విజయ్ ఆంటోనీ కూతురి సూసైడ్ నోట్

మ్యూజిక్ డైరెక్టర్ కం యాక్టర్ విజయ్ ఆంటోని కూతురు రీసెంట్ గా సూసైడ్ చేసుకొని చనిపోయింది. తన ఏజ్ జస్ట్ 16 సంవత్సరాలు. తను సోషల్ మీడియాలో ఇంతకుముందు సూసైడ్ చేసుకోవద్దు అని అవేర్నెస్ క్రియేట్ చేశాడు. కానీ ఇప్పుడు తన కుటుంబంలోనే ఇద్దరు సూసైడ్ కలవరం రేపుతోంది.  కూతురి సూసైడ్ నోట్:  తను ఎంతో గారాబంగా పెంచుకున్న కూతురు ఇక లేదు అని తెలిసి విజయ్ ఆంటోని ఎంతగానో కుమిలిపోయాడు. సెప్టెంబర్ 19న తన కూతురు […]

Share:

మ్యూజిక్ డైరెక్టర్ కం యాక్టర్ విజయ్ ఆంటోని కూతురు రీసెంట్ గా సూసైడ్ చేసుకొని చనిపోయింది. తన ఏజ్ జస్ట్ 16 సంవత్సరాలు. తను సోషల్ మీడియాలో ఇంతకుముందు సూసైడ్ చేసుకోవద్దు అని అవేర్నెస్ క్రియేట్ చేశాడు. కానీ ఇప్పుడు తన కుటుంబంలోనే ఇద్దరు సూసైడ్ కలవరం రేపుతోంది. 

కూతురి సూసైడ్ నోట్: 

తను ఎంతో గారాబంగా పెంచుకున్న కూతురు ఇక లేదు అని తెలిసి విజయ్ ఆంటోని ఎంతగానో కుమిలిపోయాడు. సెప్టెంబర్ 19న తన కూతురు తన గదిలో ఉరి వేసుకొని చనిపోయిన సంఘటన మర్చిపోలేకపోతున్నాడు. చివరిగా విజయ్ ఆంటోనీ కూతురు సూసైడ్ నోట్ లో ఏముందో చూసి ప్రతి ఒక్కరు మనసు కలచివేస్తుంది. ‘లవ్ యు ఆల్, మిస్ యు ఆల్’ అంటూ ‘తన స్నేహితులను, టీచర్స్ ని మిస్ అవుతానని’ అంతేకాకుండా ‘తను లేకుండా తన కుటుంబం వేదనకు గురవుతుందని’, చనిపోయేముందు ఆంటోనీ కూతురు నోట్ ద్వారా తెలిపింది.

బిచ్చగాడు హీరో ఇంట్లో విషాదం:

బిచ్చగాడు అనే సినిమాతో విజయ్ ఆంటోని రాత్రికి రాత్రి స్టార్ అయిపోయాడు. ఆ సినిమాతో తన కెరీర్ మరో స్థాయికి వెళ్ళింది. తను నటించే ప్రతి సినిమాలో ఏదో ఒక కాన్సెప్ట్ ఉంటుంది. విజయ్ ఆంటోని చాలా మంచి చిత్రాల్లో నటించాడు. బిచ్చగాడు తర్వాత తన సినిమాలను తెలుగులో కూడా వరుసగా రిలీజ్ చేశాడు. అందులో చాలా వరకు ఫ్లాప్ గా మిగిలాయి. కానీ బిచ్చగాడు సినిమా వల్ల వచ్చిన మార్కెట్ తనకు ఇప్పటికీ అలాగే ఉంది. తల్లి కోసం బిచ్చగాడిగా మారే ఒక బిలియనీర్ అనే కాన్సెప్ట్ చాలా కొత్తగా అనిపించింది. విజయ్ ఆంటోని ఇంతకుముందు కూడా తెలుగులో రవితేజ నటించిన దరువు కి మ్యూజిక్ డైరెక్షన్ చేశాడు. విజయ్ ఆంటోని రీసెంట్ గా బిచ్చగాడు 2 రిలీజ్ చేశాడు.

 అది కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. విజయ్ ఆంటోని కూతురికి ఇలా అవ్వడం బాధాకరమైన విషయం. చదువులో ఒత్తిడి కారణంగానే తను సూసైడ్ చేసుకుంది అంటున్నారు. విజయ్ ఆంటోని చాలాసార్లు యాంటీ సూసైడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేశాడు. అలాంటి పర్సన్ ఇంట్లో ఇలా అవ్వడం బాధాకరమైన విషయం. విజయ్ ఆంటోని కూతురు 12వ తరగతి చదువుతుంది. మంగళవారం తను సూసైడ్ చేసుకుంది. విజయ్ ఆంటోనీ ఇంట్లో ఇలా జరగడం ఇదే మొదటిసారి ఏం కాదు. తన తండ్రి కూడా ఇలాగే సూసైడ్ చేసుకున్నాడు. ఏది ఏమైనా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలని కోరుకుందాం. 

తన కూతురి మరణం అనంతరం, కూతురు కోసం సోషల్ మీడియాలో రాసిన ఒక లెటర్ వైరల్ గా మారింది. ‘అందరికీ నమస్కారం, నా కూతురు మీరా నిజంగా చాలా మంచిది, ధైర్యవంతురాలు. తను మనందరినీ వదిలి ఒక ప్రశాంతమైన ప్రపంచంలోకి వెళ్లిపోయింది. అక్కడ కులం, మతం, డబ్బు, ఈర్ష, నొప్పి, పేద, ధనిక వంటివి అసలు ఏమి ఉండవు. తను ఇప్పటికీ నాతో మాట్లాడుతూనే ఉంది. ఎందుకంటే నేను కూడా తనతో చనిపోయాను కాబట్టి. ఈ క్షణం నుంచి నేను ఆమెతో ఇంకా టైం స్పెండ్ చేయడానికి నాకు కుదురుతుంది. తను పేరు మీద నేను చేసిన మంచి కార్యాలు అన్నీ కూడా ఆమె మొదలుపెట్టినవే.. 

నేను మీ ఆంటోనీ..’ 

ఇలా విజయ్ ఆంటోనీ రాసిన విషాదకరమైన లెటర్ ప్రతి ఒక్కరి మనసుల్ని కలిచివేస్తోంది. ఈ కఠిన సమయంలో విజయ్ ఆంటోని గారు ధైర్యంగా ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుందాం.