సాండీగో కామిక్ కాన్లో ప్రాజెక్ట్ కే ఫస్ట్ గ్లింప్స్

మూవీ లవర్స్ కి గుడ్ న్యూస్. ప్రభాస్, దీపికా పదుకొణే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నటిస్తున్న ప్రాజెక్ట్ కే నుండి అప్డేట్ వచ్చింది. సాన్ డిగో కామిక్ కాన్ లో ఈ చిత్ర ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ అవుతుంది. జులై 20వ తేదీన ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ అవుతుంది. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే ఈ చిత్రంలో నటించిన స్టార్స్ కూడా ఇక్కడికి వస్తున్నారు.  సాన్ డీగో లో ఈవెంట్ ఈ ఈవెంట్ […]

Share:

మూవీ లవర్స్ కి గుడ్ న్యూస్. ప్రభాస్, దీపికా పదుకొణే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నటిస్తున్న ప్రాజెక్ట్ కే నుండి అప్డేట్ వచ్చింది. సాన్ డిగో కామిక్ కాన్ లో ఈ చిత్ర ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ అవుతుంది. జులై 20వ తేదీన ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ అవుతుంది. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే ఈ చిత్రంలో నటించిన స్టార్స్ కూడా ఇక్కడికి వస్తున్నారు. 

సాన్ డీగో లో ఈవెంట్

ఈ ఈవెంట్ మిమ్మల్ని చాలా ఎగ్జైట్ అయ్యేలా చేస్తుందని ప్రొడ్యూసర్ ఒక స్టేట్మెంట్లో తెలిపాడు. ఈ సినిమా ప్రొడ్యూసర్ అశ్విని దత్ చాలా ఎక్సైటింగ్ గా సినిమా గురించి చెప్పాడు. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ సాన్ డిగో కాన్ లో రిలీజ్ చేస్తుండడం చాలా ఆనందంగా ఉందని చెప్పాడు. ఇండియా సినిమా గురించి ప్రపంచం మొత్తానికి చెప్పడానికి ఈ ప్లేస్ సరైనదని తాను భావిస్తున్నానని చెప్పాడు. 

ప్రభాస్ ప్రాజెక్ట్ కే బ్లాక్ బస్టర్ అవుతుందా? 

ప్రభాస్ అంటే ఇప్పుడు తెలియని వాళ్ళు ఉండరు. బాహుబలి సినిమాతో తన రేంజ్ ఏంటో చూపించాడు. బాహుబలి లో తన పాత్ర కోసం ప్రభాస్ చాలా బరువు పెరిగాడు. పాత్ర కోసం ఏదైనా చేసే ప్రభాస్ లాంటి నటులు కొంతమందే ఉంటారు. ప్రభాస్ బాహుబలి తర్వాత నటించిన సాహో కూడా పెద్ద హిట్ సినిమా. ఈ సినిమాలో తన యాక్టింగ్ వేరే లెవెల్ లో ఉంటుంది. ముఖ్యంగా పోలీసులను బురిడీ కొట్టించే పాత్ర చాలా అద్భుతంగా చేశాడు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ చేసిన రాధేశ్యామ్ ఆశించినంత విజయాన్ని అందించలేదు. ప్రభాస్ రీసెంట్ గా నటించిన ఆది పురుష్ మంచి విజయాన్ని సాధించింది. రామాయణ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందించింది. ప్రభాస్ నెక్స్ట్ సినిమా సలార్. రీసెంట్ గా ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది. అది కూడా సినిమాపై ప్రేక్షకుల అంచనాలను మరింత పెంచింది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ కెరీర్ మరో లెవల్ కి వెళ్తుందని దర్శకుడు ధీమా వ్యక్తం చేస్తున్నాడు. 

కే జి ఎఫ్ ప్రొడ్యూసర్స్ ఏ ఈ సలాడ్ కి కూడా ప్రొడ్యూసర్స్. కే జి ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీలే దీనికి డైరెక్టర్. ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వెళుతున్నాడు. ప్రభాస్ ప్రాజెక్ట్ కే కూడా పెద్ద విజయం సాధిస్తుంది అని ఆశిస్తున్నాం. ఈ సినిమా టీజర్ ని సాన్ డిగో లో రిలీజ్ చేయడం మన ఇండియన్ సినిమాకే గర్వకారణం. ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్. భవిష్యత్తులో ప్రభాస్ పాన్ వరల్డ్ స్టార్ అవ్వడం ఖాయం అంటున్న పేక్షకులు. ఇప్పుడు ప్రభాస్ అంటే ఒక బ్రాండ్. ప్రభాస్ హెల్త్ మీద అప్పుడప్పుడు రూమర్స్ వస్తున్నాయి. వాటి గురించి మనకు క్లారిటీ లేదు. అయినా ప్రభాస్ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం.