‘గుంటూరు కారం’ నుండి సినిమాటోగ్రాఫర్ అవుట్..!

టాలీవుడ్ లోనే మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఒకటిగా తెరకెక్కుతున్న చిత్రం ‘గుంటూరు కారం’. సూపర్ స్టార్  మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడవ చిత్రం ఇది. గతం లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాలు థియేటర్స్ లో పెద్దగా ఆడకపోయినా, టీవీ టెలికాస్ట్ లో మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుది కాదు. అందుకే ‘గుంటూరు కారం’ చిత్రం షూటింగ్ ప్రారంభ […]

Share:

టాలీవుడ్ లోనే మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఒకటిగా తెరకెక్కుతున్న చిత్రం ‘గుంటూరు కారం’. సూపర్ స్టార్  మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడవ చిత్రం ఇది. గతం లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాలు థియేటర్స్ లో పెద్దగా ఆడకపోయినా, టీవీ టెలికాస్ట్ లో మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుది కాదు. అందుకే ‘గుంటూరు కారం’ చిత్రం షూటింగ్ ప్రారంభ దశలో ఉన్నప్పుడే ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కనీవినీ ఎరుగని రేంజ్ లో జరిగింది. ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంహాలకు కలిపి ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ 160 కోట్ల రూపాయలకు జరిగినట్టు సమాచారం. ఇది ప్రాంతీయ బాషా చిత్రాల్లో ఆల్ టైం రికార్డు అని చెప్పడం లో ఎలాంటి అతిసయోక్తి లేదు. అయితే షూటింగ్ ప్రారంభమైనప్పటి నుండి ఈ సినిమాలో ఎదో పెద్ద పొరపాటు జరుగుతుంది.

త్రివిక్రమ్ తో ఏర్పడిన క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల సినిమాటోగ్రాఫర్ పీఎస్ వినోద్ అవుట్: 

ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్న వార్త ఏమిటంటే ఈ సినిమా కి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న పీ ఎస్ వినోద్ ఇప్పుడు ఈ చిత్రం నుండి తప్పుకున్నాడట. గతం లో త్రివిక్రమ్ తో కలిసి ఆయన ‘అరవింద సమేత’ మరియు ‘అలా వైకుంఠపురం లో’ వంటి సూపర్ హిట్ సినిమాలు చేసాడు. ఆ రెండు సినిమాల తర్వాత వీళ్లిద్దరి నుండి రాబోతున్న మూడవ చిత్రమిది. త్రివిక్రమ్ తో ఈమధ్య వినోద్ కి టెక్నీకల్ డిఫరెన్స్ ఏర్పడుతూ వస్తున్నాయని, అందుకే ఈ చిత్రం నుండి ఆయన తప్పుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి మెయిన్ హీరోయిన్ గా నటించాల్సిన పూజ హెగ్డే తప్పుకుంది. ముందు గా ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా పూజ హగ్దే ని, సెకండ్ హీరోయిన్ గా శ్రీలీల ని తీసుకున్నారు. ఇప్పుడు పూజ హెగ్డే తప్పుకోవడం తో శ్రీలీల ని మెయిన్ హీరోయిన్ చేసి, సన్నివేశాలు మొత్తం రీ షూట్ చేస్తున్నారు.

షూటింగ్ ప్రారంభం నుండి అన్నీ అవాంతరాలే:

అంతే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అందిస్తున్న ట్యూన్స్ కూడా త్రివిక్రమ్ కి, మరియు మహేష్ బాబు కి ఏమాత్రం నచ్చడం లేదట.దీనితో ఆయనని కూడా ఈ చిత్రం నుండి తప్పించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. నిన్న పీ ఎస్ వినోద్ ఈ సినిమా నుండి తప్పుకున్నాడు అనే వార్త అలా వచ్చింది, ఇలా మహేష్ బాబు తన కుటుంబాన్ని తీసుకొని ఫ్యామిలీ టూర్ కి వెళ్ళిపోయాడు. ప్రతీ వారం సినిమా నుండి ఒకరు ఎలిమినేట్ అయ్యిపోతున్నారు. అసలు ఇది సినిమానా? , లేక బిగ్ బాస్ రియాలిటీ షోనా అని అభిమానులు సెటైర్లు వేస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తారీఖున విడుదల చేయబోతున్నట్టు ఇది వరకే అధికారిక ప్రకటన చేసారు. కానీ ఇలా షూటింగ్స్  వాయిదాలు వేసుకుంటూ పోతే సంక్రాంతికి కాదు కదా, కనీసం సమ్మర్ కి కూడా వచ్చే ఛాన్స్ లేదని అంటున్నారు విశ్లేషకులు. 20 శాతం షూటింగ్ కూడా పూర్తి కానీ ఈ సినిమాలో ఇన్ని మార్పులు వస్తే, ఇక షూటింగ్ పూర్తి అయ్యే సమయానికి ఇంకెన్ని మార్పులు వస్తాయో అని అభిమానులు కంగారు పడుతున్నారు. అసలు ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేసుకుంటుందా లేదా మధ్యలోనే ఆగిపోతుందా అనే అనుమానం కూడా ఉంది. ఇక పోతే పూజ హెగ్డే ఈ చిత్రం నుండి తప్పుకున్న తర్వాత, మీనాక్షి చౌదరి కోసం మూవీ టీం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే సంగీత దర్శకుడిగా థమన్ బదులు అనిరుద్ ని తీసుకోబోతున్నట్టు సమాచారం.