అజిత్ వేదాళం సినిమాను చిరంజీవి భోళాశంకర్ తో భర్తీ చేస్తారా.?

రీమేక్ అంటే ఏమిటి…?  వేరే భాషలో చేసిన సినిమాను మళ్ళీ చేయడం.. కానీ మనం 22వ శతాబ్దంలో జీవిస్తున్నాము. ఇక్కడ ప్రేక్షకుల అభిరుచులు చాలా వేగంగా మారుతున్నాయి. ఇప్పుడు భాషా బేదాలు లేకుండా సినిమాలు చూస్తారు,  అంగీకరిస్తున్నారు. అయినప్పటికీ రీమేక్ ఇప్పటికీ ఒక విషయం మనం చెప్పాలంటే 10 సినిమాల్లో దాదాపు  5-7 సినిమాలు కచ్చితంగా రీమేక్ వర్షన్లే అది బాలీవుడ్ అయినా టాలీవుడ్ అయినా కోలివుడ్ అయినా రీమేకుల పద్ధతి చాలా కాలంగా ప్రభలంగా ఉంది. […]

Share:

రీమేక్ అంటే ఏమిటి…?  వేరే భాషలో చేసిన సినిమాను మళ్ళీ చేయడం.. కానీ మనం 22వ శతాబ్దంలో జీవిస్తున్నాము. ఇక్కడ ప్రేక్షకుల అభిరుచులు చాలా వేగంగా మారుతున్నాయి. ఇప్పుడు భాషా బేదాలు లేకుండా సినిమాలు చూస్తారు,  అంగీకరిస్తున్నారు. అయినప్పటికీ రీమేక్ ఇప్పటికీ ఒక విషయం మనం చెప్పాలంటే 10 సినిమాల్లో దాదాపు  5-7 సినిమాలు కచ్చితంగా రీమేక్ వర్షన్లే అది బాలీవుడ్ అయినా టాలీవుడ్ అయినా కోలివుడ్ అయినా రీమేకుల పద్ధతి చాలా కాలంగా ప్రభలంగా ఉంది. అయితే ఈ కాలంలో వారు బాగా రాణిస్తున్నారా.. అనేది ప్రశ్న…?

బోళా శంకర్  VS వేదాళం…

 అసలు VS రీమేక్ డిబేట్ లో,  తెలుగు చిత్రం భోళా శంకర్  సినిమాని పరిశీలించినట్లయితే ఇది బ్లాక్ బస్టర్ అజిత్ తమిళ చిత్రం వేదాళం యొక్క రీమేక్.. తెలుగు రీమేక్ లో మెగాస్టార్ నటిస్తున్నారు.  అయితే ఈ సినిమా వేదాళాన్ని నిలబెడుతుందా.?  లేక రీమేక్ పరాజయాల జాబితాలో చేరిపోతుందా..?  నిజాయితీగా నేను దాని గురించి ఆలోచించినప్పుడు అసలు వర్షన్ నిజంగా అద్భుతంగా ఉన్నప్పుడు ప్రేక్షకులు తమ శక్తిని మరియు డబ్బును రీమేక్ లో ఎందుకు పెట్టాలనుకుంటున్నారు.  కానీ సినిమా పరిశ్రమ భిన్నంగా పనిచేస్తుంది. చాలా రీమేక్ లు ఇక్కడ పనిచేసినందున  కచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుందని తీర్పు చెప్పలేము.

కానీ చిరంజీవి భోళా శంకర్ అజిత్ కుమార్ వేదాళం తో తేలిగ్గా పాస్ అయినట్లు అనిపిస్తుంది. అసలైతే తమిళ చిత్రం 2015లో విడుదలైనప్పటికీ సినీ ప్రియులలో ఇంకా గుర్తుండిపోయింది. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ మరియు సరైన మాస్ ప్రాజెక్ట్ అజిత్ కుమార్ టేబుల్ పై అజిత్ స్కీన్ ప్రజెంట్ ఉండడంతో చిరంజీవికి ఉనికి కూడా అదే న్యాయాన్ని గుర్తించగలరా.? అనేది పెద్ద ప్రశ్న….?  బోళా శంకర్ ఈ ఏడాది ఆగస్టు 11న థియేటర్లోకి రానున్నది.

ఇకపోతే భోళాశంకర్ సినిమా విషయానికి వస్తే..  బోళా శంకర్ నుంచీ ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ కు  అనూహ్యస్పందని వచ్చింది. బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన వాల్తేరు వీరయ్య తర్వాత మెగాస్టార్ చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం రీమేక్ భోళాశంకర్ సినిమా రిలీజ్ కు సిద్ధమైంది. తమన్నా హీరోయిన్గా చేస్తోంది. ఇక మరో కీలకపాత్రలో కీర్తి సురేష్ నటించగా..  ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఆగస్టు 11న ఈ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. వాల్తేరు వీరయ్య లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత ఈ చిత్రం రావడంతో భారీ అంచనాలే ఉన్నాయి. దీనికి తగ్గట్లుగానే మేకర్స్ ఈ సినిమాకి కూడా ఫ్యాన్స్ కోరుకునే అన్ని హంగులతో సిద్ధం చేస్తున్నారు చిత్ర బృందం. ఇది ఆగస్టు 11న విడుదల కానుండడంతో ఈ టీం ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. అందులో భాగంగా ఈ సినిమా నుంచి టీజర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే..? ఈ సినిమా టీజర్ ఏపీ తెలంగాణలో కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్ లో విడుదల చేశారు. టీజర్ కు ఓ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది.  ఇలా ఉంటే ఈ సినిమా టీజర్ ఓ రేంజ్ లో రికార్డును క్రియేట్ చేసింది.ఈ టీజర్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత ఎక్కువ వ్యూస్ పొందిన టీజర్ గా రికార్డు క్రియేట్ చేసింది. 24 గంటల్లో అత్యధికంగా వీక్షించిన టీజర్ కూడా ఇదేనట… టీజర్ విడుదలైన 24 గంటల్లోనే యూట్యూబ్లో 14 మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకోవడమే కాదు. యూట్యూబ్లో టాప్ ట్రెండ్ అవుతూ వావ్ అనిపించింది. ఇకపోతే ఖచ్చితంగా ఈ సినిమా అజిత్ వేదాళం సినిమా కంటే బాగా మెప్పిస్తుందని అభిమానులు సైతం చెబుతున్నారు.