ప్రాజెక్ట్ k అప్డేట్.. ప్చ్ నిరాశే..!

దీపికా పదుకొణె ప్రాజెక్ట్ K తో తెలుగులోకి అరంగేట్రం చేస్తోంది, మేకర్స్ ఆమె పోస్టర్‌తో సినిమా ప్రమోషన్‌లను ప్రారంభిస్తున్నారు. కానీ దీపిక లుక్ హల్చల్ చేయాల్సిన బదులుగా, చిత్ర నిర్మాతలు దీపిక లుక్ షేర్ చేసిన అనంతరం, ఫ్యాన్స్ నిజానికి నిరాశలో ఉండిపోయారు. అంతేకాకుండా ఫోటో సైజ్, పాస్పోర్ట్ సైజ్ అంత ఉందని నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. కాలచక్ర అనే పేరుతో పుకార్లు వినిపిస్తున్న క్రమంలో, ప్రాజెక్ట్ K లో అమితాబ్ బచ్చన్ నుండి కమల్ హసన్, […]

Share:

దీపికా పదుకొణె ప్రాజెక్ట్ K తో తెలుగులోకి అరంగేట్రం చేస్తోంది, మేకర్స్ ఆమె పోస్టర్‌తో సినిమా ప్రమోషన్‌లను ప్రారంభిస్తున్నారు. కానీ దీపిక లుక్ హల్చల్ చేయాల్సిన బదులుగా, చిత్ర నిర్మాతలు దీపిక లుక్ షేర్ చేసిన అనంతరం, ఫ్యాన్స్ నిజానికి నిరాశలో ఉండిపోయారు. అంతేకాకుండా ఫోటో సైజ్, పాస్పోర్ట్ సైజ్ అంత ఉందని నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.

కాలచక్ర అనే పేరుతో పుకార్లు వినిపిస్తున్న క్రమంలో, ప్రాజెక్ట్ K లో అమితాబ్ బచ్చన్ నుండి కమల్ హసన్, దీపికా పదుకొణె మరియు ప్రభాస్ వరకు పరిశ్రమలోని కొంతమంది పెద్ద నటీనటులు ఇందులో భాగంగా ఉన్నారు. ఈ చిత్రం గురించి  పెద్ద ప్రకటన చేయడానికి చిత్ర నిర్మాతలు త్వరలో శాన్ డియాగో కామిక్ కాన్‌కు వెళ్లనున్నారు. అయితే, ఈ సినిమాలో దీపికా పదుకొణె పాత్ర లుక్‌ని మేకర్స్ షేర్ చేయడం జరిగింది.

తెలుగులో అరంగేట్రం చేస్తున్న నటి పోస్టర్‌లో భీకరమైన లుక్‌లో కనిపించింది.

నిజానికి ఆ ఫోటోలో దీపిక ఏదో విషయాన్ని తీవ్రంగా చూస్తూ ఉన్నట్లు కనిపిస్తుంది. పోస్టర్‌ను పంచుకుంటూ ప్రొడక్షన్ హౌస్ వైజయంతీ మూవీస్ ఇలా రాసింది, “ఒక మంచి రేపటి కోసం ఒక ఆశ వెలుగులోకి వచ్చింది. ఇది #ProjectK నుండి @DeepikaPadukone.” ప్రొడక్షన్ హౌస్ కూడా దీని గురించి ముందుగానే ప్రకటన కూడా ఇచ్చారు. ప్రాజెక్ట్ కే సంబంధించి అప్డేట్ తప్పకుండా జూలై 21 లోపు వస్తుంది అన్నారు. 

సాన్ డీగో లో ఈవెంట్:

ఈ ఈవెంట్ మిమ్మల్ని చాలా ఎగ్జైట్ అయ్యేలా చేస్తుందని ప్రొడ్యూసర్ ఒక స్టేట్మెంట్లో తెలిపాడు. ఈ సినిమా ప్రొడ్యూసర్ అశ్విని దత్ చాలా ఎక్సైటింగ్ గా సినిమా గురించి చెప్పాడు. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ సాన్ డిగో కాన్ లో రిలీజ్ చేస్తుండడం చాలా ఆనందంగా ఉందని చెప్పాడు. ఇండియా సినిమా గురించి ప్రపంచం మొత్తానికి చెప్పడానికి ఈ ప్లేస్ సరైనదని తాను భావిస్తున్నానని చెప్పాడు. 

ఆమె ఫస్ట్‌లుక్‌తో దీపికా చూస్తున్న తీరు నెటిజన్‌లను నిరాశకి గురి చేసిందని చెప్పాలి. అంతేకాకుండా ఈ లుక్ క్రియేట్ చేసిన హైప్‌, సినిమాకి సరిపోలడం లేదని మరికొందరు బాధపడుతున్నారు. అంతేకాకుండా చాలామంది ఫోటో షేర్ చేస్తూ, పాస్పోర్ట్ సైజ్ కాకుండా మంచి ఫోటో అప్లోడ్ చేసి ఉంటే బాగుండేది అంటున్నారు. 

మరి కొంతమంది ఫ్యాన్స్, ఫస్ట్ లుక్ షేర్ చేయడానికి సమయం ఎందుకు పట్టిందని అడుగుతున్నారు. అంతేకాకుండా సాయంత్రం ఐదు గంటలకు విడుదల చేయవలసిన ఫస్ట్ లుక్ రాత్రి 10:30 కి, అందరూ నిద్ర పోయిన తర్వాత విడుదల చేస్తే ఎవరు చూస్తారు అంటున్నారు. 

ప్రభాస్ ప్రాజెక్ట్ కే బ్లాక్ బస్టర్ అవుతుందా?: 

కే జి ఎఫ్ ప్రొడ్యూసర్స్ ఏ ఈ సలాడ్ కి కూడా ప్రొడ్యూసర్స్. కే జి ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీలే దీనికి డైరెక్టర్. ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వెళుతున్నాడు. ప్రభాస్ ప్రాజెక్ట్ కే కూడా పెద్ద విజయం సాధిస్తుంది అని ఆశిస్తున్నాం. ఈ సినిమా టీజర్ ని సాన్ డిగో లో రిలీజ్ చేయడం మన ఇండియన్ సినిమాకే గర్వకారణం. ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్. భవిష్యత్తులో ప్రభాస్ పాన్ వరల్డ్ స్టార్ అవ్వడం ఖాయం అంటున్న పేక్షకులు. ఇప్పుడు ప్రభాస్ అంటే ఒక బ్రాండ్. ప్రభాస్ హెల్త్ మీద అప్పుడప్పుడు రూమర్స్ వస్తున్నాయి. వాటి గురించి మనకు క్లారిటీ లేదు. అయినా ప్రభాస్ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం.