చిరంజీవి వివి వినాయక్ కాంబినేషన్ లో మరో చిత్రం

బోలా శంకర్ సినిమా తర్వాత చిరంజీవి మరో భారీ బడ్జెట్ సినిమాతో మనందరం ఎందుకు రాబోతున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాకు గాను నిర్మాత చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కొణిదెల అంటూ వార్తలు వినబడుతున్నాయి. వివి వినాయక్ దర్శకత్వంలో రాబోతున్న చిరంజీవి చిత్రం రానున్నట్లు, ఇటీవల వీవీ వినాయక్ని కలిసిన చిరంజీవి క్లారిటీ ఇచ్చారు.  చిరంజీవి వివి వినాయక్ కాంబినేషన్ లో మరో చిత్రం:  చిరంజీవి, వివి వినాయక్ కాంబినేషన్ లో ఇంతకు ముందు వచ్చిన […]

Share:

బోలా శంకర్ సినిమా తర్వాత చిరంజీవి మరో భారీ బడ్జెట్ సినిమాతో మనందరం ఎందుకు రాబోతున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాకు గాను నిర్మాత చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కొణిదెల అంటూ వార్తలు వినబడుతున్నాయి. వివి వినాయక్ దర్శకత్వంలో రాబోతున్న చిరంజీవి చిత్రం రానున్నట్లు, ఇటీవల వీవీ వినాయక్ని కలిసిన చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. 

చిరంజీవి వివి వినాయక్ కాంబినేషన్ లో మరో చిత్రం: 

చిరంజీవి, వివి వినాయక్ కాంబినేషన్ లో ఇంతకు ముందు వచ్చిన ఠాగూర్ చిత్రం ఎంత భారీ విజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ సినిమాను సుష్మిత కొణిదెల నిర్మించనున్నారు. చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత కొణిదెల ఎప్పటినుంచో తన సొంత బ్యానర్ మీద చిరంజీవి తొలి చిత్రాన్ని నిర్మించే ప్లాన్లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే చిరంజీవి ప్రస్తుతం రాబోయే చిత్రం గురించి మాట్లాడుతూ సుష్మిత తప్పకుండా ఈ సినిమా తర్వాత ఒక పెద్ద నిర్మాతగా మారుతుందని, రాబోతున్న చిత్రం గురించి మరో హింట్ అందజేశారు. 

అయితే ఈసారి రాబోతున్న చిత్రం ద్వారా చిరంజీవి మళ్ళీ ప్రేక్షకులను అలరిస్తూ, కామెడీ ఎంటర్టైన్మెంట్ కలగలిపి ఉండేలా ఫ్యాన్స్ కోసం ప్రత్యేకమైన సినిమా ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు. 

చిరంజీవి నటించిన బోలో శంకర్ సినిమా విశేషాలు: 

2015లో అజిత్ కుమార్ నటించిన తమిళ చిత్రం వేదాళం రీమేక్ ఇప్పుడు చిరంజీవి నటిస్తున్న భోలా శంకర్. ఈ చిత్రంలో తమన్నా చిరంజీవికి జతగా నటిస్తూ ఉండగా, మరోవైపు కీర్తి సురేష్ చిరంజీవి సోదరి పాత్రలో కనిపించనుంది. బోలా శంకర్ చిత్రంలో రఘుబాబు, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, శ్రీ ముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, మరియు ఉత్తేజ్ కూడా నటించారు.

భారీ అంచనాల మధ్య, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీజర్ సోషల్ మీడియాలో విడుదలైన క్షణం నుంచి ఎన్నో ఆదరాభిమానాలను అందుకుంది అంతేకాకుండా సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. టీజర్ పవర్-ప్యాక్డ్ యాక్షన్ అంతే కాకుండా బ్యాగ్రౌండ్ లో వినిపించ మాస్ మ్యూజిక్ ర్యాంపేజ్ ఈ సినిమాపై మరింత హైప్ పెంచాయి. అదే అంచనాలతో భోళా శంకర్ ఆగస్టు 11న థియేటర్లలోకి రిలీజ్ అవ్వడమే కాకుండా గ్రాండ్ సక్సెస్ అందుకుంది. 

రిలీజైన బోలా శంకర్ సినిమా హిందీలో డబ్ కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ సినిమా తెలుగులో ఎంత సూపర్ సూపర్ హిట్ అయిందో హిందీలో కూడా అలాంటి హిట్ ఎక్స్పెక్ట్ చేస్తూ చిరంజీవి పాత్రకు డబ్బింగ్ చేశారు జాకీ ష్రాఫ్. 25 ఆగస్ట్ 2023న హిందీలో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది బోలా శంకర్. 

ఆకర్షణంగా నిలిచిన జం జం జజ్జనక సాంగ్::  

ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసిన చిరంజీవి బోలా శంకర్ లో పార్టీ సాంగ్ అవడంతో ప్రతి ఒక్కరూ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ పాటలో ఫోక్ అలాగే తెలంగాణ యాస కూడా మిక్స్ అయింది. అందుకే ప్రేక్షకులకు ఈ పాట గమ్మత్తుగా చెవులకు ఇంపుగా అనిపిస్తుంది. 

చిరంజీవి గారు 67 వయసులో కూడా తన డ్యాన్స్ ఇరగదీసారు. అంతేకాకుండా ఈ పాటలో ముఖ్యంగా తమన్న, కీర్తి గ్లామర్ ని ఆడ్ చేశారు. ఈ పాటలో సుశాంత్ కూడా కనిపించడం జరుగుతుంది. ఈ పాట వినగానే ఎవరికైనా సరే అదిరే స్టెప్పులు గుర్తొచ్చి డాన్స్ చేయాలనిపిస్తుంది. ఈ పాటకి మ్యూజిక్ అందించిన వారు మహత స్వారీ. పాటను ఆలపించిన వారు మంగ్లీ, అనురాగ్ కులకర్ణి.