గ్లోబల్ స్టార్ ట్యాగ్ తనకు వద్దన్న రామ్ చరణ్?

ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్స్‌కి నామినెట్ అయిన్నప్పటి నుండి.. గత కొన్ని రోజులుగా “గ్లోబల్ స్టార్” అనే పదం ట్రేండింగ్‌లో ఉంది. రామ్‌చరణ్‌ని “గ్లోబల్ స్టార్” అని పిలవడం ప్రారంభించారు సినీ నటులు మరియు ఆయన అభిమానులు. అయితే గ్లోబల్ స్టార్” అనే పదం “ది హాలీవుడ్ క్రిటిక్స్” అసోసియేషన్ వారు ఉపయోగించడంతో ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇక అప్పటి నుండి, తెలుగు ప్రేక్షకులు, నిర్మాతలు, దర్శక నిర్మాతలు కూడా అతన్ని గ్లోబల్ స్టార్ అని పిలవడం ప్రారంభించారు. అయితే […]

Share:

ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్స్‌కి నామినెట్ అయిన్నప్పటి నుండి.. గత కొన్ని రోజులుగా “గ్లోబల్ స్టార్” అనే పదం ట్రేండింగ్‌లో ఉంది.

రామ్‌చరణ్‌ని “గ్లోబల్ స్టార్” అని పిలవడం ప్రారంభించారు సినీ నటులు మరియు ఆయన అభిమానులు. అయితే గ్లోబల్ స్టార్” అనే పదం “ది హాలీవుడ్ క్రిటిక్స్” అసోసియేషన్ వారు ఉపయోగించడంతో ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇక అప్పటి నుండి, తెలుగు ప్రేక్షకులు, నిర్మాతలు, దర్శక నిర్మాతలు కూడా అతన్ని గ్లోబల్ స్టార్ అని పిలవడం ప్రారంభించారు. అయితే మెగా పవర్‌స్టార్ మాత్రం దీనిపై పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. 

ఈ రోజు (మార్చి 27) RRR నటుడి పుట్టిన రోజు సందర్భంగా.. మేకర్స్  #RC15  చిత్రం యొక్క టైటిల్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేసారు. ఈ చిత్రానికి “గేమ్ ఛేంజర్” అనే టైటిల్‌ను కూడా పెట్టినట్లు వారు తెలిపారు. ఇక ఈ మోషన్ పోస్టర్ చూసి తన అభిమానులు తెగ సంబరపడి పోతున్నారు. మరోవైపు నిర్మాత దిల్ రాజు రామ్ చరణ్ కోసం “గ్లోబల్ స్టార్” అనే ట్యాగ్ వాడకుండా “మెగా పవర్‌స్టార్” అనే టైటిల్‌ను ఉపయోగించడాన్ని చూసి ఆయన అభిమానులు  ఆశ్చర్యపోతున్నారు. కొత్త ట్యాగ్ వాడటం మరిచిపోయారా అని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆ స్టార్ హీరో మాత్రం ఈ కొత్త ట్యాగ్ పై అస్సలు ఆసక్తి చూపడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరో రెండు గ్లోబల్ హిట్స్ ఇస్తే తప్ప ఆ ట్యాగ్ తనకు వద్దని, అప్పటి వరకు గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్‌ని ఉపయోగించవద్దని దిల్ రాజును  రామ్ చరణ్ కోరినట్లు తెలుస్తోంది. అతని “గేమ్ ఛేంజర్” మరియు తదుపరి చిత్రం కూడా పాశ్చాత్య దేశాలలో బాగా సక్సెస్ అయితే.. తనని తాను గ్లోబల్ స్టార్ అని పిలుచుకోవడంలో ఇబ్బంది ఉండదని చెప్పినట్లుచ్చు సమాచారం. ఈ కారణంగానే.. ఈ హీరో పేరుకు ముందుగా గ్లోబల్ స్టార్ అని కాకుండా.. మెగా పవర్‌స్టార్‌గా మార్చినట్లు చెబుతున్నారు. 

కాగా ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుల వేదికపై.. దర్శధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ మూవీ దుమ్ము రేపింది. ఈ మూవీలో రామ్ చరణ్, జూనియర్ ఎన్ఠీఆర్ ప్రధాన పాత్రల్లో నటించారు.  ఈ సినిమాలో గీత రచయిత చంద్రబోస్‌ రచించిన నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ దక్కింది.  మార్చి 12న జరిగిన 95వ అకాడమీ అవార్డులలో మన తెలుగు సినిమాకు ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఈ ఆస్కార్ అవార్డ్ దక్కింది. దర్శకుడు SS రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలోని నాటు నాటు.. ఆస్కార్‌ దక్కించుకోవడంతో భారతదేశం కీర్తి సరికొత్త అధ్యాయాన్ని సృష్టించినట్లయ్యింది. ఇక తెలుగు చిత్ర పరిశ్రమ చరిత్రలో ఓ తెలుగు చిత్రం ఇలా ఆస్కార్‌ అవార్డు కోసం నామినేట్‌ కావడం ఇదే తొలిసారి. అంతేకాకుండా ఈ అవార్డు రావడం కూడా ఇదే మొదటిసారి. మన తెలంగాణ యాసలో రాసిన ఈ పాటకు.. కీరవాణి మ్యూజిక్ అందించగా, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఆలపించారు.