Chandra Mohan: ప్రముఖ నటుడు చంద్రమోహన్ కన్నుమూత..

Chandra Mohan: చంద్రమోహన్ (Chandra Mohan) మృతి పట్ల సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు చంద్రమోహన్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. చంద్రమోహన్ ఆల్ రౌండర్ అని మరో సీనియర్ నటుడు మురళీ మోహన్(Murali mohan) అన్నారు.

Courtesy: twitter

Share:

Chandra Mohan: చంద్రమోహన్ (Chandra Mohan) మృతి పట్ల సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు చంద్రమోహన్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. చంద్రమోహన్ ఆల్ రౌండర్ అని మరో సీనియర్ నటుడు మురళీ మోహన్(Murali mohan) 

అన్నారు.

 

సీనియర్ నటుడు చంద్రమోహన్ (Chandramohan) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రమోహన్.. హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం 9.45 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన కొన్నేళ్లుగా గుండె జబ్బుతో(Heart disease) బాధపడుతున్నారు. అలాగే ఆయన మధుమేహం(diabetes)తో కూడా బాధపడుతున్నారని సమాచారం. గతకొంతకాలంగా డయాలసిస్(Dialysis) కూడా చేయించుకున్నారు. పలు అనారోగ్య సమస్యలతో బాధపడిన చంద్రమోహన్ తన 78వ ఏట కన్నుమూశారు. ఆయనకు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చంద్రమోహన్ అంత్యక్రియలు సోమవారం హైదరాబాద్‌లో జరగనున్నాయి.

 

చంద్రమోహన్(Chandramohan) అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖరరావు. కృష్ణాజిల్లా పమిడిముక్కలలో 1945 మే 23న చంద్రమోహన్‌ జన్మించారు. మేడూరు, బాపట్లలో చదువుకున్నారు. డిగ్రీ వరకు చదువుకున్న చంద్రమోహన్ ఏలూరులో(Eluru) వ్యవసాయ శాఖ ఉద్యోగిగా పనిచేశారు. కళాతపస్వి కె.విశ్వనాథ్‌కి ఈయన చాలా దగ్గరి బంధువు. తమ్ముడి వరస అవుతారు. 1966లో ‘రంగుల రాట్నం’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. తొలి సినిమాకే ఉత్తమ నటుడిగా నంది అవార్డు(Nandi Award) అందుకున్నారు. అలాగే, 1987లో ‘చందమామ రావే’ సినిమాలో నటనకు కూడా నంది అవార్డు అందుకున్నారు. ‘అతనొక్కడే’ సినిమాలో సహాయ నటుడిగా నంది అవార్డు దక్కించుకున్నారు.

 

ఇక 1978లో వచ్చిన ‘పదహారేళ్ల వయసు’(Padaharella Vayasu) సినిమాలో నటనకు గానూ ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నారు. 2005లో వచ్చిన ‘అతనొక్కడే’ సినిమాలో నటనకు గానూ సహాయ నటుడిగా నంది దక్కించుకున్నారు. మొత్తంగా దాదాపు 932 సినిమాల్లో చంద్రమోహన్(Chandramohan) నటించారు. వీటిలో 175 సినిమాలు ఆయన హీరోగా చేశారు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా ఐదు దశాబ్దాల పాటు తెలుగు ప్రేక్షకులను అలరించారు. తెలుగు సినీ పరిశ్రమలో చెరిగిపోని ముద్ర వేశారు.

 

సినిమాల్లోకి రాకపోయి ఉంటే డబ్బులు లెక్కపెట్టే ఉద్యోగం చేసుకుని ఉండేవాడినని చంద్రమోహన్‌(Chandramohan) చాలా సార్లు చెప్పారు. ఫస్ట్ సినిమా సక్సెస్ అయిన తర్వాత కూడా ప్రభుత్వోద్యోగానికి వెళ్లాలా? వద్దా? అని చంద్రమోహన్ ఆలోచించారట. కానీ, ఆ కళామ్మతల్లి ముద్దుబిడ్డగా ఇక్కడే కొనసాగారు. ‘సిరిసిరిమువ్వ’(Sirimuvva) ‘శుభోదయం’(Shubhodayam), ‘సీతామహాలక్ష్మి’(Seethamahalaxmi), ‘పదహారేళ్ల వయసు’ వంటి ఎన్నో మరిచిపోలేని సినిమాలు తెలుగు ప్రేక్షకులకు అందించారు.

డబ్బుకు చంద్రమోహన్ ఎక్కువ విలువ ఇచ్చేవారు. డబ్బులు దాచుకున్నవారికే విలువ ఉంటుందని చెప్పేవారు. ఒకప్పుడు హీరోయిన్లకు లక్కీ హీరో చంద్రమోహన్‌. కెరీర్‌ ప్రారంభంలో శ్రీదేవి, జయసుధ, జయప్రద చంద్రమోహన్‌తోనే (Chandramohan) ఎక్కువ సినిమాలు చేశారు. కాగా, గోపీచంద్‌ హీరోగా నటించిన ‘ఆక్సిజన్‌’ సినిమాలో చివరిగా చంద్రమోహన్ కనిపించారు. తెలుగుతో పాటు తమిళంలోనూ చంద్రమోహన్ సినిమాలు చేశారు.

చంద్రమోహన్‌(Chandramohan) మంచి భోజనప్రియుడు. ఆయనకు శోభన్ బాబు(Shoban babu), మురళీమోహన్(Murali mohan) మంచి స్నేహితులు. రచయిత్రి జలంధరను చంద్రమోహన్ పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు మధుర మీనాక్షి, మాధవి ఇద్దరు కుమార్తెలు. ఇద్దరికీ వివాహాలు అయ్యాయి. మధుర మీనాక్షి సైకాలజిస్ట్‌గా అమెరికాలో స్థిరపడ్డారు. రెండో కుమార్తె మాధవి కూడా డాక్టరే. ఆమె చెన్నైలో ఉంటున్నారు.