Dhanush Aishwarya: మళ్లీ కలవనున్న ధనుష్ ఐశ్వర్య??

తమిళ సూపర్ స్టార్ (Dhanush) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం  లేదు. ఆయన కేవలం తమిళ సినిమాలే కాకుండా తెలుగు సినిమాలు కూడా చేస్తూ తెలుగు అభిమానులను కూడా ఆశ్చర్యపరుస్తున్నాడు. రీసెంట్ గా అతడు (Dhanush) నటించిన తెలుగు స్ట్రెయిట్ మూవీ సార్ మూవీ ప్రేక్షకులను ఎంతో అట్రాక్ట్ చేసింది. ఇక ఆయన (Dhanush) తన భార్యతో విడాకులు తీసుకుంటాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ విషయాలను ధనుష్- ఐశ్వర్య (Dhanush Aishwarya) కూడా ధృవీకరించారు.  18 […]

Share:

తమిళ సూపర్ స్టార్ (Dhanush) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం  లేదు. ఆయన కేవలం తమిళ సినిమాలే కాకుండా తెలుగు సినిమాలు కూడా చేస్తూ తెలుగు అభిమానులను కూడా ఆశ్చర్యపరుస్తున్నాడు. రీసెంట్ గా అతడు (Dhanush) నటించిన తెలుగు స్ట్రెయిట్ మూవీ సార్ మూవీ ప్రేక్షకులను ఎంతో అట్రాక్ట్ చేసింది. ఇక ఆయన (Dhanush) తన భార్యతో విడాకులు తీసుకుంటాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ విషయాలను ధనుష్- ఐశ్వర్య (Dhanush Aishwarya) కూడా ధృవీకరించారు. 

18 సంవత్సరాల తర్వాత.. 

పెళ్లి  (Marriage) అయిన తర్వాత ఎవరైనా ఏడాదికో లేక రెండు సంవత్సరాలకో విడాకులు తీసుకోవడం కామన్. కానీ ధనుష్-ఐశ్వర్య (Danush-Aishwarya) మాత్రం పెళ్లయిన తర్వాత 18 సంవత్సరాలకు (18 Years) సెపరేట్ అవుతున్నట్లు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. వివాహం అయిన 18 సంవత్సరాల తర్వాత 2022 లో విడిపోతున్నట్లు ఈ జంట ప్రకటించారు. అధికారికంగా వీరిద్దరూ కారణం చెప్పనప్పటికీ, పొంతనలేని విభేదాలే ప్రధాన కారణమని సమాచారం. ముఖ్యంగా వీళ్లిద్దరి కెమిస్ట్రీ (chemistry)  ఆన్‌ అండ్‌ ఆఫ్‌ స్క్రీన్‌ కారణంగా అభిమానులను షాక్‌ కి గురిచేసింది. ఈ జంట (Couple)  విడిపోయిన తర్వాత వారికి ఉన్న ఇద్దరు కుమారులకు వారు కో పేరెంట్స్ గా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇటీవల ఈ జంట పెద్ద కుమారుడు యాత్ర కోసం పాఠశాల కార్యక్రమంలో ఇద్దరూ కలిసి కనిపించారు. దీంతో వెంటనే వీరిద్దరూ కలిసి పోతున్నారనే వార్త వైరల్ అయింది. వీరి విడిపోవడం ఫ్యాన్స్  కు అస్సలు కే నచ్చలేదు. వీరిద్దరూ కలిసి కనిపించే సరికి ఇక ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ధనుష్ ఐశ్వర్య విడిపోయారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. 

ప్రస్తుతం మరో తెలుగు సినిమాతోనే.. 

ధనుష్ ప్రస్తుతం మరో తెలుగు (Telugu Movie)  సినిమాను చేస్తున్నాడు. మొన్నే ఒక స్ట్రెయిట్ సినిమాను ధనుష్ ఇప్పుడు కూడా మరో తెలుగు స్ట్రెయిట్ సినిమానే చేస్తున్నాడు. డీ 50 గా తెరకెక్కనున్న ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం (Direction) వహిస్తున్నాడు. ఇక ఐశ్వర్య-ధనుష్ విడిపోయారని తెలియడంతో తమిళ ఫ్యాన్స్ (Tamil Fans) తో పాటు తెలుగు ఫ్యాన్స్ కూడా కంగారు పడ్డారు. వీరిద్దరూ ఎలాగైనా కలవాలని ప్రార్థనలు చేశారు. ప్రస్తుతం ఫ్యాన్స్ ప్రార్థనలు ఫలించడంతో వీరిద్దరూ కలిసేందుకు సుముఖంగా ఉన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ధనుష్ (Dhanush) కేవలం తెలుగు, తమిళ సినిమాలు మాత్రమే కాకుండా బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు కూడా చేస్తుంటాడు. దీంతో అతడికి కేవలం తమిళంలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. 

ప్రస్తుతం కెప్టెన్ మిల్లర్ తో 

మొన్నే సార్ అంటూ క్లాసిక్ మూవీతో హిట్ అందుకున్న ధనుష్ (Dhanush) ప్రస్తుతం కెప్టెన్ మిల్లర్ (Captain miller) సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి టీజర్ ను విడుదల చేయగా.. అది ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ అందుకుంది. దీంతో మేకర్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇక ఇదే జోరులో కెప్టెన్ మిల్లర్ రెండో పార్ట్ ను కూడా తెరకెక్కించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇతడు కేవలం నటుడిగా మాత్రమే కాకుండా సింగర్ గా స్టోరీ రైటర్ గా కూడా మనకు సుపరిచితమే. నటన పరంగా ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న ధనుష్ (Dhanush) ఇలా వైవాహిక బంధంలో మాత్రం 18 సంవత్సరాల తర్వాత విడాకులు తీసుకుంటానని చెప్పడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. వారిద్దరూ కలవాలని వారి కుటుంబ సభ్యులు  మాత్రమే కాదు ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు.