సమంత ఒంటిపై ఆ టాటూ మిస్సింగ్​..

టాలీవుడ్​ బ్యూటీ సమంత ఒంటిపై మూడు టాటూలు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అందులో నాగ చైతన్య పేరుతో ఉన్న టాటూ కూడా. అయితే తాజాగా ఇన్‌స్టాగ్రామ్​లో సామ్​ షేర్​ చేసిన ఫొటోల్లో అది కనిపించడం లేదట. దీంతో ఫ్యాన్స్​ ఈ విషయంపై నెట్టింట చర్చలు మొదలెట్టారు. ఇంతకీ ఏం జరిగింది. అసలు ఆ ఫోటోలు ఎందుకు రిలీజ్ చేసింది.. ఏమైందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో సమంత ఒకరు. ఏ మాయ చేసావే […]

Share:

టాలీవుడ్​ బ్యూటీ సమంత ఒంటిపై మూడు టాటూలు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అందులో నాగ చైతన్య పేరుతో ఉన్న టాటూ కూడా. అయితే తాజాగా ఇన్‌స్టాగ్రామ్​లో సామ్​ షేర్​ చేసిన ఫొటోల్లో అది కనిపించడం లేదట. దీంతో ఫ్యాన్స్​ ఈ విషయంపై నెట్టింట చర్చలు మొదలెట్టారు. ఇంతకీ ఏం జరిగింది. అసలు ఆ ఫోటోలు ఎందుకు రిలీజ్ చేసింది.. ఏమైందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో సమంత ఒకరు. ఏ మాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీకి వచ్చి… అలా ప్రేక్షకులను తన అందంతో మాయ చేసి కట్టిపడేస్తోంది. ఇక అక్కినేని వారి ఇంటికి కోడలుగా వెళ్లి… కోన్నాళ్లు బానే ఉంది. అయితే మళ్లీ ఏమైందో తెలియదు.. నాగచైతన్యతో విడాకులు తీసేసుకుంది. సమంత ఇప్పుడు బిజియెస్ట్ హీరోయిన్లలో ఒకరు. మరోవైపు నాగచైతన్య కూడా సినిమాలతో బిజి బిజిగా ఉన్నారు. ఇక ఎవరి లైఫ్ వారు బతికేస్తూ.. గడిపేస్తున్నారు.

అయితే నాగచౌతన్య, సమంత కలిసి ఉన్న రోజుల్లో… వాళ్లు క్యూట్ కపుల్స్ లో ఒకరిగా ఉండేవారు. వీరు ప్రేమలో ఉన్నప్పుడు చైతు, సమంత టాటూలు వేయించుకున్న సంగతి తెలిసిందే. అయితే సమంత ఒంటిపై మూడు టాటూలు ఉండేవి. అందులో ఏ మాయ చేసావే సినిమాకు గుర్తుగా… మెడకు కిందకు YMC అనే టాటూ ఉంటుంది. ఇంకోటి చేతిపై బాణం గుర్తు తరహాలో ఓ టాటూ ఉంటుంది. ఇంకోటి.. రిబ్స్ పైన మరో టాటూ చై అని ఉంటుంది. ఈ టాటూ 

2019లో నాగ చైతన్యతో కలిసి ఉన్న సమయంలో సామ్ ‘చై’ అనే ఇంగ్లిష్ అక్షరాలను రాయించుకున్నారు.

అలా సమంత ఒంటిపై మూడు టాటూలు ఉన్నాయి. మూడు టాటూలు చైతన్యతో ప్రేమకు గుర్తులే. చేతిపై ఉన్న బాణం గుర్తు టాటూ.. డీ కోడ్ చేస్తే… మ్యారేజ్ డేట్ వస్తుందని సమాచారం. మెడ కిందకు ఏ మాయ చేసావే సినిమాకు గుర్తు. ఇక రిబ్స్ పైన చై అని చైతూ పేరును వేయించుకుంది. ఇప్పుడు ఆ టాటూ మాయం అయినట్లు తెలుస్తోంది. దానికి కారణం చైతుతో విడిపోయాక చైతు జ్ఞాపకాలను ఒక్కోటి దూరం చేస్తోంది సమంత.

ఇప్పుడు రిబ్స్ పైన ఉన్న టాటూ మాయం అయినట్లు తాజాగా అప్లోడ్ చేసిన ఫోటోలు చూస్తే అర్థం అవుతుంది. దుబాయ్ కి వెళ్లిన సమంత… పింక్ కలర్ చీరలో ఓ కార్యక్రమానికి హాజరు అయింది. అక్కడ కొన్ని హాట్ ఫోటోలు దిగింది. ఆ ఫోటోలు చూస్తే… సమంత ఆ టాటూ తీయించేసుకుందని తెలుస్తోంది. ఆ ఫోటోల్లో టాటూ మిస్ అయిందని నెటిజన్స్ గుర్తించారు. దీనితో సమంత.. చైతు టాటూ తీసేందని చూపించడానికే ఆ ఫోటోలు రిలీజ్ చేసిందని అంటున్నారు.

2010లో ఏమాయే చేసావే సినిమాతో తొలిసారిగా నాగచైతన్య, సామ్ కలిసి నటించారు. ఆ తర్వాత ప్రేమలో పడిన వీళ్లిద్దరూ 2017లో వివాహంతో ఒక్కటయ్యారు. నాలుగేళ్లు సజావుగా సాగిన వీరి బంధం.. ఆ తర్వాత మాత్రం విడాకులకు దారితీసింది. ఇక చైతన్య, సమంత మళ్లీ కలుస్తున్నారనే ప్రచారం ఇటీవల వచ్చింది. ఇద్దరి సోషల్ మీడియాల్లో చైతన్య, సమంత కలిసి ఉన్న ఫోటోలు ప్రత్యక్ష్యం అయ్యాయి. దీంతో వాళ్లు మళ్లీ కలుస్తున్నారనే ప్రచారం మొదలు అయింది. దీంతో సమంత ఈ టాటూ లేదని.. హాట్ ఫోజులతో క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చి సమంత.. తన లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. మరోవైపు సినిమాల్లో బిజీగా ఉన్నారు చైతు.