డెవిల్ సినిమా కోసం విదేశాల నుంచి సంగీత వాయిద్యాలు

కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ జంటగా నటిస్తున్న డెవిల్ సినిమా గురించి ప్రత్యేకమైన ఏర్పాట్లు జరుగుతున్న క్రమం కనిపిస్తోంది. చిత్ర బృందం డెవిల్ సినిమా తీసేందుకు గాను ఎక్కడా కూడా తగ్గకుండా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా, ఒకప్పటి లుక్ సినిమాలో కనిపించేందుకు, ఒకప్పటి నేపథ్య సంగీతం సినిమాలో ఉట్టి పడేందుకు, సంగీత వాయిద్యాలు ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు.  తగ్గేదేలే అంటున్న చిత్ర బృందం:  కళ్యాణ్‌రామ్ నటుడుగా నటిస్తున్న డెవిల్ సినిమాలో సన్నివేశాలలో […]

Share:

కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ జంటగా నటిస్తున్న డెవిల్ సినిమా గురించి ప్రత్యేకమైన ఏర్పాట్లు జరుగుతున్న క్రమం కనిపిస్తోంది. చిత్ర బృందం డెవిల్ సినిమా తీసేందుకు గాను ఎక్కడా కూడా తగ్గకుండా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా, ఒకప్పటి లుక్ సినిమాలో కనిపించేందుకు, ఒకప్పటి నేపథ్య సంగీతం సినిమాలో ఉట్టి పడేందుకు, సంగీత వాయిద్యాలు ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. 

తగ్గేదేలే అంటున్న చిత్ర బృందం: 

కళ్యాణ్‌రామ్ నటుడుగా నటిస్తున్న డెవిల్ సినిమాలో సన్నివేశాలలో ఒకప్పటి లుక్ కనిపించాలని విషయానికి వస్తే ఏ అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. ఈ చిత్రం 1940ల నాటి మద్రాస్ ప్రెసిడెన్సీ నేపథ్యంలో సాగుతుంది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ నటుడు బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్‌గా నటించాడు. డెవిల్ సినిమా నుంచి ఇటీవల విడుదల చేసిన మాయ చేసావే పాట భారీ విజయం సాధించింది. ఈ పాటను కరైకుడిలోని కనడుకథన్ ప్యాలెస్ వంటి దక్షిణ భారతీయ సంప్రదాయ ఇళ్ల దగ్గర అంతేకాకుండా రాజభవనాల్లో చిత్రీకరించడం జరిగింది. డ్రమ్స్, ఇతర పెర్కషన్ వాయిద్యాలు, డిజెంబే, బొంగో, డఫ్ డ్రమ్స్, కాంగో డ్రమ్స్ మరియు గంట గ్లాస్ ఆకారపు టాకింగ్ డ్రమ్ కూడా వివిధ దేశాల నుండి దిగుమతి చేసుకోవడం జరిగింది. 

సంయుక్త మీనన్ గురించి మరింత: 

ఇటీవల సంయుక్త మీనన్ హవా నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఆమె తీసిన ప్రతి సినిమా హిట్ అవ్వడం ఒక ప్రత్యేకమైన ఆకర్షణగా మారింది. సంయుక్త మీనన్ 2016లో ‘పాప్‌కార్న్’ అనే మలయాళ సినిమాతో హీరోయిన్‌గా సినీరంగంలోకి అడుగుపెట్టి తమిళ్, కన్నడ మరియు తెలుగు భాషా చిత్రాల్లో నటించింది. 2018లో ‘కలరి’ సినిమాతో తమిళ సినీరంగానికి పరిచయమై, తెలుగులో కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినీ రంగంలోకి అడుగుపెట్టిన, 2022లో విడుదలైన భీమ్లా నాయక్ మొదటి సినిమాగా రిలీజయింది. ఆమె 2022లో గాలిపట 2 సినిమాతో కన్నడ సినీ రంగంలోకి పరిచయమైంది. 

కళ్యాణ్ రామ్ గురించి మరింత: 

1989లో రామ్ తన మేనమామ నందమూరి బాలకృష్ణతో బాల గోపాలుడు చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాడు. తరువాత, అతను 2003లో తొలిచూపులోనే, అభిమన్యు సినిమాలతో తన నటనా జీవితాన్ని ప్రారంభించాడు, అవి రెండూ కమర్షియల్‌గా పరాజయం పాలయ్యాయి. 2005లో తన సొంత బ్యానర్ ఎన్.టి.ఆర్ స్థాపించాడు. ‘ఎన్టీఆర్’గా పిలవబడే తన తాతగారు ఎన్.టి.రామారావు పేరుతో తన సొంత బ్యానర్ ప్రారంభించాడు.ఆ తర్వాత సురేందర్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేసిన అతనొక్కడే నిర్మించాడు, అది వాణిజ్యపరంగా విజయవంతమైంది. అతని తదుపరి చిత్రాలు అసాధ్యుడు, విజయదశమి మరియు లక్ష్మీ కళ్యాణం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. 

అయినప్పటికీ, అతని 2008 విడుదలైన హరే రామ్ సినిమా నిజానికి వాణిజ్యపరంగా విజయం సాధించింది. అతని 2009లో విడుదలైన జయీభవ, 2010లో విడుదలైన కళ్యాణ్‌రామ్ కత్తి సినిమాలుపరాజయాలుగా నిలిచాయి. 2013లో, రామ్ ఓం 3డిని నిర్మించి, నటించాడు, ఇది భారతదేశపు మొట్టమొదటి 3డి యాక్షన్ చిత్రంగా నిలిచింది కానీ, ఈ చిత్రం కమర్షియల్‌గా పరాజయం పాలైంది. అయితే ఈ సంవత్సరంలో రిలీజ్ అయిన బింబిసారా, అమిగోస్ అంతంత మాత్రంగానే పేరు తెచ్చుకున్నాయి. అయితే ఇప్పుడు డెవిల్ సినిమాతో మరొకసారి మన అందరి ముందుకు రాబోతున్నాడు కళ్యాణ్ రామ్. కళ్యాణ్ రామ్ కు సంబంధించిన చిత్రాలు పరాజయం పాలవునప్పటికీ, కళ్యాణ్ రామ్ నటనకు మాత్రం ఎంతో మంది అభిమానులు ఉన్నారని చెప్పుకోవచ్చు. తాను తీసిన లక్ష్మీ కళ్యాణం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టినప్పటికీ, ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది సినిమా. 

అదే విధంగా బింబిసారా థియేటర్స్ లో ప్రేక్షకులను అంతంతమాత్రంగా అలరించినప్పటికీ, ఇటీవల టీవీలో ప్రసారమై అధిక టిఆర్పి రేట్ పెంచిన సినిమాగా పేరు తెచ్చుకుంది. నందమూరి తారక రామారావు మనవడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన కళ్యాణ్ రామ్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు.