ఎస్ఎస్ రాజమౌళి తెలుగు సినిమా ఆర్‌ఆర్‌ఆర్ ఖాతాలో మరో అవార్డు

ఆర్‌ఆర్‌ఆర్ హవా మామూలుగా లేదు. బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేగ్గొట్టడమే కాకుండా, ఎన్నో అవార్డులు, రివార్డులు కొల్లగొడుతోంది. ఎస్ఎస్ రాజమౌళి తెలుగు సినిమా ఆర్‌ఆర్‌ఆర్ ఖాతాలో మరో అవార్డు చేరింది. సోమవారం రాత్రి జరిగిన దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ వేడుకలో.. ఎస్ఎస్ రాజమౌళి తెలుగు సినిమా ఆర్‌ఆర్‌ఆర్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కైవసం చేసుకుంది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు సినిమా రంగంలో అందించే దేశ అత్యున్నత పురస్కారాలలో ఒకటి. డైరెక్టరేట్ […]

Share:

ఆర్‌ఆర్‌ఆర్ హవా మామూలుగా లేదు. బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేగ్గొట్టడమే కాకుండా, ఎన్నో అవార్డులు, రివార్డులు కొల్లగొడుతోంది. ఎస్ఎస్ రాజమౌళి తెలుగు సినిమా ఆర్‌ఆర్‌ఆర్ ఖాతాలో మరో అవార్డు చేరింది. సోమవారం రాత్రి జరిగిన దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ వేడుకలో.. ఎస్ఎస్ రాజమౌళి తెలుగు సినిమా ఆర్‌ఆర్‌ఆర్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కైవసం చేసుకుంది.

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు సినిమా రంగంలో అందించే దేశ అత్యున్నత పురస్కారాలలో ఒకటి. డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ గత రాత్రి 2023 సంవత్సరానికి గానూ విజేతల జాబితాను ప్రకటించింది. ఈ అవార్డులలో బాలీవుడ్ కొత్తజంట అవార్డులు కొల్లగొట్టింది. కన్నడ సినీ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ అవార్డును గెలుచుకోగా, రణబీర్ కపూర్, అతని భార్య అలియా భట్ వరుసగా ఉత్తమ నటుడు, నటి అవార్డులను గెలుచుకున్నారు.

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు

ఉత్తమ చిత్రం: ది కాశ్మీర్ ఫైల్స్

ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్: ఆర్‌ఆర్‌ఆర్

ఉత్తమ దర్శకుడు: చుప్: రివెంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్ చిత్రానికి – ఆర్ బాల్కీ 

ఉత్తమ నటుడు: బ్రహ్మాస్త్ర పార్ట్ 1 చిత్రానికి – రణబీర్ కపూర్ 

ఉత్తమ నటి: గంగూబాయి కతియావాడి చిత్రానికి – అలియా భట్

మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్: కాంతారా చిత్రానికి – రిషబ్ శెట్టి

ఉత్తమ వెబ్ సిరీస్: రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్

విమర్శకుల ప్రశంసలందుకున్న ఉత్తమ నటుడు: భేదియా చిత్రానికి వరుణ్ ధావన్

ఉత్తమ గీత రచయిత: ఇర్షాద్ కమిల్

టెలివిజన్ సిరీస్ ఆఫ్ ది ఇయర్: అనుపమ

విమర్శకుల ప్రశంసలందుకున్న నటి: జల్సా చిత్రానికి – విద్యాబాలన్

సంవత్సరపు అత్యంత బహుముఖ ప్రజ్ఞ కనబరచిన నటుడు: ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రానికి అనుపమ్ ఖేర్

టెలివిజన్ సిరీస్‌లో అత్యంత బహుముఖ ప్రజ్ఞ కనబరచిన నటి: రూపాలీ గంగూలీ

ఉత్తమ సహాయ నటి: డాక్టర్ జి చిత్రానికి షీబా చద్దా

వెబ్ సిరీస్‌లలో ఉత్తమ నటుడు: రాకెట్ బాయ్స్ లో జిమ్ సర్భ్

వెబ్ సిరీస్‌లలో ఉత్తమ నటి: ఢిల్లీ క్రైమ్ సీజన్ 2 లో షెఫాలీ షా

టెలివిజన్ సిరీస్‌లలో ఉత్తమ నటుడు: ఫనా- ఇష్క్ మే మార్జవాన్ – జైన్ ఇమామ్

టెలివిజన్ సిరీస్‌లలో ఉత్తమ నటి: నాగిన్ 6 –  తేజస్వి ప్రకాష్

టెలివిజన్ సిరీస్‌లలో అత్యంత బహుముఖ  ప్రజ్ఞ కనబరచిన నటుడు: హర్షద్ చోప్డా

ఉత్తమ గాయకుడు: సచేత్ టాండన్ – మయ్య మైను

ఉత్తమ మహిళా గాయని: నీతి మోహన్ – మేరీ జాన్ 

ఉత్తమ సినిమాటోగ్రాఫర్: విక్రమ్ వేద చిత్రానికి పిఎస్ వినోద్

ప్రతికూల పాత్రలో ఉత్తమ నటుడు: దుల్కర్ సల్మాన్: చుప్ – ది రివెంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్

ప్రతికూల పాత్రలో ఉత్తమ నటి: బ్రహ్మాస్త్ర మొదటి భాగం – శివ చిత్రంలో మౌని రాయ్: 

ఉత్తమ నిర్మాత: భూషణ్ కుమార్

సంగీత పరిశ్రమలో అత్యుత్తమ సేవలందించినందుకుగాను ‘హరిహరన్’ కు 

దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్ 2023 అందజేశారు.

చలనచిత్ర పరిశ్రమలో అత్యుత్తమ సహకారం అందించినందుకు సీనియర్ నటి రేఖకు దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్ 2023 అందజేశారు.