సన్నీ డియోల్‌ను గెలిపించి తప్పుచేశాం

భారత్-పాకిస్థాన్ మధ్య విద్వేషానికి ‘పొలిటికల్ గేమ్’ కారణమని బాలీవుడ్ స్టార్ నటుడు, ఎంపీ సన్నీ డియోల్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ గ్రామస్థులు సన్నీపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఆయనిని ఎన్నుకొని తప్పు చేసాం అని అక్కడ ప్రజలు అంత డియోల్   పైన కోపంగా ఉన్నారు అంట.  భారత్-పాకిస్థాన్ మధ్య విద్వేషానికి ‘పొలిటికల్ గేమ్’ కారణమని బాలీవుడ్ స్టార్ నటుడు, ఎంపీ సన్నీ డియోల్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు […]

Share:

భారత్-పాకిస్థాన్ మధ్య విద్వేషానికి ‘పొలిటికల్ గేమ్’ కారణమని బాలీవుడ్ స్టార్ నటుడు, ఎంపీ సన్నీ డియోల్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ గ్రామస్థులు సన్నీపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఆయనిని ఎన్నుకొని తప్పు చేసాం అని అక్కడ ప్రజలు అంత డియోల్   పైన కోపంగా ఉన్నారు అంట. 

భారత్-పాకిస్థాన్ మధ్య విద్వేషానికి ‘పొలిటికల్ గేమ్’ కారణమని బాలీవుడ్ స్టార్ నటుడు, ఎంపీ సన్నీ డియోల్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ గ్రామస్థులు సన్నీపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఆయనిని ఎన్నుకొని తప్పు చేసాం అని అక్కడ ప్రజలు అంత డియోల్   పైన కోపంగా ఉన్నారు అంట. 

గదర్-2 సినిమా ట్రైలర్ లాంచ్ సందర్భంగా సన్నీ డియోల్ మాట్లాడుతూ..

 పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌కు చెందిన నటుడు, బీజేపీ ఎంపీ బుధవారం గదర్ -2 ట్రైలర్ లాంచ్ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశం, పాకిస్థాన్ దేశాల ప్రజలు ఒకరినొకరు ప్రేమిస్తున్నారని, వారు శాంతిని కోరుకుంటున్నారని అన్నారు. అయితే, ఇరుదేశాల ప్రజల నుంచి సమానమైన ప్రేమ ఉన్నప్పటికీ.. రాజకీయ క్రీడలో భాగంగా ఇరు దేశాల మధ్య ద్వేషానికి కారణమంటూ సన్నీ డియోల్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సన్నీ డియోల్ వ్యాఖ్యలపట్ల పలువురు సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తున్నారు 

గురుదాస్‌పూర్ ప్రజలు మాట్లాడుతూ.. 

ఆయన వ్యాఖ్యలపై గురుదాస్‌పూర్ ప్రజలు మాట్లాడుతూ.. భారత్-పాక్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల గురించి మాట్లాడుతున్న సన్నీడియోల్ లోక్‌సభలో ఏనాడూ గురుదాస్‌పూర్ సమస్యలపై మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ నాడు మా సమస్యలు గురించి  లోక్‌సభలో లో మాట్లాడని సన్నీ ఇప్పుడు ఎందుకు మాట్లాడ్తున్నారు అని అక్కడ ప్రజలు కోపం తో ఊగిపోతున్నారు 

ఆయన గెలిచాక నియోజకవర్గంలో అభివృద్ధి అన్నది మచ్చుకైనా లేదని, గెలిపించి తప్పు చేశామని చింతిస్తున్నారు. ఇక్కడి ప్రజలు ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని, కానీ ఒక్కసారి కూడా ఆయన రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రకటనలు ఇవ్వడానికి ముందు ఆయన తన నియోజకవర్గ ప్రజలకు చేసిందేంటో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. 

నెటిజన్లు సన్నీ డియోల్ వ్యాఖ్యలపట్ల ఎం అంటున్నారు అంటే

సన్నీ డియోల్ వ్యాఖ్యలపట్ల నెటిజన్లు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. ఓ నెటిజన్.. పాకిస్థాన్‌లోని ప్రజలు గదర్ -2ని చూస్తారు కాబట్టి అతను ఈ వ్యాఖ్యలు చేసారు అని పేర్కొన్నాడు. మరికొందరు సన్నీ ప్రకటన కారణంగా సినిమాను బహిష్కరించాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. ఇదిలాఉంటే.. అనిల్ శర్మ దర్శకత్వం వహించిన గదర్ -2లో సన్నీ డియోల్, అమీషా పటేల్ తారా సింగ్, సకీనా ముఖ్య  పాత్రలు పోషించారు.

ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల అయ్యేందుకు సిద్ధమైంది. గదర్ -2ని అనిల్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించారు. గదర్-2 సినిమా గదర్ ఏక్ ప్రేమ్ కథ చిత్రానికి సీక్వెల్‌గా వస్తుంది.  ఇదిలా ఉంటే.. ఈ చిత్రం ట్రైలర్‌లో తారా సింగ్, సకీనాలకు కొడుకు జీతే  ఒక పాకిస్థానీ ఆర్మీ జనరల్ చేత హింసించబడటం ట్రైలర్‌లో కనిపిస్తుంది. తారా సింగ్‌ వేదనతో ఉన్న సకీనాకు జీతేని తిరిగి తీసుకొస్తానని హామీ ఇస్తాడు. ఈ క్రమంలో అతను లాహోర్‌ని సందర్శించి, పాకిస్థానీ సైనికులను చితక్కొడతాడు. ఆ తరువాత పోరాట సన్నివేశాలు ఉంటాయి. చివరికి.. తారా సింగ్ చేతి పంపును చూస్తూ ఉండటంతో ట్రైలర్ ముగుస్తుంది.

2019 లోక్‌సభ ఎన్నికల్లో గురుదాస్‌పూర్ నుంచి పోటీచేసిన సన్నీడియోల్ విజయం సాధించారు. అంతకుముందు 2017 వరకు బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఆయన మృతి తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి సన్నీ డియోల్  గెలుపొందారు. ఆ తర్వాత బీజేపీలో చేరిన ఆయన 2019 ఎన్నికల వరకు గురుదాస్‌పూర్ ఎంపీగా కొనసాగారు. ఎంపీ గా ప్రజల బాధల గురించి వాలకి మంచి జరిగే పనులు కానీ లేదా ఆ ఊరు వెళ్లి కష్టాలు తెలుసుకోడం కానీ ఎం చేయలేదు సన్నీ.