Nithin: ఈ సినిమాలో నా పాత్ర కెరీర్‌లోనే ది బెస్ట్‌ అంటున్న నితిన్

ప్రతి ఏడాది వందల సంఖ్యలో సినిమాలు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో తెరకెక్కుతూ ఉంటాయి. వాటిలో టాలీవుడ్(Tollywood) లో కూడా చిన్న, పెద్ద చిత్రాలు కలుపుకొని తక్కువలో తక్కువ 300 సినిమాల వరకు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఏడాదిలో ఉన్నదీ 365 రోజులు. టాలీవుడ్ లో సినిమాలు ఎక్కువగా రిలీజ్ ఐయ్యేది ప్రతి శుక్రవారం. ఆ రోజైతే వీకెండ్ వస్తుందని మెజారిటీ చిత్రాలు శుక్రవారం రిలీజ్ అవుతూ ఉంటాయి. అవి కాకుండా ఫెస్టివల్ సీజన్ సినిమాల పండగ ఉంటుంది.  […]

Share:

ప్రతి ఏడాది వందల సంఖ్యలో సినిమాలు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో తెరకెక్కుతూ ఉంటాయి. వాటిలో టాలీవుడ్(Tollywood) లో కూడా చిన్న, పెద్ద చిత్రాలు కలుపుకొని తక్కువలో తక్కువ 300 సినిమాల వరకు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఏడాదిలో ఉన్నదీ 365 రోజులు. టాలీవుడ్ లో సినిమాలు ఎక్కువగా రిలీజ్ ఐయ్యేది ప్రతి శుక్రవారం. ఆ రోజైతే వీకెండ్ వస్తుందని మెజారిటీ చిత్రాలు శుక్రవారం రిలీజ్ అవుతూ ఉంటాయి. అవి కాకుండా ఫెస్టివల్ సీజన్ సినిమాల పండగ ఉంటుంది. 

ఇలా రిలీజ్ అయ్యే సినిమాలలో 10 నుంచి 15 శాతం మాత్రమే హిట్ టాక్ తెచ్చుకుంటాయి. ఒక్కో నెలలో అయితే గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఒకే రోజు మూడు, నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యే సందర్భాలు కూడా ఉంటాయి. అలాగే ఈ ఏడాది డిసెంబర్ నెలలో టాలీవుడ్ లో మూవీ ట్రాఫిక్ ఎక్కువగా ఉందనే చెప్పాలి.

టాలీవుడ్‌ హీరో నితిన్‌(Nithin)కు కొంతకాలంగా సక్సెస్ లేదు. చివరగా ‘భీష్మ’ చిత్రంతో హిట్ అందుకోగా.. ఆ తర్వాత 2021లో తను నటించిన మూడు సినిమాలు ‘చెక్, రంగ్‌దే, మాస్ట్రో’ నిరాశపరిచాయి. ఇక గతేడాది ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాగా.. అది కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలింది. ఈ క్రమంలోనే ప్రముఖ రచయిత, దర్శకుడు వక్కంతం వంశీతో జతకట్టాడు నితిన్. 

అయితే, నితిన్(Nithin) మాచర్ల నియోజకవర్గం’ సినిమా తర్వాత తన 32వ సినిమాతో రాబోతున్నాడు. నితిన్ తన సొంత బ్యానర్ శ్రేష్ఠ మూవీస్ లో ప్రముఖ రైటర్ వక్కంతం వంశీ(Vakkantam Vamsi) ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌ గా శ్రీలీల(Sreeleela) నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూట్ శరవేగంగా జరుగుతుంది. ఇటీవలే ఈ సినిమాకు ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ (‘Extraordinary Man’)అనే టైటిల్ ని ప్రకటించారు. ఇక ఈ ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమాని మొదట డిసెంబర్ 23న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. కానీ ప్రభాస్(Prabhas) సలార్(Salaar) మళ్ళీ వాయిదా పడి డిసెంబర్ 22న రాబోతున్నట్టు ప్రకటించారు. దీంతో ఆ డేట్ దగ్గర్లో అనౌన్స్ చేసిన సినిమాలన్నీ వాయిదా వేసుకోవడం లేదా ముందుకి రావడం చేస్తున్నాయి. 

ఇప్పటికే వెంకటేష్(Venkatesh) సైంధవ్(Saindhav) సినిమాని డిసెంబర్ నుంచి సంక్రాంతికి తీసుకెళ్లారు. ఇక నాని హాయ్ నాన్న ఇంకా ముందే రిలీజ్ కాబోతుంది. ఇప్పుడు ఇదే బాటలో నితిన్ కూడా తన సినిమాని ముందుకు తీసుకొచ్చేశాడు. ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’(‘Extraordinary Man’) సినిమాని డిసెంబర్ 8న(December 8th ) రిలీజ్ చేయబోతున్నట్టు కొత్త డేట్ ని ప్రకటించారు. అయితే, ఆ రోజు విడుదలైన సినిమా ఇది ఒక్కటే కాదు. ఇది వరుణ్ తేజ్ యొక్క “ఆపరేషన్ వాలెంటైన్” మరియు విశ్వక్ సేన్ యొక్క “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”తో పోటీపడుతుంది. ఈ చిత్రం చాలా వినోదాత్మకంగా ఉంటుందని మరియు విస్తృత ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని నితిన్ హామీ ఇచ్చారు. హారిస్ జయరాజ్ అందించిన సంగీతం, ముఖ్యంగా డేంజర్ పిల్లా పాట కూడా ప్రశంసలు అందుకుంటుంది.

సినిమాలో తన పాత్ర గురించి హీరో నితిన్(Nithin)  నిజంగా సంతోషంగా మరియు ఉత్సాహంగా ఉన్నాడు. తన కెరీర్‌లో అత్యుత్తమ పాత్రల్లో ఇదొకటి అని భావిస్తున్నాడు. “ఎక్స్‌ట్రా-ఆర్డినరీ మ్యాన్” గొప్ప కుటుంబ కథా చిత్రం అని, ప్రజలు చూసే వరకు తాను వేచి ఉండలేనని కూడా చెప్పాడు. అతను ఇప్పటికే కొన్ని ఇతర ప్రాజెక్ట్‌లలో పని చేయడం ప్రారంభించినట్లు కూడా పేర్కొన్నాడు.

ఇక డైరెక్టర్ వక్కంతం వంశీ(Vakkantham Vamsi) విషయానికొస్తే.. గతలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో ‘నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా’ చిత్రాన్ని తెరకెక్కించారు. కానీ ఆ మూవీ కమర్షియల్‌గా వర్కవుట్ కాలేదు. దీంతో చాలా గ్యాప్ తీసుకున్న వక్కంతం వంశీ.. ఈ సినిమాతో రెండోసారి దర్శకుడిగా అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. అయితే వంశీ టాలీవుడ్‌లో అనేక హిట్ సినిమాలకు కథ అందించిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ‘టెంపర్’, రవితేజ ‘కిక్’, అల్లు అర్జున్ ‘రేసు గుర్రం’ తదితర చిత్రాలకు తనే రచయిత.ఈ సినిమా ప్రేక్షకులని ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి మరి. మొత్తానికి ప్రభాస్ సలార్ సినిమా అందరి సినిమాలపై ఎఫెక్ట్ చూపిస్తుంది.