విజ‌య్‌పై కేసు న‌మోదు

ఈనెల 22వ తేదీన తలపతి విజయ్ పుట్టినరోజు సందర్భంగా లియోలో రెడీ అనే సాంగ్ విడుదల చేశారు. ఈ సాంగ్ లో ఎక్కువగా డ్రగ్స్ సీన్లు ఉన్నాయని విజయ్ పై కంప్లైంట్ నమోదయింది. 2023లో భారీ అంచనాలతో విడుదల అవుతున్న చిత్రాల్లో లియో చిత్రం ఒకటి. లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా అక్టోబర్ లో విడుదల అవుతుంది.  లియో సినిమాపై కంప్లైంట్: విజయ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన నా రెడీ పాట […]

Share:

ఈనెల 22వ తేదీన తలపతి విజయ్ పుట్టినరోజు సందర్భంగా లియోలో రెడీ అనే సాంగ్ విడుదల చేశారు. ఈ సాంగ్ లో ఎక్కువగా డ్రగ్స్ సీన్లు ఉన్నాయని విజయ్ పై కంప్లైంట్ నమోదయింది. 2023లో భారీ అంచనాలతో విడుదల అవుతున్న చిత్రాల్లో లియో చిత్రం ఒకటి. లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా అక్టోబర్ లో విడుదల అవుతుంది. 

లియో సినిమాపై కంప్లైంట్:

విజయ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన నా రెడీ పాట బాగా హిట్ అయింది. ఇప్పుడు ఈ పాట వల్ల సినిమాకు ఇబ్బంది వచ్చింది. ఈ పాటలో బాగా డ్రగ్స్ వాడారని ఆర్టిఐ సెల్వం అనే వ్యక్తి కంప్లైంట్ రైజ్ చేశాడు.

విజయ్ 49వ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఈ పాట వల్ల నిర్మాతలకు ఇబ్బంది వచ్చి పడింది. ఈనెల 25న ఈ సినిమాపై ఆన్లైన్లో కంప్లైంట్ చేశాడు. తర్వాత రోజు అంటే జూన్ 26న సినిమా మీద యాక్షన్ తీసుకోవాలని కోర్టుని కోరారు. డ్రగ్స్ వాడకూడదని ఇప్పటికే చెన్నై పోలీసులు ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నారు. కార్తి, విజయ్ ఆంటోనీ లాంటి యాక్టర్లు ఈ ఈవెంట్ కి సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా లియో సినిమా విషయానికి వస్తే ఈ సినిమా అక్టోబర్ 19న రిలీజ్ అవుతుంది అని అంటున్నారు. 

లియో సినిమా హీరోయిన్ల సినీ కెరీర్ పై స్మాల్ ఫోకస్:

ఈ సినిమాలో హీరోయిన్లుగా త్రిష, ప్రియ ఆనంద్ నటిస్తున్నారు. ప్రియ ఆనంద్ ముందుగా తెలుగులో లీడర్ సినిమా తో తన సినీ జీవితం ప్రారంభించింది. తర్వాత శర్వానంద్ తో కలిసి కో అంటే కోటి అనే సినిమాలో నటించింది. తెలుగులో కలిసిరాక ప్రియా ఆనంద్ తమిళ్ లో సినిమాలు చేయడం మొదలుపెట్టింది. తమిళ్ లో ఆమెకు మంచి క్రేజ్ ఉంది. 

ఇక త్రిష విషయానికొస్తే మనకు తెలిసిందే, తను వర్షం సినిమాతో టాలీవుడ్ కుర్ర కారు మనసు దోచుకుంది. తర్వాత అతడు సినిమాతో మహేష్ బాబు తో కూడా నటించింది. త్రిష టాలీవుడ్ లో తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ అయింది. నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలో త్రిష యాక్టింగ్ కి మంచి క్రేజ్ వచ్చింది. త్రిష నాగార్జునతో కింగ్. రవితేజతో కృష్ణ లాంటి సినిమాలో నటించింది. చిరంజీవితో స్టాలిన్ లో కూడా నటించింది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా తెలుగు సినిమాలు నటించట్లేదు. 

అయినా ఇప్పటికీ తెలుగులో త్రిష కు మంచి క్రేజ్ ఉంది. తను సినిమా చేస్తానంటే నిర్మాతలు రెడీగా ఉన్నారు. తన సినీ కెరీర్లో చిన్నచిన్న వివాదాలు ఉన్నప్పటికీ త్రిష తన కెరీర్ లో ఇప్పుడు మంచి పొజిషన్లో ఉంది. ఈ సినిమా డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ విషయానికి వస్తే తన మొదటి సినిమా సందీప్ కిషన్ తో చేసిన నగరం. తను తర్వాత ఖైదీ సినిమాతో మంచి ఫేమ్ సంపాదించాడు. లోకనాయకుడు కమల్ హాసన్ గారితో తను చేసిన విక్రమ్ బ్లాక్ బస్టర్. లోకివర్స్ అనే అనే సినిమాటిక్ యూనివర్స్ ని లోకేష్ కనగరాజ్ క్రియేట్ చేశాడు. 

తను ఇంతకుముందు తలపతి విజయ్ తో మాస్టర్ అనే సినిమా తీశాడు. అది బ్లాక్ బస్టర్. ఏదేమైనా లియో సినిమా వివాదాల నుండి త్వరగా బయటపడి సూపర్ హిట్ అవ్వాలని కోరుకుందాం.