తెలుగు బిగ్ బాస్ 7లో  వీళ్ళే..!

తెలుగు బిగ్ బాస్ 7 వీక్షకులారా, షో గురించిన కొత్త అప్‌డేట్ ఇదిగోండి. ఇంతకీ విషయం ఏమిటంటే బిగ్ బాస్ 7 ప్రారంభం కాబోతోంది. ఇటీవలే కొత్త ప్రోమో కూడా వచ్చేసింది. డాషింగ్ గా నాగార్జున కొత్తగా ఎదో ట్రై చేస్తానని ఏఎన్ఆర్ పాట పడేసాడు. ఇప్పుడు కొంతమంది బిగ్ బాస్ 7 లో పార్టిసిపేట్ అయ్యే పేర్లు వినిపిస్తున్నాయి. కుడి ఎడమైనా పర్లేదు:  ఈమధ్య వచ్చిన బిగ్ బాస్ 7 లో నాగార్జున చేసిన ప్రోమో […]

Share:

తెలుగు బిగ్ బాస్ 7 వీక్షకులారా, షో గురించిన కొత్త అప్‌డేట్ ఇదిగోండి. ఇంతకీ విషయం ఏమిటంటే బిగ్ బాస్ 7 ప్రారంభం కాబోతోంది. ఇటీవలే కొత్త ప్రోమో కూడా వచ్చేసింది. డాషింగ్ గా నాగార్జున కొత్తగా ఎదో ట్రై చేస్తానని ఏఎన్ఆర్ పాట పడేసాడు. ఇప్పుడు కొంతమంది బిగ్ బాస్ 7 లో పార్టిసిపేట్ అయ్యే పేర్లు వినిపిస్తున్నాయి.

కుడి ఎడమైనా పర్లేదు: 

ఈమధ్య వచ్చిన బిగ్ బాస్ 7 లో నాగార్జున చేసిన ప్రోమో చూసారా? కొత్తగా ఏమి చెప్పాలి? ఈసారి సరికొత్తగా ఉండబోతోంది అని పాప్కార్న్ తింటూ వచ్చి, ఇలా ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా, ఈసారి కొత్తగా చెప్తాను అని “కుడి ఎడమైనతే పొరపాటులేదోయ్..” అన్నాడు కింగ్. మరి ఏది తారుమారు కాబోతోందో తెలియాల్సి ఉంది. లేదా కుడి ఎడమైనా పర్లేదు మనం ఓడిపోము అని ఏఎన్ఆర్ చేసిన దేవదాసు సినిమాలో పాట పాడుతూ స్టైల్గా “మీరు ఓడిపోయినా పర్లేదు పాల్గొటం ముఖ్యం” అని పాల్గొనే వారిని ఆహానిస్తున్నాడా ఈ మన్మధుడు అని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. 

పాల్గొబోయేది ఎవరు? 

బిగ్ బాస్ అనౌన్స్మెంట్ రాగానే కంటెస్టెంట్స్ ఎవరు అని  వెతికేస్తున్నారు కదూ! ప్రతిసారి సీజన్లో లో ప్రతి ఎపిసోడ్ చూసినా చూడక పోయినా కాంటెంటెంట్స్ ఎవరో తెలుసుకోవాలని అనుకుంటాం. మా టివి వారు లిస్ట్ రిలీజ్ చేసే ముందే ఎన్నో పేర్లు బయటకి వచ్చేస్తూ ఉంటాయి.. ఆతరువాత కొంత మంది సెలెబ్రిటీస్ మేము పాల్గోవట్లేదు అని ఓఫిషల్ స్టేట్మెంట్లు కూడా ఇస్తూ ఉంటారు. ఈ సీజన్‌లో రియాల్టీ షోలో ప్రవేశించే ప్రముఖుల పేర్లను తెలుసుకోవాలని మీరందరూ చాలా ఆసక్తిగా ఉన్నారని మాకు తెలుసు. 

యూట్యూబ్లో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న వాళ్లకి అనిల్ గీలా అనే పేరు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మై విలేజ్ షో తో ఆహ్లాదాన్ని పంచిన అనిల్, బిగ్ బాస్ 7 లో ఒకరిగా ఉన్నట్లు తెలుస్తోంది. శోభా శెట్టి టెలివిజన్ ఆడియన్స్ కి ఈమె పరిచయం అవసరం లేదు, కార్తీకదీపం లో మౌనిత పేరుతో విలన్ గా చాలా బాగా ఎంటర్టైన్ చేసింది ఇప్పుడు బిగ్ బాస్ లో కూడా ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తుంది. జబర్దస్త్ లో ఫేమస్ అయ్యి రంగస్థలం సినిమాలో ఒక ముఖ్య పాత్రలో పోషించిన మహేష్, తన నవ్వులతో అలరించడానికి మన ముందు బిగ్ బాస్ ద్వారా వస్తున్నాడు. సుమారు 110 సినిమాల్లో నటించి తమిళ్, మలయాళం, తెలుగు, కన్నడ, హిందీ సినిమాల్లో కూడా నటించిన షకీలా పేరు అందరికీ తెలుసు. ఏమి కూడా బిగ్ బాస్ సీజన్ 7 లో రాబోతున్నట్లు సమాచారం. టెలివిజన్ యాక్ట్రెస్ ఐశ్వర్య కూడా బిగ్ బాస్ లో రావడానికి ఛాన్స్ ఉంది. యూట్యూబర్ గా ఉంటున్న శీతల్ గౌతమ్ కూడా తన గ్లామర్ తో అలరించడానికి వస్తున్నట్లు సమాచారం. జబర్దస్త్ లో చిన్న కంటెస్టెంట్ గా పాటిస్పేట్ చేసిన తేజ, ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్లో ఫుడ్ వ్లోగ్ చేసి ఫేమస్ అయిన విషయం తెలిసిందే. ఆయన కూడా ఇప్పుడు బిగ్ బాస్ 7 లో రానున్నట్లు సమాచారం. ఎంతోమంది హృదయాలను దోచుకున్న బుల్లెట్ బండి సాంగ్ ఫేమస్ మోహన భోగరాజు, ఆట షో ద్వారా ఫేమస్ అయిన సందీప్ ఇలా పలువురు రానున్నట్లు సమాచారం.

ఎప్పుడు టెలికాస్ట్ అవుతుంది: 

గత సీజన్లలో కనిపించినట్లే, బిగ్ బాస్ తెలుగు 7 కూడా ప్రముఖ తెలుగు టెలివిజన్ ఛానెల్, స్టార్ మాలో ప్రసారం కానుంది. మొదటి చిన్న ప్రోమో సోషల్ మీడియాలో విడుదల చేయడం జరిగింది. ఈ ఆసక్తికరమైన రియాలిటీ షో తిరిగి వస్తున్నట్లు ప్రకటించింది, డబుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని మాట ఇస్తున్నారు. వర్గాల సమాచారం ప్రకారం, బిగ్ బాస్ సీజన్ 7 సెప్టెంబర్‌లో స్టార్ మా లో ప్రసారం కానుంది. అయితే దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. ప్రతిరోజు ఒక ఆసక్తికరమైన అంశం గురించి కంటెస్టెంట్ల మధ్య జరిగే చర్చల గురించి ప్రేక్షకులు అయితే ఎదురుచూస్తున్నారని చెప్పుకోవాలి. మునపటి సీజన్లో, రేవంత్ విన్నర్ గా నిలిచినప్పటికీ, రన్నరప్గా నిలిచిన శ్రీహాన్ ఎక్కువ మొత్తంలో ప్రైజ్ మనీ గెల్చుకున్నాడు. చివరి క్షణంలో ఓటింగ్ లో శ్రీహన్ ముందంజలో ఉన్నప్పటికీ, ప్రైజ్ మనీ చేజారిపోతుందనే క్రమంలో తాను రన్నరప్గా నిలిచి రేవంత్ ని విన్నర్ చేశాడు.