Dasara: దసరాకి వచ్చేస్తున్నా పసందైన సినిమాలు

ప్రేక్షకులను అలరించడానికి దసరాకు (dasara) చాలా సినిమా (Cinema)లు వచ్చేస్తున్నాయి. లియో, టైగర్ నాగేశ్వరరావు, భగవత్ కేసరి, ఘోస్ట్ ఇలా మరెన్నో చిత్రాలు దసరాకు అభిమానుల ముందుకు వచ్చేస్తున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సినిమా (Cinema) విశేషాలు మీకోసం.  లియో (Leo):  తలపతి విజయ్(thalapathy vijay) లియో సినిమా (Cinema) అక్టోబర్ లో అందరి ముందుకు రాబోతోంది. సినిమా (Cinema) గురించిన ట్రైలర్ ఇప్పటికే విడుదల అవ్వడంతో ప్రేక్షకుల ఆదరాభిమానులను దక్కించుకుంది. అంతేకాకుండా తప్పకుండా సూపర్ […]

Share:

ప్రేక్షకులను అలరించడానికి దసరాకు (dasara) చాలా సినిమా (Cinema)లు వచ్చేస్తున్నాయి. లియో, టైగర్ నాగేశ్వరరావు, భగవత్ కేసరి, ఘోస్ట్ ఇలా మరెన్నో చిత్రాలు దసరాకు అభిమానుల ముందుకు వచ్చేస్తున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సినిమా (Cinema) విశేషాలు మీకోసం. 

లియో (Leo): 

తలపతి విజయ్(thalapathy vijay) లియో సినిమా (Cinema) అక్టోబర్ లో అందరి ముందుకు రాబోతోంది. సినిమా (Cinema) గురించిన ట్రైలర్ ఇప్పటికే విడుదల అవ్వడంతో ప్రేక్షకుల ఆదరాభిమానులను దక్కించుకుంది. అంతేకాకుండా తప్పకుండా సూపర్ డూపర్ హిట్ అవుతుందని ప్రతి ఒక్కరు అభిప్రాయపడుతున్నారు. ప్రముఖ నటుడు తలపతి విజయ్(thalapathy vijay), లియోలో కుటుంబ వ్యక్తి పార్థిబన్‌గా, అంతే కాకుండా భయంకరమైన గ్యాంగ్‌స్టర్ లియో దాస్‌గా రెండు పాత్రలలో లియో(leo) సినిమా (Cinema) ట్రైలర్ లో కనిపిస్తున్నాడు. అయితే ఇవి రెండు భిన్నమైన పాత్రలా లేక ఒకే పాత్రలో రెండు దశలా అనే విషయాన్ని లియో(leo) ట్రైలర్‌లో వెల్లడించలేదు. పార్థిబన్‌ను కుడిచేతి వాటంగా చూపించగా, లియో దాస్ ఎడమచేతి వాటం అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కానీ, ఈ విషయాల మీద ఇప్పటివరకు ఎటువంటి సమాచారం లేదు. లియో(leo) చిత్రంలో త్రిష, (trisha) ప్రియా ఆనంద్, యాక్షన్ కింగ్ అర్జున్, సంజయ్ దత్, డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కూడా నటిస్తున్నారు.  

టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageswara Rao): 

ఈ సినిమా (Cinema) థియేట్రికల్ ట్రైలర్‌ను ఇటీవల ముంబైలో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో రవితేజ ఆవిష్కరించారు. మేకర్స్ ప్రత్యేకించి ఈ సినిమా (Cinema) ట్రైలర్ను భారతీయ సైన్ లాంగ్వేజ్ లో విడుదల చేశారు, అందులో ఒక యాంకర్ క్లిప్‌లోని కంటెంట్‌ను వివరిస్తూ కనిపిస్తారు. భారతదేశంలోనే సైన్ భాషలో విడుదలైన తొలి ట్రైలర్ ఇదే. మిగతా ట్రైలర్స్‌తో పాటు సైన్ లాంగ్వేజ్ ట్రైలర్‌కి కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఎక్కువ మంది ప్రేక్షకులు ఈ ప్రత్యేకమైన ట్రైలర్ చూసి ఆశ్చర్యపోతున్నారు. అక్టోబర్ 20న భారతీయ సైన్ భాషల్లో సినిమా (Cinema)ను విడుదల చేస్తున్నట్లు నిర్మాత ప్రకటించారు. టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswara Rao) ISL భాషలో విడుదలైన మొదటి భారతీయ చిత్రం. భారతీయ సినిమా (Cinema)లో ఇది నిజంగా ఒక ప్రత్యేకమైన ఆకర్షించుబడిన మార్పు అని చెప్పుకోవచ్చు. 

మరి ముఖ్యంగా ఈ సినిమా (Cinema)లో ప్రత్యేకించి రవితేజ తన సొంత గొంతుతో మాట్లాడిన డైలాగ్స్ అందరిని ఆకర్షిస్తాయని ఆయన ఆశిస్తున్నాడు. అంతేకాకుండా నిజంగా డైలాగ్స్ చెప్పేటప్పుడు హిందీలో మాట్లాడడం అంటే చాలా కష్టమని ఆయన భావించినట్లు, ప్రత్యేకించి ఈ సినిమా (Cinema) డబ్బింగ్ చిత్రం కాదని తన తనవైపు నుంచి చిత్రాన్ని థియేటర్స్ లో ప్రతి ఒక్కరు చాలా ఆదరించాలని కోరుకుంటున్నాడు రవితేజ. 

భగవంత్ కేసరి (Bhagavanth Kesari): 

ట్రైలర్‌లో చూస్తే, ఈ చిత్రం యాక్షన్-ప్యాక్డ్ రైడ్‌గా ఉండబోతోంది, ఎందుకంటే NBK ఈ సినిమా (Cinema)లో ప్రత్యేకమైన ఫైట్ సీన్స్ ఉండేలా చూసినట్లు తెలుస్తోంది. సినిమా (Cinema)లో విలన్ గా ఉన్న అర్జున్ రాంపాల్ నటుడిని ఎదిరిస్తూ కొన్ని వైలెన్స్ డైలాగ్స్ చెప్తున్నా బాలకృష్ణ సన్నివేశాలు ట్రైలర్ లో కనిపించాయి. కాజల్ అగర్వాల్ పాత్ర కేవలం స్టార్‌ని హైప్ చేయడానికి మాత్రమే ప్రోమో వీడియోలో కనిపించినట్లు అనిపిస్తుంది. భగవంత్ కేసరి(Bhagavanth Kesari)లో ప్రత్యేక ఆకర్షణ శ్రీలీల అని చెప్పుకోవచ్చు. 

అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ మరియు శ్రీలీల కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గతంలో హిందీ సినిమా (Cinema)ల్లో ప్రధానంగా కనిపించిన అర్జున్ రాంపాల్ టాలీవుడ్ అరంగేట్రం ఇది. రాహుల్ సంఘ్వీ పాత్రలో అర్జున్ నటించనున్నాడు. ఈ చిత్రానికి సంగీతం S థమన్ అందించారు. ఈ సినిమా (Cinema) అక్టోబర్ 19 న సినిమా (Cinema)ల్లో విడుదల అవుతుంది, రవితేజ సినిమా (Cinema) టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswara Rao)తో తలపడడానికి వచ్చేస్తుంది, టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswara Rao) అక్టోబర్ 20న విడుదల అవుతుంది. 

ఘోస్ట్ (Ghost): 

శివరాజ్‌కుమార్ తన రాబోయే చిత్రం ఘోస్ట్(Ghost) కోసం ప్రమోషన్స్ సందర్భంగా అభిమానులతో ముచ్చటించారు. యాక్షన్ హీస్ట్ థ్రిల్లర్‌ను అక్టోబర్ 19న విడుదల చేయడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నారు. శ్రీని దర్శకత్వం వహించిన ఈ చిత్రం కన్నడ, తెలుగు, తమిళం, హిందీ మరియు మలయాళంతో సహా పలు భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో జయరామ్, ప్రశాంత్ నారాయణన్, సత్య ప్రకాష్ మరియు అర్చన జోయిస్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.