ప‌వ‌న్ దుస్తుల‌న్నీ క‌ట్ చేసి స్టిచ్ చేసాం

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు .  ఏం చేసినా చాలా ప్రత్యేకంగా ఉండాలని ఆలోచించే పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో ప్రేక్షక ఆదరాభిమానాలను సొంతం చేసుకున్నారు.  ఒకరకంగా చెప్పాలి అంటే సినిమాల పరంగా కాకుండా తన మంచి మనసుతోనే ఎంతోమంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు పవన్ కళ్యాణ్.  టాలీవుడ్ లోనే కాదు యావత్ సినీ ఇండస్ట్రీలో ఏ ఒక్క హీరోకి లేని అభిమానులు ఒక పవన్ […]

Share:

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు .  ఏం చేసినా చాలా ప్రత్యేకంగా ఉండాలని ఆలోచించే పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో ప్రేక్షక ఆదరాభిమానాలను సొంతం చేసుకున్నారు.  ఒకరకంగా చెప్పాలి అంటే సినిమాల పరంగా కాకుండా తన మంచి మనసుతోనే ఎంతోమంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు పవన్ కళ్యాణ్.  టాలీవుడ్ లోనే కాదు యావత్ సినీ ఇండస్ట్రీలో ఏ ఒక్క హీరోకి లేని అభిమానులు ఒక పవన్ కళ్యాణ్  సొంతమని చెప్పవచ్చు.  దేవుడి తర్వాత దేవుడు అంత గొప్పగా ఈయనను ఆరాధిస్తారు. అభిమానిస్తారు.. అందుకే పవన్ కళ్యాణ్ అంటే ప్రతి ఒక్కరికి అంత ఇష్టం.

 ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తన సినిమాల ద్వారా ప్రేక్షకులను అలరించడమే కాదు వ్యక్తిగతంగా ఎంతో మందికి సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నారు.  తాను సంపాదించిన డబ్బులో చాలా వరకు పేద ప్రజల కోసం పవన్ కళ్యాణ్ కేటాయిస్తారు అన్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు సినిమాలలో తనకు సక్సెస్ ఇచ్చిన అభిమానుల కోసం ఏదైనా చేయాలని అందులో భాగంగానే రాజకీయాలలోకి వచ్చి అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు.  అలా ఒకవైపు సినిమాలు మరొకవైపు రాజకీయాలంటూ బ్యాలెన్స్ తప్పకుండా ముందడుగు వేస్తున్నారు పవన్ కళ్యాణ్ అందులో భాగంగానే ప్రస్తుతం వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఎన్నికలకు సర్వం సిద్ధం అవుతూనే మరొకవైపు అభిమానులను నిరాశపరచకుండా సినిమాలను ప్రకటిస్తూ దూసుకుపోతున్నారు.

 ఇక తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం బ్రో. తమిళంలో వచ్చిన వినోదయ సీతం సినిమా రీమేక్ గా బ్రో సినిమాను సముద్రఖని తెరకెక్కిస్తున్నారు.  ఇక ఈ సినిమాకి కథ స్క్రీన్ ప్లే అన్నీ త్రివిక్రమే.. ఇదిలా ఉండగా తాజాగా పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో దేవుడి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే . సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ దుస్తులను ప్రముఖ జాతీయ అవార్డు గ్రహీత డిజైనర్ నీతా లుల్లా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఒక మీడియాతో మాట్లాడిన నీతాలుల్ల పవన్ కళ్యాణ్ దుస్తుల వెనుక ఉన్న రహస్యం గురించి వెల్లడించింది. బ్రో సినిమాలో పవన్ కళ్యాణ్ లుక్కు కోసం అతని చొక్కాను కత్తిరించి మళ్ళీ చేతితో కుట్టినట్లు ఆమె వెల్లడించింది. 

ఆమె మాట్లాడుతూ..  పవన్ కోసం నేను అతని చొక్కాలను కత్తిరించి .. చేతితో కుట్టాను. ఎందుకంటే అతడు దేవుడి పాత్ర పోషిస్తున్నందుకు అతడి దుస్తులకు ఆర్గానిక్ టచ్ ఇచ్చాము. ప్రతి దానికి అంచును జోడించే విధంగా దుస్తులను రూపొందించడం జరిగింది.  ముఖ్యంగా నటుడిగా అతడు స్క్రీన్పై చాలా సౌకర్యమంతమైన దుస్తులను ఇష్టపడతాడు. అదే అతని వ్యక్తిత్వాన్ని బయటకి తీస్తుంది. గోచీస్, వర్సెస్ లాంటి బ్రాండ్ దుస్తులను వాడే పవన్ కళ్యాణ్ ఇలాంటి దుస్తులను ధరిస్తాడా అన్న అనుమానం కలిగింది. కానీ ఆయన నవ్వుతూ వాటిని స్వీకరించారు.  దాన్ని బట్టి చూస్తే ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో అర్థమవుతుంది.  ఇక పాత్ర కోసం ఎలాంటివైనా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అంటూ మరొకసారి పవన్ కళ్యాణ్ గొప్పతనాన్ని గుర్తుచేసింది డిజైనర్ నీతా లుల్లా.