ద‌గ్గుబాటి వెంక‌టేష్‌కు అవంటేనే ఇష్టమట

విక్టరీనే తన ఇంటి పేరుగా మార్చుకున్న దగ్గుబాటి వెంకటేశ్ అలియాస్ విక్టరీ వెంక‌టేష్‌ గురించి టాలీవుడ్ లో ఎవరిని అడిగినా చెబుతారు. వెంకటేశ్ తో సినిమా చేస్తే అది మినిమం గ్యారంటీ అని మేకర్స్ ఫీల్ అవుతారు. అందుకోసమే విక్టరీ వెంకటేశ్ కోసం ఎప్పుడూ కథలు రెడీగానే ఉంటాయి. వెంకీ మామ కనుక ఫ్యామిలీ మూవీ చేశాడంటే అది తప్పకుండా హిట్టే. వెంకటేశ్ యాక్షన్ ఫ్యామిలీ మూవీస్ లో ఓ రేంజ్ లో ఉంటుందని అంతా నమ్ముతారు. […]

Share:

విక్టరీనే తన ఇంటి పేరుగా మార్చుకున్న దగ్గుబాటి వెంకటేశ్ అలియాస్ విక్టరీ వెంక‌టేష్‌ గురించి టాలీవుడ్ లో ఎవరిని అడిగినా చెబుతారు. వెంకటేశ్ తో సినిమా చేస్తే అది మినిమం గ్యారంటీ అని మేకర్స్ ఫీల్ అవుతారు. అందుకోసమే విక్టరీ వెంకటేశ్ కోసం ఎప్పుడూ కథలు రెడీగానే ఉంటాయి. వెంకీ మామ కనుక ఫ్యామిలీ మూవీ చేశాడంటే అది తప్పకుండా హిట్టే. వెంకటేశ్ యాక్షన్ ఫ్యామిలీ మూవీస్ లో ఓ రేంజ్ లో ఉంటుందని అంతా నమ్ముతారు. కేవలం ఫ్యామిలీ మూవీస్ మాత్రమే కాకుండా కామెడీ పండించడంలో కూడా విక్టరీ దిట్ట. తన టైమింగ్ తో అందరినీ కడుపుబ్బా నవ్విస్తాడు. అందుకోసమే విక్టరీ వెంకటేశ్ ను అప్రోచ్ అయ్యే దర్శకులు కూడా యాక్షన్ స్టోరీస్ కు సంబంధించిన కథలు కాకుండా ఫ్యామిలీ డ్రామాకు సంబంధించిన కథలను విక్టరీ వద్దకు తీసుకెళ్తారు. అందుకోసమే అతడికి ఎక్కువగా హిట్స్ వస్తుంటాయి. కానీ అటువంటి వెంకీ మామ ప్రస్తుతం రూట్ మార్చాడు. తనకు కలిసి వచ్చిన ఫ్యామిలీ జానర్ లో కాకుండా డిఫరెంట్ జానర్స్ ను ట్రై చేస్తున్నాడు. 

అవే ఇష్టమట… 

ఎమోషన్స్ తో ఫ్యామిలీ ఆడియన్స్ ని కన్నీరు పెట్టించడం విక్టరీకి వెన్నతో పెట్టిన విద్య. అందుకోసం అతడు ఎక్కువగా ఫ్యామిలీ డ్రామాలే చేస్తాడు. కానీ కొద్ది రోజుల నుంచి విక్టరీలో మార్పు వచ్చింది. అతడు ఫ్యామిలీ డ్రామాలు కాకుండా యాక్షన్ మూవీలు కూడా చేస్తున్నాడు. ప్రేక్షకులు అతడి నుంచి వచ్చిన యాక్షన్ మూవీలను కూడా ఆదరించడంతో విక్టరీ వెంకటేశ్ నెమ్మదిగా తన రూట్ ను ఫ్యామిలీ మూవీస్ నుంచి యాక్షన్ మూవీస్ కి మార్చారు. ప్రస్తుతం విక్టరీ నుంచి రాబోతున్న సైంధవ్ మూవీ కూడా ఒక యాక్షన్ ఎంటర్ టైనరే. హిట్, హిట్-2 వంటి హిట్ మూవీలను రూపొందించిన శైలేష్ కొలను ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు కాబట్టి గ్యారెంటీగా హిట్ పక్కా అని ఇటు విక్టరీ వెంకటేశ్ ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కూడా ఫిక్స్ అయిపోయారు. కరోనా సమయంలో వచ్చిన నారప్ప మూవీ నుంచి విక్టరీ తన రూట్ మార్చాడు. తర్వా ఎఫ్ 2 వంటి కామిక్ మూవీ చేశాడు కానీ అతడిలో ఉన్న యాక్షన్ కంటెంట్ మాత్రం అలానే ఉండిపోయింది. వెంకటేష్ చాలా సంవత్సరాలుగా యాక్షన్ రోల్స్‌ కు అట్రాక్ట్ అయ్యాడట. తుపాకీలను పట్టుకోవడం మరియు కండలు తిప్పడం వెంకీ మామకు చాలా ఇష్టమట. కానీ వెంకటేశ్ కు మాత్రం చాలా రోజుల నుంచి అటువంటి అవకాశం రాలేదు. ఇప్పుడే విక్టరీకి ఆ అవకాశం వచ్చిందని ఒక కథనం పేర్కొంది. కేవలం అవే రోల్స్ చేయడం మాత్రమే కాదు వెంకటేష్ వివిధ భాషలలో కోపంతో నిండిన యాక్షన్ సినిమాలనే ఎక్కువగా చూస్తాడట. 

అందుకు సమయం పట్టింది

వెంకటేష్ తన లవర్ బాయ్ మరియు ఫ్యామిలీ మ్యాన్ ఇమేజ్ నుంచి బయటకు రావడానికి కొంత సమయం తీసుకున్నాడు. అప్పట్లో ‘గణేష్’, ‘ఘర్షణ’ వంటి సినిమాలు చేసినా కానీ అవి అంతగా ఆడియన్స్ ను అట్రాక్ట్ చేయలేదు. దీంతో అతడు ఆ జానర్ సినిమాకు దూరం అయ్యాడనే చెప్పాలి. తాను కూడా ఆవేశపూరితమైన పాత్రలను చేయగలనని వీటితో ప్రూవ్ చేసుకున్నాడు కానీ ఆ మూవీస్ మాత్రం హిట్ కాలేదు. దీంతో అతడు ఫ్యామిలీ జానర్స్ మీదే ఎక్కువగా ఫోకస్ చేశాడు. ఈ యాక్షన్ మూవీస్ తర్వాత వచ్చిన మల్లేశ్వరి, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే వంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ లు బ్లాక్‌బస్టర్స్‌ గా నిలవడంతో అతడు ఆ సినిమాల మీదే ఎక్కువగా ఫోకస్ పెట్టాడు. ఇక వెంకీ మామ కెరీర్‌ లో అతిపెద్ద హిట్ అయిన ఎఫ్ 2 తర్వాత వెంకటేశ్ రేంజ్ మారిపోయింది. ఫ్రస్టేటెడ్ భర్తలకు వెంకటేశ్ బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయాడు. ఆ మూవీలో వెంకీ వేసిన ‘వెంకీ ఆసన్’ అటువంటి భర్తలకు నిత్యకృత్యం అయిపోయింది. ఇక అదే ఊపులో మూవీ టీం ఎఫ్ 2 కి సీక్వెల్ కూడా అనౌన్స్ చేసింది. దీంతో అటువంటి మరో కామిక్ రోల్ లోనే వెంకీ దర్శనం ఇచ్చాడు.