45 ఏళ్ల సినీ ప్ర‌స్థానం.. అయినా త‌గ్గ‌ని చిరు

ఇండస్ట్రీకి వచ్చి 45 సంవత్సరాలు దాటినప్పటికీ చిరంజీవి సినీ హవ ఏ మాత్రం తగ్గలేదని చెప్పుకోవాలి. చిరంజీవి తన తదుపరి చిత్రం గురించి అనేక మంది డైరెక్టర్ల ద్వారా స్క్రిప్ట్ వింటున్నట్లు సమాచారం. తన తదుపరి చిత్రం గురించి తన కూతురు సుష్మిత ప్రొడక్షన్స్ లో సూపర్ డూపర్ హిట్ కొట్టాలనేది చిరు లక్ష్యం.  అభినందించిన చరణ్:  చిరంజీవి తన 45 సంవత్సరాల సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్నారు. అంతే కాకుండా తదుపరిచిత్రం గురించి మరిన్ని సన్నాహాలు […]

Share:

ఇండస్ట్రీకి వచ్చి 45 సంవత్సరాలు దాటినప్పటికీ చిరంజీవి సినీ హవ ఏ మాత్రం తగ్గలేదని చెప్పుకోవాలి. చిరంజీవి తన తదుపరి చిత్రం గురించి అనేక మంది డైరెక్టర్ల ద్వారా స్క్రిప్ట్ వింటున్నట్లు సమాచారం. తన తదుపరి చిత్రం గురించి తన కూతురు సుష్మిత ప్రొడక్షన్స్ లో సూపర్ డూపర్ హిట్ కొట్టాలనేది చిరు లక్ష్యం. 

అభినందించిన చరణ్: 

చిరంజీవి తన 45 సంవత్సరాల సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్నారు. అంతే కాకుండా తదుపరిచిత్రం గురించి మరిన్ని సన్నాహాలు చేస్తున్నారు చిరంజీవి. ఇటీవల గాడ్ ఫాదర్, బోలా శంకర్ వంటి సినీ చిత్రాలతో ప్రేక్షకులను అల్లరించిన చిరు, తన తదుపరి సూపర్ డూపర్ హిట్ సినిమా గురించి, అనిల్ రావిపూడి, వివి వినాయక్ వంటి డైరెక్టర్ల నుంచి స్క్రిప్ట్ వింటున్నట్లు సమాచారం. ఆయన సినీ ప్రస్థానం నిజానికి ప్రాణం ఖరీదు అనే చిత్రం ద్వారా ప్రారంభమైంది. 1978లో ప్రారంభమైన ఆయన సినీ రంగం తర్వాత ఇక వెనక్కి తిరగాల్సిన అవసరం రాలేదు చిరంజీవికి. 

అంతేకాకుండా తన కుమారుడు రామ్ చరణ్ కూడా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఇప్పుడు చిరు 45 సంవత్సరాల సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంలో రామ్ చరణ్ తన వైపు నుంచి సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలిపారు. 45 సంవత్సరాల మెగా జర్నీ గురించి గుర్తు చేశారు, ప్రాణం ఖరీదు అనే సినిమా నుంచి మొదలైన సినీ ప్రస్థానం ఇప్పటికీ కొనసాగుతూనే ఉందని, సినీ రంగంలో సత్తా చాటిన చిరు నిజ జీవితంలో కూడా ఎన్నో మంచి పనులు చేస్తూ అందరికీ సహాయకరంగా ఉంటూ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు అని, మాట్లాడారు చరణ్. అంతేకాకుండా ఆయన వంటి హార్డ్ వర్క్, డిసిప్లిన్, డెడికేషన్ వంటివి తమకి కూడా ఉండాలనేది తమ కోరిక అంటూ చిరంజీవి గురించి మరింత చెప్పుకొచ్చారు రామ్ చరణ్. 

చిరంజీవి 156వ చిత్రం: 

చిరంజీవి, తదుపరి సినిమాను సుష్మిత కొణిదెల నిర్మించనున్నారు. చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత కొణిదెల ఎప్పటినుంచో తన సొంత బ్యానర్ మీద చిరంజీవి తొలి చిత్రాన్ని నిర్మించే ప్లాన్లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే చిరంజీవి ప్రస్తుతం రాబోయే చిత్రం గురించి మాట్లాడుతూ సుష్మిత తప్పకుండా ఈ సినిమా తర్వాత ఒక పెద్ద నిర్మాతగా మారుతుందని, రాబోతున్న చిత్రం గురించి మరో హింట్ అందజేశారు.  అయితే ఈసారి రాబోతున్న చిత్రం ద్వారా చిరంజీవి మళ్ళీ ప్రేక్షకులను అలరిస్తూ, కామెడీ ఎంటర్టైన్మెంట్ కలగలిపి ఉండేలా ఫ్యాన్స్ కోసం ప్రత్యేకమైన సినిమా ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు. 

చిరంజీవి నటించిన బోలో శంకర్ సినిమా విశేషాలు: 

2015లో అజిత్ కుమార్ నటించిన తమిళ చిత్రం వేదాళం రీమేక్ ఇప్పుడు చిరంజీవి నటిస్తున్న భోలా శంకర్. ఈ చిత్రంలో తమన్నా చిరంజీవికి జతగా నటిస్తూ ఉండగా, మరోవైపు కీర్తి సురేష్ చిరంజీవి సోదరి పాత్రలో కనిపించనుంది. బోలా శంకర్ చిత్రంలో రఘుబాబు, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, శ్రీ ముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, మరియు ఉత్తేజ్ కూడా నటించారు.

భారీ అంచనాలతో భోళా శంకర్ ఆగస్టు 11న థియేటర్లలోకి రిలీజ్ అవ్వడమే కాకుండా గ్రాండ్ సక్సెస్ అందుకుంది. రిలీజైన బోలా శంకర్ సినిమా హిందీలో డబ్ కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ సినిమా తెలుగులో ఎంత సూపర్ సూపర్ హిట్ అయిందో హిందీలో కూడా అలాంటి హిట్ ఎక్స్పెక్ట్ చేస్తూ చిరంజీవి పాత్రకు డబ్బింగ్ చేశారు జాకీ ష్రాఫ్. 25 ఆగస్ట్ 2023న హిందీలో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది బోలా శంకర్.