సూర్య పుట్టినరోజు వేడుకల్లో అపశృతి

ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.  గత కొన్ని సంవత్సరాలుగా తన సినిమాలతో అటు తమిళ్ ఇటు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాదు విపరీతమైన ఫ్యాన్ బేస్ ను కూడా సొంతం చేసుకున్నారు. సహజంగా ప్రపంచంలో దేనినైనా కొనవచ్చు కానీ హీరో మీద అభిమానులకు ఉన్న అభిమానాన్ని మాత్రం ఎవరూ కొనలేరు.  ముఖ్యంగా తెలుగు అభిమానులు చూపించే ప్రేమానురాగాలను కొనడం ఏ ఒక్క హీరోకి సాధ్యం కాదు. ఒక్కసారి మనసులో […]

Share:

ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.  గత కొన్ని సంవత్సరాలుగా తన సినిమాలతో అటు తమిళ్ ఇటు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాదు విపరీతమైన ఫ్యాన్ బేస్ ను కూడా సొంతం చేసుకున్నారు. సహజంగా ప్రపంచంలో దేనినైనా కొనవచ్చు కానీ హీరో మీద అభిమానులకు ఉన్న అభిమానాన్ని మాత్రం ఎవరూ కొనలేరు.  ముఖ్యంగా తెలుగు అభిమానులు చూపించే ప్రేమానురాగాలను కొనడం ఏ ఒక్క హీరోకి సాధ్యం కాదు. ఒక్కసారి మనసులో మా హీరో అనుకున్నారంటే ఇక ఆ హీరో తమిళవాడా? తెలుగు వాడా? లేక హిందీ నా ? అనేది అసలు పట్టించుకోరు

తమ అనుకున్న హీరోకి తమ గుండెల్లో గుడి కట్టేస్తారు.. ఇక అలాంటి వారి పుట్టినరోజులు వచ్చాయంటే చాలు పండుగ కన్నా ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటారు.  పూలాభిషేకాలు ,పాలాభిషేకాలతో పాటు ఫ్లెక్సీలు కడుతూ తమ గుండెల్లో హీరో పై ఉన్న అభిమానాన్ని ఇలా చేతల్లో చూపిస్తూ తమ హీరో గొప్పతనం గురించి అందరికీ మూత మోగిపోయేలా కేకలు వేస్తూ చూపెడుతూ ఉంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు వారి అత్యుత్సాహమే వారి ప్రాణాలను తీస్తుందని చెప్పాలి. ఇప్పటికే ఇలా అభిమాన హీరోల విషయంలో చాలామంది ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అభిమానులు కూడా నేడు ఫ్లెక్సీలు కడుతూ మృతి చెందడం నిజంగా బాధాకరమని చెప్పాలి.

ఈరోజు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య పుట్టినరోజు కావడంతో ఎంతో ఆనందంగా జరుపుకోవాలనుకున్న ఆయన అభిమానులకు ఈ వార్త విషాదంలోకి నెట్టివేసింది. కోలీవుడ్ నుంచి వచ్చినప్పటికీ కూడా సూర్యకి కోలీవుడ్ లో ఎంత పాపులారిటీ అయితే ఉందో తెలుగులో కూడా అంతకుమించి పాపులారిటీ ఉంది.  అందుకు కారణం ఆయన సినిమాలు మాత్రమే కాదు వ్యక్తిత్వం కూడా.. ఎంతో మందికి ఆయన చేసే సహాయం.. అగారం ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది చిన్నారులను చదివిస్తున్నారు కూడా. ఇక ఆయన వ్యక్తిత్వానికి ఫిదా అయిపోయిన తెలుగువారు ఆయనకు తమ గుండెల్లో గుడి కట్టుకున్నారు.  ఇక ఈరోజు ఆయన పుట్టినరోజు కావడంతో ఆంధ్రప్రదేశ్ నరసరావుపేటలోని మోపువారిపాలెం లో నివసిస్తున్న సూర్య అభిమానులైన నక్క వెంకటేష్,  పోలూరు సాయి సూర్య తమ గ్రామంలో సూర్య ఫ్లెక్సీలను కట్టాలని అనుకున్నారు.

అనుకున్నదే తడువుగా అక్కడ ఉన్న కరెంటు స్తంభాలానికి ఫ్లెక్సీలు కట్టాలి అని వాటిని ఎక్కగా.. ఒక్కసారిగా కరెంటు షాక్ కొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. అసలే వర్షాలు  ఎక్కువగా పడుతున్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోకుండా ఆ ఇద్దరు అలా కరెంటు స్తంభం ఎక్కేసరికి కరెంటు షాక్ కొట్టి.. వారు మరణించినట్లు గ్రామస్తులు వెల్లడించారు. ఇకపోతే వారి మరణం ఒక గ్రామస్తులనే కాదు యావత్ సూర్య అభిమానులను కలచివేస్తోంది.  ఇక ఇద్దరు కుర్రాళ్ళు కూడా డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నట్లు సమాచారం. చదువుకుంటున్న కొడుకులు ఇలా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో వారి తల్లిదండ్రులు గుండెలవిసేలా ఏడుస్తున్నారు. ఇక వారి బాధ వర్ణనాతీతం అనే చెప్పాలి.  ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది మరి ఈ విషయం సూర్య వరకు చేరితే ఆయన ఏవిధంగా స్పందిస్తారు అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఏది ఏమైనా అభిమానం అనేది ప్రాణాల మీదకు వచ్చేలా వుండకూడదు అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.