వారిసు కాంబో మళ్ళీ వస్తోందా? ఎప్పుడు?

వంశీ పైడిపల్లి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఫిల్మ్‌ఫేర్ అవార్డు పొందిన దర్శకుడు.  ఆయన దర్శకత్వంలో 2010లో బృందావనం, 2014లో ఎవడు, 2015లో ఊపిరి, ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అంతే కాదు.. అతను స్క్రీన్ రైటర్ కూడా. వంశీ పైడిపల్లి 2002 లో ఈశ్వర్ చిత్రంతో అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన సినీ జీవితాన్ని ప్రారంభించారు. నిర్మాత దిల్ రాజుతో 2005 లో భద్ర చిత్రానికి పని చేస్తున్నప్పుడు అతని ప్రొడక్షన్ హౌస్‌లో సినిమా చేస్తానని […]

Share:

వంశీ పైడిపల్లి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఫిల్మ్‌ఫేర్ అవార్డు పొందిన దర్శకుడు.  ఆయన దర్శకత్వంలో 2010లో బృందావనం, 2014లో ఎవడు, 2015లో ఊపిరి, ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అంతే కాదు.. అతను స్క్రీన్ రైటర్ కూడా.

వంశీ పైడిపల్లి 2002 లో ఈశ్వర్ చిత్రంతో అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన సినీ జీవితాన్ని ప్రారంభించారు. నిర్మాత దిల్ రాజుతో 2005 లో భద్ర చిత్రానికి పని చేస్తున్నప్పుడు అతని ప్రొడక్షన్ హౌస్‌లో సినిమా చేస్తానని ఆఫర్ ఇచ్చాడు. ఆ తరువాత, అతను ప్రభాస్ తో 2009 లో మున్నా సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద కలెక్షన్ల మోత మోగించకపోయినా, ఏవరేజ్ అనిపించుకుంది. ఆ తర్వాత అతని డైరెక్షన్ లో బృందావనం వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ చిత్రం కమర్షియల్ హిట్ అయ్యింది. ఆ తర్వాత రామ్ చరణ్, అల్లు అర్జున్ లతో ఎవడు తీసి మరో హిట్ కొట్టాడు పైడిపల్లి.

2016లో ఆయన ఖాతాలోకి ‘ఊపిరి’ వచ్చి చేరింది. నాగార్జున, కార్తీ నటించిన ఈ చిత్రం ఫ్రెంచ్ సినిమా.. ది ఇంటచబుల్స్ (2011) ఆధారంగా, విమర్శనాత్మకంగా, వాణిజ్యపరంగా విజయం సాధించింది. ఈ చిత్రానికి గాను తెలుగులో ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకున్నాడు.

2019 లో అతను సూపర్ స్టార్ మహేష్ బాబుతో మహర్షికి పనిచేశాడు. ఈ చిత్రం చక్కని వినోదాన్ని అందించి జనాలకి చేరువయ్యి, చక్కని ఆదరణ పొందిన చిత్రంగా.. జాతీయ చలనచిత్ర అవార్డుకు ఎంపికైంది. సెప్టెంబరు 2021లో దిల్ రాజు.. సాయి పల్లవి హీరోయిన్ గా, విజయ్ 66వ చిత్రాన్ని మొదలుపెట్టాలని, తనతో పని చేయడానికి వంశీ పైడిపల్లిని తీసుకున్నారు. అయితే ఈ చిత్రీకరణ ఇంకా ప్రారంభం కాలేదు.

వంశీ పైడిపల్లి 2009లో మున్నా సినిమాతో తెరంగేట్రం చేసిన మాట తెలిసినదే. ఊపిరి మినహా మిగిలిన అన్ని చిత్రాలకు ఆయన దిల్ రాజుతో కలిసి పనిచేశారు. వీరి తాజా చిత్రం దళపతి విజయ్ నటించిన వారిసు.. తెలుగులో వారసుడుగా విడుదలయ్యింది. ఈ చిత్రం సంక్రాంతికి విడుదలయ్యి, తమిళంలో సూపర్ హిట్ అయ్యింది. కానీ తెలుగులో తన సత్తా  చూపలేకపోయింది. తెలుగులో మహర్షి, తమిళంలో వారిసు వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాలు వచ్చినప్పటికీ.. వంశీ పైడిపల్లి ఇతర హీరోలను తన సినిమా వరకు తీసుకురావడానికి ఒప్పించలేకపోతున్నాడు. మహర్షి విజయం తర్వాత, మహేష్ బాబు వంశీతో సినిమా చేస్తానని హామీ ఇచ్చాడు, కానీ అది ఇంకా పట్టాలెక్కలేదు. ఇప్పుడు వంశీతో మరో సినిమా చేయడానికి విజయ్ ఓకే చేశాడు. మరి ఈ సినిమా అతనికి ఎంత వరకు పనికొస్తుందో చూడాలి. మహర్షి తర్వాత వంశీ చాలా విరామం తీసుకున్నాడు. అతనితో పని చేయడానికి తెలుగు హీరోలెవరూ ఆసక్తి చూపలేదు. కానీ వారిసు విజయంతో అతనికి తమిళ మార్కెట్ కూడా ఇప్పుడు ఓపెన్ అయింది. దిల్ రాజు ఇతర సౌత్ ఇండస్ట్రీలకు తన సినిమా నిర్మాణాన్ని విస్తరిస్తున్నాడు. కాబట్టి ఈ ప్రాజెక్ట్‌ సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ప్రస్తుతానికి, మళ్లీ ఆ కాంబో వచ్చేలా, అది సక్సెస్ పట్టాలు ఎక్కేలా చేయడానికి వంశీ చాలా కష్టపడి స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడు.