌, గ‌ణేష్ మాస్ట‌ర్‌..ఇలా ఒక్కో మాస్ట‌ర్ ఒక్కో పాట‌కు ప‌ని చేశార‌ని, పాట‌ల కోసం శంక‌ర్ భారీ స్థాయిలో ఖ‌ర్చు చేయించార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. శంక‌ర్‌కు తెలుగులో `గేమ్ ఛేంజ‌ర్‌` తొలి సినిమా కావ‌డం వ‌ల్లే ఈ రేంజ్‌లో పాట‌ల కోసం ఖ‌ర్చు చేయించాడ‌ని చెబుతున్నారు. మ‌రి ఇందులో నిజ‌మెంత‌న్న‌ది తెలియాలంటే సినిమా రిలీజ్ వ‌ర‌కు వేచి చూడాల్సిందే