ధోనితో కమెడియ‌న్ యోగి బాబు చిట్‌చాట్

క్రికెట్ లో దిగ్గజ స్థాయిలో నిలిచి మన భారత దేశానికీ అందని ద్రాక్షా లాగ ఉన్న ప్రపంచ కప్ ని తన నాయకత్వ లక్షణాలతో ఒక్కసారి కాదు, ఏకంగా మూడు సార్లు తెచ్చిపెట్టిన ఘనుడు మహేంద్ర సింగ్ ధోని. ఒకప్పుడు చాలా మంది క్రికెట్ ని కేవలం సచిన్ టెండూల్కర్ కోసం మాత్రమే చూసేవారు. సచిన్ టెండూల్కర్ రిటైర్ అయిపోయిన తర్వాత ఆయన క్రికెట్ చూడడమే మానేసిన వాళ్ళు కోట్లలో ఉంటారు. అలాంటి వాళ్లందరినీ మల్లి క్రికెట్ […]

Share:

క్రికెట్ లో దిగ్గజ స్థాయిలో నిలిచి మన భారత దేశానికీ అందని ద్రాక్షా లాగ ఉన్న ప్రపంచ కప్ ని తన నాయకత్వ లక్షణాలతో ఒక్కసారి కాదు, ఏకంగా మూడు సార్లు తెచ్చిపెట్టిన ఘనుడు మహేంద్ర సింగ్ ధోని. ఒకప్పుడు చాలా మంది క్రికెట్ ని కేవలం సచిన్ టెండూల్కర్ కోసం మాత్రమే చూసేవారు. సచిన్ టెండూల్కర్ రిటైర్ అయిపోయిన తర్వాత ఆయన క్రికెట్ చూడడమే మానేసిన వాళ్ళు కోట్లలో ఉంటారు. అలాంటి వాళ్లందరినీ మల్లి క్రికెట్ చూసేలా చేసిన వ్యక్తి మహేంద్ర సింగ్ ధోని. కేవలం ఇతని బ్యాటింగ్ కోసం, కెప్టెన్సీ స్కిల్స్ కోసం మ్యాచులను పనులు మానుకొని మరీ చూసే ఆడియన్స్ సంఖ్య కోట్లలో ఉంటుంది. క్రికెట్ లో ఇంతటి మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించిన ఆటగాడు ఎవ్వరూ లేరు అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ధోని పేరు ఎత్తితేనే వాతావరణం మొత్తం వైబ్రేషన్స్ తో ఊగిపోతాది.

క్రేజ్ లో ధోని ని మించిన వాడు లేడు:

అందుకే క్రేజ్ లో ధోని ని మించిన వాడు లేదని, సచిన్ తర్వాత మళ్ళీ అలాంటి ఆటగాడిని చూస్తామో చూడమో అనుకున్నామని, కానీ ధోని ఆ స్థాయికి చేరుకున్నాడు అంటూ దిగ్గజ క్రికెటర్స్ సైతం ఒప్పుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇక ఎప్పుడైతే ధోని ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఒన్డే , టెస్ట్ మరియు టీ 20 ఫార్మట్స్ కి రిటైర్మెంట్ ప్రకటించాడో, అప్పటి నుండి అభిమానుల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొంది. కానీ ఇంకా ఆయన ఐపీఎల్ టౌర్నమెంట్స్ కి రిటైర్మెంట్ ప్రకటించలేదు. ఈ ఏడాది కూడా చెన్నై సూపర్ కింగ్స్ టీం కి సారధ్యం వహించి, 5 వ సారి కప్ ని తన టీం కి వచ్చేలా చేసాడాయన. ముంబై ఇండియన్స్ టీం తర్వాత 5 సార్లు కప్ కొట్టిన ఏకైక ఐపీఎల్ టీం గా చెన్నై సూపర్ కింగ్స్ టీం ని నిలిపాడు. మిగిలిన టీమ్స్ తో పోలిస్తే స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్న టీం కాకపోయినప్పటికీ, ధోని తన న్యాయకత్వ లక్షణాలతో టీం ని మలిచిన తీరు అద్భుతం. ఇలాంటి స్కిల్స్ ప్రస్తుతం ఇండియన్ టీం లో ఎవరికీ లేదు. ధోని ఇంకొన్ని ఏళ్ళు ఇండియన్ టీం లో కొనసాగి ఉంటే బాగుండేది అని ఇప్పటికీ అనిపిస్తూనే ఉంటుంది.

‘చెన్నై సూపర్ కింగ్స్’ టీం లో మీతో కలిసి ఆడే ఛాన్స్ ఇవ్వమని ధోని ని బ్రతిమిలాడిన తమిళ స్టార్ కమెడియన్ యోగిబాబు :

ఇకపోతే ధోని రీసెంట్ గానే సినీ రంగం లోకి కూడా అడుగుపెట్టిన సంగతి మన అందరికీ తెలిసిందే. ధోని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ని స్థాపించి, సినిమాలను నిర్మించబోతున్నాడు. ముందుగా మొదటి సినిమాగా తమిళం లో హరీష్ కళ్యాణ్ మరియు ఇవానా హీరో హీరోయిన్లుగా పెట్టి ‘లెట్స్ గెట్ మ్యారీడ్’ అనే చిత్రాన్ని నిర్మించాడు. అతి త్వరలోనే విడుదల కాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ మరియు మొదటి పాట ని ఈనెల 10 వ తారీఖున తన చేతుల మీదుగా విడుదల చేసాడు ధోని. ఈ కార్యక్రమం లో ఆయన సతీమణి సాక్షి కూడా పాల్గొనింది. ఇక ఈ చిత్రం లో కమెడియన్ గా నటించిన యోగి బాబు కూడా ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్నాడు. ఈ ఈవెంట్ లో ఆయన ధోని ని ‘చెన్నై సూపర్ కింగ్స్’ జట్టులో ఆడే అవకాశం ఇవ్వమని కోరగా, ధోని దానికి ఇచ్చిన ఫన్నీ సమాధానం ఈవెంట్ లో నవ్వులు పూయించేలా చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ టీం తో తమిళనాడు లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న ధోని, మొదటి సినిమా తమిళ్ లోనే తియ్యాలని అనుకున్నాడు. తదుపరి చిత్రం అక్కడి స్టార్ హీరో విజయ్ తో చేసే అవకాశం ఉంది, గతం లో వీళ్లిద్దరు సమావేశమై దీని గురించి చర్చించారు కూడా.